...
...
Next Story

శివుడి భజనతో తిరిగొచ్చిన సింగర్ అరిజీత్ సింగ్.. సినిమాలకు గుడ్‌బై చెప్పిన తర్వాత తొలి ఆల్బమ్

బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగింగ్‌కు గుడ్ బై చెప్పిన అరిజీత్ సింగ్.. ఓ డివోషనల్ సాంగ్ తో రీఎంట్రీ ఇచ్చాడు. 'ఓ శివ్ మేరే' అంటూ సాగే ఈ పాటను ఎలాంటి హడావిడి లేకుండా విడుదల చేశాడు. మహా శివరాత్రికి రెండు రోజుల ముందు ఈ పాట రావడం విశేషం.

Published on: Feb 13, 2026, 21:55:27 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

అరిజీత్ సింగ్ (Arijit Singh) అభిమానులకు నిజంగా ఇది పండగలాంటి వార్తే. బాలీవుడ్, ప్లేబ్యాక్ సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని వారాల్లోనే అరిజీత్ సింగ్ ఒక ఆధ్యాత్మిక పాటతో మళ్ళీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. 'ఓ శివ్ మేరే' (O Shiv Mere) అనే భక్తి పాటను విడుదల చేసి తన సంగీత ప్రయాణంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు.

అరిజీత్ సింగ్ డివోషనల్ సాంగ్

శివుడి భజనతో తిరిగొచ్చిన సింగర్ అరిజీత్ సింగ్.. సినిమాలకు గుడ్‌బై చెప్పిన తర్వాత తొలి ఆల్బమ్
శివుడి భజనతో తిరిగొచ్చిన సింగర్ అరిజీత్ సింగ్.. సినిమాలకు గుడ్‌బై చెప్పిన తర్వాత తొలి ఆల్బమ్

సింగర్ అరిజీత్ సింగ్ ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా ఈ పాటను ఆన్‌లైన్‌లో విడుదల చేయడం ఆసక్తిని రేకెత్తించింది. అతని అభిమానులు ఈ పాటను తమకు తాముగా వెతుక్కుని వింటున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ప్లేబ్యాక్ సింగింగ్ అసైన్‌మెంట్స్ నుంచి తప్పుకున్న తర్వాత అరిజీత్ నుంచి వచ్చిన మొదటి ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ ఇదే.

మహా శివరాత్రి ఈ ఆదివారం (ఫిబ్రవరి 15) జరుపుకోనున్న విషయం తెలిసిందే. అంతకు రెండు రోజుల ముందు అరిజీత్ ఓ శివ్ మేరే అంటూ సాగిపోయే పాటను తీసుకురావడం విశేషం.

ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా..

పాట విన్న అభిమానులు ఆనందం, ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. "అరిజీత్ మళ్ళీ తన సామ్రాజ్యంలోకి వచ్చేశాడు" అని ఒకరు కామెంట్ చేయగా.. "రిటైర్మెంట్ తర్వాత మనం చూస్తున్న అరిజీత్.. సకల భోగాలను త్యజించిన శివుడిలా ఉన్నాడు. లవ్ యూ అరిజీత్ సర్" అని మరొకరు ప్రశంసించారు.

"భారతీయ ఆధ్యాత్మికతను మీ సంగీతం ద్వారా ప్రపంచవ్యాప్తం చేయండి" అని మరొకరు కోరారు. ఇండిపెండెంట్ మ్యూజిక్ పెరగడం ఆర్టిస్టులకు, శ్రోతలకు మంచిదని, లేబుల్స్ డిమాండ్ కాకుండా తమకు నచ్చినట్లు మ్యూజిక్ చేసుకోవచ్చని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

అరిజీత్ సింగ్ రిటైర్మెంట్ అనౌన్స్‌మెంట్ ఇలా..

"ఇకపై నేను ప్లేబ్యాక్ వోకలిస్ట్‌గా కొత్త అసైన్‌మెంట్స్ తీసుకోనని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇదొక అందమైన ప్రయాణం" అని అతడు తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

దీనికి ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ స్పందిస్తూ.. "ఇది అరిజీత్ కొత్త దశకు ఆరంభం. నీలాంటి జీనియస్ నుంచి రాబోయే మ్యూజిక్ వినడానికి, అనుభూతి చెందడానికి ఆసక్తిగా ఉన్నాను. దీన్ని ఒక శకానికి ముగింపు అని అనలేం. సాంప్రదాయ పద్ధతుల్లో నీలాంటి ఆర్టిస్టును బంధించలేం. ఇంకా ఎత్తుకు ఎదగాలి డియర్ అరిజీత్" అని కామెంట్ చేసింది.

మార్కెటింగ్ లేదు.. మ్యూజిక్ మాత్రమే

సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నప్పటికీ.. అరిజీత్ ఈ పాటను అస్సలు ప్రమోట్ చేయలేదు. అతడు పబ్లిక్ లైఫ్ నుంచి ఎంత దూరంగా ఉంటున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. అయినా సరే విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ పాట యూట్యూబ్, ఫ్యాన్ గ్రూపుల్లో వైరల్ అయ్యింది. బాలీవుడ్ కమర్షియల్ హంగులకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారని విశ్లేషకులు అంటున్నారు.

‘తుమ్ హి హో’, 'చన్నా మేరేయా' వంటి సినిమాటిక్ రొమాంటిక్ హిట్‌లకు పూర్తి భిన్నంగా ఈ పాట ఉంది. మృదువైన వాయిద్యాలు, భక్తి సాహిత్యంతో కూడిన ఈ పాట మనసుకు హత్తుకునేలా ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe