Anurag Kashyap: అయితే దేశభక్తి లేదంటే దైవభక్తి.. ఈ రెండు రకాల సినిమాలే చూస్తున్నారు.. ఇది చాలా ప్రమాదం: అనురాగ్ కశ్యప్

Anurag Kashyap: బాలీవుడ్‌లో ప్రస్తుతం కేవలం దేశభక్తి, దైవ భక్తి ఆధారిత సినిమాలకు మాత్రమే అవకాశాలు లభిస్తున్నాయని, ఇతర విభిన్న కథాంశాలకు ఆమోదం లభించడం లేదని ప్రసిద్ధ దర్శకుడు, నిర్మాత అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published on: Oct 20, 2026, 14:39:50 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Anurag Kashyap: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా హిందీ చిత్రసీమలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌పై బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో కేవలం దేశభక్తి లేదా దైవ భక్తి నేపథ్యం ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత దక్కుతోందని, కొత్త ఆలోచనలు, విభిన్న కథాంశాలతో వచ్చే చిత్రాలను ఓకే చేయడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రావడం లేదని ఆయన స్పష్టం చేశారు.

Anurag Kashyap: అయితే దేశభక్తి లేదంటే దైవభక్తి.. ఈ రెండు రకాల సినిమాలే చూస్తున్నారు.. ఇది చాలా ప్రమాదం: అనురాగ్ కశ్యప్
Anurag Kashyap: అయితే దేశభక్తి లేదంటే దైవభక్తి.. ఈ రెండు రకాల సినిమాలే చూస్తున్నారు.. ఇది చాలా ప్రమాదం: అనురాగ్ కశ్యప్

గుల్షన్ దేవయ్య, రసికా దుగల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇండిపెండెంట్ మూవీ 'లిటిల్ థామస్' (Little Thomas) కు అనురాగ్ కశ్యప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 23న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో హిందూస్థాన్ టైమ్స్‌తో మాట్లాడిన ఆయన.. ప్రస్తుత హిందీ సినీ పరిశ్రమ పరిస్థితిపై తన ఆవేదనను వ్యక్తం చేశారు.

"దేశభక్తి, భక్తి సినిమాలు తప్ప ఇంకేదీ ఓకే కావడం లేదు!"

ఇటీవల బాలీవుడ్‌లో 'ధురంధర్ 2', 'హనుమాన్ అంశ్', 'బోర్డర్ 2' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాధించిన భారీ విజయాల తర్వాత, పరిశ్రమ మొత్తం అదే ట్రెండ్‌ను గుడ్డిగా అనుసరిస్తోందని అనురాగ్ కశ్యప్ అభిప్రాయపడ్డారు.

"ఇటీవలే నేను ఒక ప్రముఖ నిర్మాతతో మాట్లాడాను. ప్రస్తుతం ఏం చేయాలో తమకు అర్థం కావడం లేదని ఆయన చెప్పారు. మీరు ఒక దేశభక్తి సినిమా లేదా ఒక భక్తి రస చిత్రాన్ని మాత్రమే నిర్మించగలరు, అవి తప్ప మిగతా ఏ కథలకూ గ్రీన్ సిగ్నల్ (ఆమోదం) లభించడం లేదు. ఇది పక్కా నిజం.. హిందీ రంగానికి ఒక పెద్ద విషాదం" అని అనురాగ్ కుండబద్దలు కొట్టారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక సినిమాను నిర్మించి, దానిని థియేటర్లలోకి తీసుకురావడం చాలా కష్టతరమైన విషయమని ఆయన అన్నారు. అయితే అందరూ ఒకే రకమైన కథల వెనుక పడుతున్న సమయంలో 'లిటిల్ థామస్' లాంటి ఒక డిఫరెంట్ ఫ్యామిలీ సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా రిఫ్రెషింగ్ అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాజమౌళి, ఫహద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రస్తావన

చిన్నపిల్లలు నటించినంత మాత్రాన ప్రతీ సినిమాను 'కిడ్స్ ఫిల్మ్' అని అనలేమని వివరించే క్రమంలో అనురాగ్ కశ్యప్ తెలుగు సినిమాను ప్రస్తావించారు.

"ఉదాహరణకు, ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఫహద్ ఫాజిల్ కథానాయకుడిగా వస్తున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' (Don't Trouble The Trouble) చిత్రాన్ని తీసుకోండి. అందులో చిన్నపిల్లలు ప్రధాన పాత్రల్లో కనిపించినప్పటికీ, ఫహద్ ఫాజిల్ ఉన్నారు కాబట్టి దానిని కేవలం పిల్లల సినిమా అని అనగలమా?" అని ఆయన ప్రశ్నించారు.

ఫిలిం ఫెస్టివల్స్‌లో చూపించే అనేక 'కమింగ్ ఆఫ్ ఏజ్' సినిమాలు పిల్లల చుట్టూ తిరిగినప్పటికీ, అవి కేవలం పెద్దల కోసం మాత్రమే రూపొందిస్తారని, కాబట్టి కథలోని లోతును బట్టి సినిమాను చూడాలని చెప్పారు.

అక్టోబర్ 23న 'లిటిల్ థామస్' విడుదల

కౌశల్ ఓజా రచన, దర్శకత్వంలో రూపొందిన 'లిటిల్ థామస్' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ హృదయాంశ్ పరేఖ్ టైటిల్ రోల్‌లో నటించగా, గుల్షన్ దేవయ్య, రసికా దుగల్ కీలక పాత్రలు పోషించారు. అనుష్క షా, చారు ఓజా, రాజనీకాంత్ ఓజా, అక్షయ్ ఠాక్కర్, కబీర్ అహుజా, రంజన్ సింగ్‌లతో కలిసి అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 23న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం, మూస ధోరణిలో సాగుతున్న బాలీవుడ్‌లో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More