ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఇటీవల చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీశాయి. విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ సినిమా సమాజంలో విభజనను వాడుకుందని, బాలీవుడ్‌లో తనకు మతపరమైన కారణాలతో అవకాశాలు తగ్గాయని అతడు పరోక్షంగా కామెంట్ చేశాడు. దీనిపై కొందరు నెటిజన్లు రెహమాన్‌ను టార్గెట్ చేస్తూ.. అతడు తమిళనాడుకు, ఇండియాకు తలవంపులు తెచ్చారంటూ తీవ్ర విమర్శలు చేశారు.
విభేదించండి.. కానీ అవమానించకండి

ఈ ట్రోలింగ్‌పై మలయాళ సంగీత దర్శకుడు కైలాస్ మీనన్ ఘాటుగా స్పందించాడు. "ఏఆర్ రెహమాన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. అది ఆయన హక్కు. ఆయన అభిప్రాయంతో మీరు విభేదించవచ్చు. కానీ ఆయన అనుభవాన్ని తప్పుబట్టలేరు. విభేదించడం వేరు.. వ్యక్తిగతంగా దూషించడం వేరు. ప్రపంచం గర్వించదగ్గ కళాకారుడిని ‘డిస్‌గ్రేస్’ అని పిలవడం, ఆయన విశ్వాసాన్ని ప్రశ్నించడం విమర్శ కాదు.. అది విద్వేషం" అని కైలాస్ మీనన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. దశాబ్దాలుగా భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తిని ఇలా అవమానించడం సరికాదని హితవు పలికాడు.
ఏఆర్ రెహమాన్ కూతుళ్ల రియాక్షన్ ఇదే..
కైలాస్ మీనన్ చేసిన ఈ పోస్ట్‌కు రెహమాన్ కూతుళ్లు మద్దతు తెలిపారు. అతని కూతురు ఖతీజా రెహమాన్ స్పందిస్తూ.. కైలాస్ పోస్ట్‌కు చప్పట్లు, ఫైర్ ఎమోజీలతో కామెంట్ చేసింది. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అంతేకాకుండా "నా కష్టకాలంలో నా క్షేమ సమాచారాలు అడిగిన స్నేహితులకు దేవుడి ఆశీస్సులు ఉండాలి. వాళ్లు కోరుకున్నవన్నీ జరగాలి" అని ఒక ఎమోషనల్ నోట్ రాసింది.
మరో కూతురు రహీమా రెహమాన్ స్పందిస్తూ.. కైలాస్ మీనన్ పోస్ట్‌ను తన స్టోరీలో షేర్ చేసి, తండ్రిపై జరుగుతున్న దాడిని ఖండించింది.
ఏఆర్ రెహమాన్ వివరణ..
బీబీసీ ఏషియన్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. ముస్లిం మతానికి సంబంధించిన పదాలను సినిమాల్లో వాడే తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు మతపరమైన కారణాల వల్లే తనకు కొన్నాళ్లుగా బాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయి ఉండొచ్చని అన్నాడు.
{{/usCountry}}బీబీసీ ఏషియన్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. ముస్లిం మతానికి సంబంధించిన పదాలను సినిమాల్లో వాడే తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు మతపరమైన కారణాల వల్లే తనకు కొన్నాళ్లుగా బాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయి ఉండొచ్చని అన్నాడు.
{{/usCountry}}ఈ కామెంట్స్ పై దుమారం రేగడంతో రెహమాన్ కూడా క్లారిటీ ఇచ్చాడు. "సంగీతం ఎప్పుడూ సంస్కృతిని గౌరవించే, కలిపే మార్గంగానే నేను భావిస్తాను. భారతదేశమే నా ఇల్లు, నా గురువు. నా ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకున్నారు. సంగీతం ద్వారా సేవ చేయడమే నా లక్ష్యం" అని అతడు అన్నాడు.