సినీ నటుడు మోహన్‌బాబుకు షాక్ - స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరణ
SFI విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో సినీనటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఆయన చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.
మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులపై ప్రశ్నించిన విద్యార్థి నేతలను కిడ్నాప్ చేసినట్లు నమోదైన కేసులో నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఆయన చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

తనపై నమోదైన ఈ కేసును కొట్టివేయాలని, అలాగే విచారణ పూర్తయ్యే వరకు తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ దశలో అరెస్ట్ నుంచి ఎటువంటి రక్షణ కల్పించలేమని కోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రధాన పిటిషన్ పై లోతైన విచారణ జరుపుతామంటూ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మార్చి 3కు వాయిదా వేశారు.
అసలు కేసు ఏంటి..?
ఈనెల 3వ తేదీన మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజుల వసూళ్లపై కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపేందుకు SFI విద్యార్థి సంఘం నాయకులు వెళ్తారు. ఈ క్రమంలో అక్బర్, వినోద్ అనే నాయకులు కిడ్నాప్‌నకు గురయ్యారు . అయితే వీరిని నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
బాధితుల ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో యూనివర్శిటీ ఛాన్స్‌లర్ గా ఉన్న మోహన్ బాబును ఏ3 గా చేర్చారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పీఆర్వో సతీష్‌తో పాటు పలువురు బౌన్సర్లను పోలీసులు అరెస్టు చేశారు.
క్వాష్ పిటిషన్ విచారణలో భాగంగా…. ఘటన జరిగిన రోజున తాను తిరుపతిలో లేనని మోహన్ బాబు బోర్డింగ్ పాస్‌లను కోర్టుకు సమర్పించారు. ఈ మేరకు మోహన్ బాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పోలీసులు మాత్రం ఆయన ప్రమేయంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని వాదిస్తున్నారు.కిడ్నాప్‌నకు ముందు, తర్వాత వర్సిటీ పీఆర్వో సతీష్‌తో మోహన్‌బాబు మాట్లాడారని, సందేశాలు కూడా పంపారని పోలీసులు చెబుతున్నారు.
ఇరువైపు వాదనలు విన్న ఏపీ హైకోర్టు…. ఈ వ్యవహారంలో ప్రధాన వ్యాజ్యంపై పూర్తిస్థాయిలో లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దీంతో తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. తాజా తీర్పుతో ఈ కేసులో పోలీసులు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

