...
...
Next Story

మరోసారి వైరల్ గా ఏఆర్ రెహమాన్ కామెంట్లు.. అదే ప్రపంచ సమస్య అంటూ.. మాటలు లేని మూవీకి మ్యూజిక్

దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కామెంట్లు మరోసారి వైరల్ గా మారాయి. తన కమ్యూనల్ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో సమాచారం తప్పుగా ప్రసారం కావడమే ప్రపంచ సమస్య అని అన్నారు. తాజాగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో రెహమాన్ పాల్గొన్నారు.

Published on: Feb 01, 2026 08:47 PM IST
Advertisement

సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. తన 'కమ్యూనల్' వ్యాఖ్యల వివాదం తర్వాత తొలిసారిగా ఆయన ఓ షోలో కనిపించారు. కపిల్ శర్మ నిర్వహించే 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో రెహమాన్ పాల్గొన్నారు. ఈ షోలో విస్పర్ గేమ్‌ (whisper game) సమయంలో రెహమాన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

కపిల్ షోలో రెహమాన్

ఏఆర్ రెహమాన్
ఏఆర్ రెహమాన్

'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' తాజా ఎపిసోడ్‌లో రెహమాన్ సెలబ్రిటీ గెస్ట్ గా వచ్చారు. ఒక సెగ్మెంట్‌లో ఈ ఆస్కార్ విజేత మాట్లాడుతూ సమాచారం, సందేశాలు ఎలా వక్రీకరణకు గురవుతాయో తెలిపారు.

‘‘సమాచారం ఎలా తప్పుగా అర్థం చేసుకుంటారో మాట్లాడేందుకు ఇదో మంచి అవకాశం. విభిన్న రాష్ట్రాలు, విభిన్న సంస్కృతులున్నాయి. అందుకే ఒకరు చెప్పింది మరొకరిగా తప్పుగా అర్థమవుతుంది. అదే ప్రపంచ సమస్య’’ అని రెహమాన్ అన్నారు.

మాటలు లేని సినిమా

తన తాజా సినిమా ప్రచారం కోసం రెహమాన్ 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో పాల్గొన్నారు. కిశోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గాంధీ టాక్స్’ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇది పూర్తిగా మూకీ మూవీ. అంటే మాటలు, డైలాగ్ లు ఏమీ ఉండవు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ తదితరులు నటించారు.

మ్యూజిక్ సెలబ్రేషన్

మాటలు లేని సినిమాకు మ్యూజిక్ అందించడంపై ఏఆర్ రెహమాన్ మాట్లాడారు. ‘‘డైలాగ్ లు లేకపోతే అది మ్యూజిక్ కు సెలబ్రేషన్. ఎందుకంటే మ్యూజిక్ ఇచ్చేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. అదే సమయంలో అది కాస్త భయాన్ని కూడా కలిగిస్తుంది. ప్రజలు ప్రతిదాన్ని జడ్జ్ చేస్తూనే ఉంటారు’’ అని రెహమాన్ తెలిపారు.

ఏది ఇచ్చినా

బాలీవుడ్‌పై తన వ్యాఖ్యల కారణంగా రెహమాన్ ఇటీవల విమర్శలను ఎదుర్కొన్నారు. BBC ఆసియా నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిందీ చిత్ర పరిశ్రమలో ఒక తమిళ సంగీత దర్శకుడిగా ఎప్పుడైనా వివక్షకు గురయ్యారా అని రెహమాన్‌ను అడిగారు.

దీనికి.. ‘‘బహుశా నాకు ఇది తెలియదు. దేవుడు దాచిపెట్టాడేమో. కానీ ఇలాంటిది ఏమీ అనిపించలేదు. గత ఎనిమిది సంవత్సరాలుగా బాలీవుడ్ లో పవర్ ఒకరి చేతులో నుంచి మరొకరి చేతుల్లోకి మారడంతో క్రియేటివిటీ లేని వ్యక్తులకు ఇప్పుడు అధికారం ఉంది. ఇది కమ్యూనల్ విషయం కూడా కావచ్చు’’ అని రెహమాన్ సమాధానమిచ్చారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe