...
...
Next Story

Ashu Reddy: వేధిస్తున్నావని కేసు పెడతా.. వాళ్ల జోలికి ఎందుకు వస్తున్నావ్.. రూ.కోటిన్నర తిరిగిస్తా: అషు రెడ్డి

Ashu Reddy: నటి అషు రెడ్డి కేసులో మరో ట్విస్ట్ ఎదురైంది. బాధితుడు ధర్మేంద్రకు ఆమె పంపిన ఓ ఆడియో మెసేజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో డబ్బు తిరిగి ఇస్తానంటూనే.. కాదంటే తిరిగి వేధింపుల కేసు పెడతానంటూ ఆమె వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.

Published on: Apr 28, 2026 04:40 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Ashu Reddy: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడి దగ్గర డబ్బు వసూలు చేసిన బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి తాజాగా తాను దోచుకున్న డబ్బులో కొంత మొత్తం తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది. బాధితుడి ధర్మేంద్రకు ఆమె పంపిన ఆడియో మెసేజ్ ఇప్పుడు బయటకు వచ్చింది. అందులో మే వరకు తనకు టైమ్ ఇస్తే రూ.కోటిన్నర తిరిగి ఇస్తానని ఆమె చెప్పింది.

అషు రెడ్డి మెసేజ్‌లో ఏముందంటే?

Ashu Reddy: వేధిస్తున్నావని కేసు పెడతా.. వాళ్ల జోలికి ఎందుకు వస్తున్నావ్.. రూ.కోటిన్నర తిరిగిస్తా: అషు రెడ్డి
Ashu Reddy: వేధిస్తున్నావని కేసు పెడతా.. వాళ్ల జోలికి ఎందుకు వస్తున్నావ్.. రూ.కోటిన్నర తిరిగిస్తా: అషు రెడ్డి

అషు రెడ్డి పంపిన వాయిస్ మెసేజ్ లో ధర్మేంద్రను ఓవైపు రిక్వెస్ట్ చేస్తూనే మరోవైపు కేసు పెడతానంటూ వార్నింగ్ ఇచ్చింది.

“ప్రవీణ అక్కకి కాల్ చేసావట. అందుకే నేను మెసేజ్ పెడుతున్నాను. నాకు మే వరకు టైమ్ ఇవ్వు. రూ.1.5 కోట్లు తిరిగి ఇస్తాను. మిగిలిన డబ్బు నేను జీవితంలో సెటిలైన తర్వాత ఇస్తాను. అవి కూడా ఇవ్వను అని అనడం లేదు. కానీ ఈ వివాదంలోకి నా అక్క, తల్లిని లాగొద్దు. నా తరఫున ప్రవీణ అక్క, వేణు స్వామి మధ్యవర్తిత్వానికి వస్తారు. వాళ్లతో మాట్లాడు. మే వరకు టైమ్ ఇవ్వమనే అడుగుతున్నాను. కాదు కూడదు అని అంటే నేను నీ మీద వేధింపుల కేసు పెడతాను. ఈ వివాదంలోకి అనవసరంగా నా ఫ్యామిలీని లాగుతున్నావని చెబుతాను” అని ధర్మేంద్రకు పంపిన ఆ మెసేజ్ లో అషు రెడ్డి వార్నింగ్ ఇచ్చింది.

అసలు ఏం జరిగిందంటే?

అషు రెడ్డిపై యెనుముల సత్యనారాయణ అనే వ్యక్తి కొన్ని రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని షేక్ పేట్ లో ఉండే ఆయన.. అషు రెడ్డి తన కొడుకు వై.వి.ధర్మేంద్రను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. ఈ మేరకు అషు రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సీసీఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు.

ధర్మేంద్ర, అషు మధ్య ఫస్ట్ ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. అయితే ధర్మేంద్రను ప్రేమిస్తున్నానని అషు చెప్పింది. పెళ్లి చేసుకుందామని నమ్మించింది. అవసరం ఉందని చెప్పి డబ్బు లాగడం మొదలెట్టింది. కారు, బంగారం, ఆస్తులను కొనుగోలు చేయించి, తన పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించుకుందని సత్యనారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మొత్తంగా రూ.9.35 కోట్లు

అషు రెడ్డి ఇలా మొత్తంగా రూ.9.35 కోట్ల విలువైన డబ్బు, 5 కిలోల బంగారం, ఫ్లాట్ లు, వాహనాలు కొనుగోలు చేయించుకుందని సత్యనారాయణ ఆరోపించాడు. అషు రెడ్డి సిస్టర్ రూ.50 లక్షలు తీసుకుందని తెలిపాడు.

ఆ తర్వాత పెళ్లి గురించి అడిగితే తప్పించుకుంటున్నారని, ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని సత్య నారాయణ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఓవైపు కేసు నడుస్తుండగానే బాధితుడితో సెటిల్మెంట్ కోసం అషు రెడ్డి ఇలా వాయిస్ మెసేజ్ పంపించడం గమనార్హం.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe