...
...
Next Story

హీరోయిన్‌గా హీరో అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య ఎంట్రీ- తండ్రి దర్శకత్వంలోనే సీతా పయనం- తనతోపాటు మేనల్లుడి స్పెషల్ రోల్!

తమిళ స్టార్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాకు తండ్రి అర్జున్ సర్జానే దర్శకత్వం వహించడం విశేషం. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న సీతా పయనం సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ ప్రకటించారు.

Published on: Feb 7, 2026, 11:43:35 IST
Advertisement

కోలీవుడ్ హీరోగా అర్జున్ సర్జా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయనకు తెలుగులో సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యాక్షన్ కింగ్ అని పేరు తెచ్చుకున్న అర్జున్ సర్జా ఒకే ఒక్కడు, హనుమాన్ జంక్షన్, లై తదితర సినిమాలతో ఆకట్టుకున్నారు. అలాంటి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా డైరెక్టర్‌గా అవతారం ఎత్తిన విషయం తెలిసిందే.

యాక్షన్ కింగ్ దర్శకత్వం

హీరోయిన్‌గా హీరో అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య ఎంట్రీ- తండ్రి దర్శకత్వంలోనే సీతా పయనం- తనతోపాటు మేనల్లుడి స్పెషల్ రోల్!
హీరోయిన్‌గా హీరో అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య ఎంట్రీ- తండ్రి దర్శకత్వంలోనే సీతా పయనం- తనతోపాటు మేనల్లుడి స్పెషల్ రోల్!

అలా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం కానుంది.

సొంత కూతురు హీరోయిన్‌గా

సొంత కూతురుని హీరోయిన్‌గా అర్జున్ సర్జా పరిచయం చేయడం విశేషంగా మారింది. ఐశ్వర్య అర్జున్ డెబ్యూ మూవీ సీతా పయనంలో నిరంజన్, సత్య రాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు.

రెండు హైలెట్స్

యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించడం సినిమాకు మరో హైలెట్ కానుంది. అంతేకాకుండా అర్జున్ సర్జా మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా కూడా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఇలా అర్జున్ ఫ్యామిలీ నటిస్తున్న సినిమా సీతా పయనం కావడం ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్‌గా మారింది.

సీతా పయనం రిలీజ్ డేట్

తాజాగా సీతా పయనం రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. సీతా పయనం సినిమాను ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే స్పెషల్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన సీతా పయనం రిలీజ్ డేట్ పోస్టర్స్‌ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

వినూత్నంగా ప్రమోషన్స్

తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో సీతా పయనం సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి జి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించగా తెలుగు ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. చిత్రంలోని స్టంట్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ అందించారు.

ఫ్యామిలీస్‌కు నచ్చే అంశాలు

ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న సీతా పయనం మూవీలో ఫ్యామిలీస్‌కు బాగా నచ్చే అనేక అంశాలు ఉంటాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలో సీతా పయనం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe