...
...
Next Story

AR Rahman: టాలీవుడ్‌లోకి రెహమాన్ గ్రాండ్ ఎంట్రీ.. ఇదే రీజన్.. పె మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్పాడంటే?

AR Rahman: బాహుబలి విజయం, టాలీవుడ్ సాహసోపేతమైన ప్రయాణం చూశాకే నేరుగా తెలుగు సినిమా చేయడానికి సరైన సమయం అనిపించిందని ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్పష్టం చేశారు. రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విశేషాలను ఆయన పంచుకున్నారు.

Published on: May 23, 2026, 22:25:48 IST
Advertisement

AR Rahman: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో టాలీవుడ్ సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇదే విషయంపై స్వయంగా ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంత కాలానికి డైరెక్ట్ తెలుగు మూవీ చేయడం వెనుక ఉన్న రీజన్ ను వివరించాడు.

పెద్దితో తెలుగులోకి

పెద్ది మూవీ చేయడంపై ఏఆర్ రెహమాన్ కామెంట్లు వైరల్ (x)
పెద్ది మూవీ చేయడంపై ఏఆర్ రెహమాన్ కామెంట్లు వైరల్ (x)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' (#PEDDI) సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నేరుగా ఒక క్రేజీ తెలుగు సినిమాకు సైన్ చేయడం వెనుక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టారు.

బాహుబలి తెచ్చిన మార్పు

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా సాధించిన అఖండ విజయం తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ రూపురేఖలే మారిపోయాయని రెహమాన్ కొనియాడారు.

"బాహుబలి సినిమా సాధించిన భారీ విజయాన్ని నేను నిశితంగా గమనించాను. ఆ తర్వాత టాలీవుడ్ సరిహద్దులను బద్దలు కొడుతూ ఎంత ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్తుందో, ఎలాంటి సాహసోపేతమైన కథలతో ప్రయోగాలు చేస్తోందో చూశాను. తెలుగు సినిమా ఇండస్ట్రీ గ్లోబల్ స్థాయికి ఎదుగుతున్న తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది" అని రెహమాన్ పేర్కొన్నారు.

అందుకే పెద్ది సినిమా

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంతలా విస్తరిస్తున్న తరుణంలో, ఇక్కడ నేరుగా ఒక సినిమా చేయడానికి ఇదే సరైన సమయమని తాను భావించినట్లు రెహమాన్ వెల్లడించారు. సరిగ్గా అదే సమయంలో 'పెద్ది' ప్రాజెక్ట్ తన ముందుకు వచ్చినట్లు చెప్పారు.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న పెద్ది చిత్రం రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. రామ్ చరణ్ గెటప్, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్, ఇప్పుడు రెహమాన్ అందించే మ్యూజిక్ ఈ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తున్నాయి.

ఒకప్పుడు కేవలం డబ్బింగ్ సినిమాల ద్వారానే తెలుగు ప్రేక్షకులను పలకరించిన రెహమాన్, ఇప్పుడు నేరుగా తెలుగు స్ట్రైట్ సినిమాకు మ్యూజిక్ ఇస్తుండటంతో ఇండస్ట్రీలో సరికొత్త వైబ్ కనిపిస్తోంది. పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks