...
...
Next Story

జనగణమన, వందేమాతరం పాడిన ఏఆర్ రెహమాన్- విమర్శకులకు దిమ్మతిరిగే ఆన్సర్- వీడియోలు వైరల్

లెజండరీ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వందేమాతరం పాడనన్నారనే వార్తలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఆ వార్తలకు, విమర్శకులకు రెహమాన్ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. స్టేజీపై జనగణమన, వందేమాతరం పాడారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

Published on: Jan 24, 2026, 16:45:00 IST
Advertisement

దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ చుట్టూ ఇటీవల ఎన్నో వివాదాలు నెలకొన్నాయి. బాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంపై ‘కమ్యూనల్’ వ్యాఖ్యలు చేసిన ఈ లెజండ్.. ఆ తర్వాత వందేమాతరం పాడనాన్నారనే వార్తతో మరింత కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. కానీ ఒక స్టేజ్ మీద ప్రదర్శనతో ఈ విమర్శలకు రెహమాన్ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు.

వందేమాతరం పాడిన రెహమాన్

ఏఆర్ రెహమాన్
ఏఆర్ రెహమాన్

యూఏఈలోని ఇతిహాద్ ఎరీనాలో ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ తెగ వైరల్ గా మారుతోంది. జనవరి 23న ఈ కాన్సర్ట్ జరిగింది. ఇందులో ఆయన తన పాపులర్ హిట్ సాంగ్స్ తో పాటు జనగణమన, వందేమాతరం పాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వైరల్ వీడియోలు

ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అభిమానులు ఆయన కచేరీ నుండి వీడియోలను పంచుకున్నారు. కొందరు అక్కడ రెహమాన్ ‘జనగణమన’, 'వందేమాతరం' పాడినట్లు కూడా పేర్కొన్నారు.

అద్భుతమైన కాన్సర్ట్

ప్రొడ్యూసర్ శేఖర్ కపూర్ యూఏఈలో ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ కు హాజరయ్యారు. ‘‘నిన్న రాత్రి అబుదాబిలోని ఇతిహాద్ ఎరీనాలో ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ అద్భుతంగా ఉంది. ప్రేక్షకులు కిక్కిరిసిపోయారు. 20,000 మంది రెహమాన్ ఆత్మతో కూడిన అందమైన పాటలకు కేరింతలు కొడుతూ, పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, కన్నీళ్లు పెట్టుకున్నారు’’ అని ఎక్స్ లో శేఖర్ పోస్టు చేశారు.

వందేమాతరం వీడియో

కాన్సర్ట్ లో రెహమాన్ ఛయ్యా ఛయ్యా సాంగ్ పాడగానే ఈవెంట్ ముగిసిందని అనుకున్నారు. కానీ రెహమాన్ మాత్రం లాస్ట్ సాంగ్ ఉందంటూ వందేమాతరం ఆలపించేసరికి ఎరీనా దద్దరిల్లింది.

జనగణమనతో మొదలెట్టి

మరో అభిమాని రెహమాన్ ప్రదర్శన వీడియోను వేరే కోణం నుండి పోస్ట్ చేశారు. మణిరత్నం 'అయుథా ఎళుత్తు' నుండి ఆయన ప్రసిద్ధ పాట 'జనగణమన'తో కచేరీని ప్రారంభించారని వెల్లడించారు. వందేమాతరంతో ముగించారని పేర్కొన్నారు.

జై హో సాంగ్

ప్రిన్స్ అనే లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా కాన్సర్ట్ ను చూసిన తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆయన ప్రకారం.. రెహమాన్ తన హిందీ సాంగ్స్ ను పాడటానికి ముందు, అనేక దక్షిణ భారత పాటలను ప్రదర్శించారు. ‘వందేమాతరం/మా తుఝే సలామ్’, 'జనగణమన'తో పాటు 4 గంటలపాటు జరిగిన కచేరీలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' నుండి రెహమాన్ ఆస్కార్ గెలుచుకున్న 'జై హో' పాటను కూడా పాడారని ఇన్‌ఫ్లుయెన్సర్ తెలిపారు.

రెహమాన్ ఏమన్నారు?

బీబీసీ ఆసియా నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక తమిళ సంగీత దర్శకుడిగా బాలీవుడ్‌లో ఎప్పుడైనా పక్షపాతం ఎదుర్కొన్నారా అని రెహమాన్‌ను అడిగారు. ఆయన 'గత ఎనిమిది సంవత్సరాలుగా శక్తి మార్పు జరిగింది. ఇప్పుడు సృజనాత్మకం కాని వారికి అధికారం ఉంది. ఇది కమ్యూనల్ విషయం కూడా కావచ్చు’’ అని అన్నారు. 'విభజనవాదం'తో డబ్బు సంపాదించుకుంటున్నారని 'ఛావా' సినిమాను కూడా విమర్శించారు.

చిన్మయి సపోర్ట్

రెహమాన్ ఒకసారి 'వందేమాతరం/మా తుఝే సలామ్' పాడటానికి నిరాకరించారని ఒక రిపోర్టర్ పేర్కొన్నప్పుడు చిన్మయి ఆయనకు అండగా నిలిచారు. ఆయన పిల్లలు, ఖతీజా, రహీమా, అమీన్ కూడా మద్దతుగా పోస్ట్‌లు చేశారు. రెహమాన్ ఒక వీడియోలో.. 'భారతదేశం నా ప్రేరణ, నా గురువు, నా ఇల్లు. ఉద్దేశాలు కొన్నిసార్లు తప్పుగా అర్థం అవుతాయని నేను అర్థం చేసుకున్నా' అని చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe