Rashmika Bigg Boss: రష్మిక మందన్నాకు సీరియల్ హీరో ముఖేష్ గౌడ్ సీనియర్- బిగ్ బాస్ 10 తెలుగులో బయటపడ్డ కాలేజ్ కనెక్షన్

Bigg Boss Mukesh Gowda Senior To Rashmika Mandanna: బిగ్ బాస్ తెలుగు 10 వేదికపైకి వచ్చిన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నాకు ఊహించని సర్‌ప్రైజ్ ఎదురైంది. హౌస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ తన కాలేజీ సీనియర్ అని తెలిసి రష్మిక ఆశ్చర్యపోయారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Published on: Nov 23, 2026, 19:38:14 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bigg Boss Mukesh Gowda Senior To Rashmika Mandanna: బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు 10' ఆదివారం (నవంబర్ 22) నాటి ఎపిసోడ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తన తదుపరి చిత్రం 'మైసా' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా బిగ్ బాస్ 10 తెలుగు షోకు విచ్చేశారు.

రష్మిక మందన్నాకు సీరియల్ హీరో ముఖేష్ గౌడ్ సీనియర్- బిగ్ బాస్ 10 తెలుగులో బయటపడ్డ కాలేజ్ కనెక్షన్
రష్మిక మందన్నాకు సీరియల్ హీరో ముఖేష్ గౌడ్ సీనియర్- బిగ్ బాస్ 10 తెలుగులో బయటపడ్డ కాలేజ్ కనెక్షన్

గుప్పెడంత మనసు సీరియల్ హీరో

హోస్ట్ అక్కినేని నాగార్జునతో కలిసి హౌస్‌మేట్స్‌తో సరదాగా ముచ్చటించిన రష్మికకు, కంటెస్టెంట్, సీరియల్ హీరో ముఖేష్ గౌడ రూపంలో ఊహించని సర్‌ప్రైజ్ ఎదురైంది. తెలుగు ప్రేక్షకులకు 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో రిషి సర్‌గా సుపరిచితుడైన ముఖేష్ గౌడ, నిజ జీవితంలో రష్మికకు కాలేజీ సీనియర్ అనే విషయం బయటపడటంతో హౌస్‌మేట్స్ అంతా ఆశ్చర్యపోయారు.

కన్నడలో పలకరింపు.. బయటపడ్డ కాలేజీ కనెక్షన్

ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున హౌస్‌మేట్స్ అందరికీ రష్మికను పరిచయం చేశారు. ఈ క్రమంలో ముఖేష్ గౌడ వైపు తిరుగుతూ.. "ఇక్కడ రష్మిక ఉంది. నీకు ఇష్టమైన మైసూరు కన్నడలో మాట్లాడతావా.. బెంగళూరు కన్నడలో మాట్లాడతావా" అని నాగార్జున అడిగారు.

వెంటనే ముఖేష్ కన్నడలో రష్మికను పలకరిస్తూ.. "కాలేజీలో మీరు నాకు జూనియర్" అని చెప్పారు. ఆ మాట వినగానే రష్మిక ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. "నా స్నేహితులు మీతో కలిసి చదువుకున్నారు. అప్పట్లో మిమ్మల్ని కాలేజీలో చూశాను" అని ముఖేష్ వివరించారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న రష్మిక, తన సీనియర్‌ను ఇలా బిగ్ బాస్ వేదికపై కలవడం ఎంతో ఆనందంగా ఉందని చెబుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

గర్ల్‌ఫ్రెండ్ సినిమా అంటే ఇష్టం

రష్మిక నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా తనకు ఎంతో ఇష్టమని ముఖేష్ ప్రశంసించారు. దీనికి స్పందించిన రష్మిక.. "థ్యాంక్యూ.. నువ్వు హౌస్ నుంచి బయటకు వచ్చాక తప్పకుండా 'మైసా' సినిమా చూడు. ఇందులో నేను యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించాను" అని పేర్కొన్నారు.

కర్ణాటకలోని కూర్గ్, మైసూరు, బెంగళూరు నగరాల్లో రష్మిక విద్యాభ్యాసం సాగింది. బెంగళూరు కాలేజీ రోజుల నాటి పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ ముఖేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్న టీమ్ ఓ ప్రత్యేక పోస్ట్ పెట్టింది.

"ముఖేష్, రష్మిక గారు మైసూరు కన్నడలో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అన్నింటికంటే పెద్ద సర్‌ప్రైజ్ ఏంటంటే రష్మిక గారు ముఖేష్‌కు కాలేజీ జూనియర్. కాలేజీ కనెక్షన్ నుంచి బిగ్ బాస్ వేదికపై కలుసుకోవడం వరకు ఇదొక అద్భుతమైన క్షణం" అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

కాఫీ విత్ కరణ్ షోలో హిందీ ఉచ్ఛారణ

ఇక సినిమాల విషయానికి వస్తే, ఈ ఏడాది రష్మిక మందన్నా వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. హోమీ అదజానియా దర్శకత్వంలో షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో కలిసి నటించిన బాలీవుడ్ చిత్రం 'కాక్‌టెయిల్ 2' ఈ ఏడాదే విడుదలైంది. 2012 నాటి 'కాక్‌టెయిల్' చిత్రానికి ఆధ్యాత్మిక సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినా, ప్రపంచవ్యాప్తంగా రూ. 147 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఈ సినిమా ప్రచారంలో భాగంగా 'కాఫీ విత్ కరణ్' షోలో తన హిందీ ఉచ్చారణపై వచ్చిన విమర్శలపై రష్మిక స్పందించారు. తాను దక్షిణాది నుంచి వచ్చాను కాబట్టి తన హిందీలో ఆ యాస సహజంగానే ఉంటుందని ఆమె ధీటుగా బదులిచ్చారు.

రణబాలి కలెక్షన్స్

మరోవైపు ఫిబ్రవరిలో నటుడు విజయ్ దేవరకొండతో వివాహం జరిగిన తర్వాత, రష్మిక ఆయనతో కలిసి నటించిన 'రణబాలి' చిత్రం సైతం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'గీత గోవిందం' (2018), 'డియర్ కామ్రేడ్' (2019) తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా ఇది.

రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన రణబాలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 80 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం రష్మిక ఆశలన్నీ రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కిన 'మైసా'పైనే ఉన్నాయి. వాస్తవానికి నవంబర్ 27న ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా, అనివార్య కారణాలతో మైసా వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించనుంది.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.