చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.
Serial: డిగ్రీ లేకుండానే టీచర్ అయిపోయిందా? టాప్ టీఆర్పీ రేటింగ్ సీరియల్‌పై నెటిజన్ల ట్రోలింగ్, పేలుతున్న సెటైర్లు!
Anupama Serial New Leap Trolled: బుల్లితెరపై టాప్ టీఆర్పీతో దూసుకుపోతున్న సూపర్ హిట్ సీరియల్ అనుపమ మరో కొత్త లీప్ తీసుకుంది. ఈసారి హీరోయిన్ పాత్ర అనుపమ ఏకంగా టీచర్, ప్రొఫెసర్ అవతారమెత్తడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. డిగ్రీ లేకుండా ఉద్యోగం ఎలా వచ్చిందంటూ నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు.
Anupama Serial New Leap Trolled: దేశవ్యాప్తంగా బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సీరియల్ 'అనుపమ' (తెలుగులో 'ఇంటింటి గృహలక్ష్మి'కి మూలం) మరోసారి సోషల్ మీడియాలో విమర్శల పాలవుతోంది. రాజన్ షాహి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సీరియల్ ఏళ్లు గడుస్తున్నా టీఆర్పీ రేటింగ్స్‌లో మాత్రం సత్తా చాటుతోంది.

చిరాకు తెప్పిస్తున్న లీప్లు
అయితే కథను ముందుకు నడిపించే క్రమంలో మేకర్స్ తీసుకుంటున్న 'లీప్' (కథలో కొన్నేళ్ల ముందుకు వెళ్లడం) నిర్ణయాలు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నాయి. తాజాగా అనుపమ సీరియల్ మరో కొత్త మలుపు తిరిగింది. ఈసారి అనుపమ ఏకంగా టీచర్/ప్రొఫెసర్ పాత్రలో కనిపించనుండటంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.
ఇప్పటివరకు అనుపమ ఎన్ని అవతారాలు ఎత్తిందంటే?
రూపాలీ గంగూలీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సీరియల్ మొదలైనప్పటి నుంచి అనుపమ పాత్ర ఎన్నో వృత్తులను మారుస్తూ వచ్చింది. ఒక సాధారణ గృహిణిగా మొదలైన ఆమె ప్రయాణం.. ప్రొఫెషనల్ డ్యాన్సర్, డ్యాన్స్ అకాడమీ యజమాని, వంటల టీచర్, చెఫ్, వృద్ధాశ్రమ నిర్వాహకురాలు, కేఫ్ ఓనర్ వరకు సాగింది. తన భర్త అనుజ్ కపాడియా వ్యాపార సామ్రాజ్యాన్ని సైతం ఆమె సమర్థవంతంగా నడిపించింది.
వ్యాపారాలు చేసిన నిస్సహాయురాలిగానే
ఇన్ని రంగాల్లో రాణించి, వ్యాపారాలు నడిపిన అనుపమను మేకర్స్ ఇప్పటికీ ఒక నిస్సహాయురాలైన, అబల మహిళగానే చూపించడంపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి లీప్ తర్వాత ఆమె పాత వ్యాపారాలను వదిలేసి, కొత్త వృత్తిని ఎంచుకోవడం వెనుక లాజిక్ ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
నెట్టింట పేలుతున్న సెటైర్లు
తాజా ప్రోమోలో అనుపమను గుజరాతీ టీచర్‌గా చూపించడంపై ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ వేదికలుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "ఇన్ని చేసినా ఆమెకు కనీసం 'సారీ' అని సరిగ్గా పలకడం కూడా రాదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా టీచర్‌ను చేశారు!" అని ఒక నెటిజన్ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు.
డిగ్రీ కూడా లేకుండా టీచర్ ఏంటీ
"దేశంలో ఇంత నిరుద్యోగం ఉంటే, కనీసం డిగ్రీ కూడా లేని అనుపమకు ఇంత సులభంగా ఉద్యోగాలు ఎలా దొరుకుతున్నాయి?" అని మరొకరు ప్రశ్నించారు. "కథలో కొత్తదనం చూపించకుండా, పాత ఫార్ములానే మళ్లీ మళ్లీ వాడుతున్నారు. కారణం లేకుండానే కీలక పాత్రలను కథలోంచి మాయం చేస్తున్నారు. అసలు ఈ సీరియల్లో ఇప్పటివరకు ఎన్ని లీప్లు వచ్చాయో లెక్కే లేదు" అంటూ ప్రేక్షకులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.
విమర్శలు ఎన్ని ఉన్నా టీఆర్పీలో మాత్రం టాప్!
సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రేక్షకులు అనుపమను 'కొత్త ప్రయాణాల రాణి' అంటూ ఎగతాళి చేస్తున్నప్పటికీ.. సీరియల్ ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. కొందరు అభిమానులు ఈ కొత్త ట్రాక్‌ను స్వాగతిస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రసారమవుతున్నా, నేటికీ ఈ సీరియల్ దేశవ్యాప్తంగా టాప్-10 టీఆర్పీ జాబితాలో తన స్థానాన్ని నిలుపుకుంటోంది.
ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేయడంలో
తరచుగా టాప్-5, టాప్-3 స్థానాల్లో నిలుస్తూ బుల్లితెరపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది ఈ ట్రోలింగ్‌కు గురవుతున్న అనుపమ సీరియల్. కథనంపై ఎన్ని విమర్శలు వచ్చినా, కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేయడంలో 'అనుపమ' బృందం విజయవంతమవుతూనే ఉంది.

E-Paper
