Ashu Reddy: పెళ్లి చేసుకుంటానని రూ.9.35 కోట్ల మోసం.. బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డిపై పోలీస్ కేసు

Ashu Reddy: బిగ్ బాస్ హాట్ బ్యూటీ, నటి అషు రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. ప్రేమించి, పెళ్లి చేసుకుంటాననే పేరుతో డబ్బు కాజేసిందని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Apr 26, 2026, 10:03:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ashu Reddy: బిగ్ బాస్ బ్యూటీ, సినీ నటి అషు రెడ్డిపై పోలీస్ కేసు నమోదవడం సంచలనంగా మారింది. ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేసిందని అషుతో పాటు ఆమె కుటుంబ సభ్యులపైనా పోలీస్ కంప్లైంట్ నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా రూ.9.35 కోట్లు కాజేసిందని అషు రెడ్డిపై ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

అషు రెడ్డి (instagram-Ashu Reddy)
అషు రెడ్డి (instagram-Ashu Reddy)

అషు రెడ్డిపై పోలీసు కేసు

బిగ్ బాస్ తో పాపులర్ అయిన అషు రెడ్డి టీవీ షోలు, సినిమాలు, సిరీస్ లతో సాగిపోతోంది. తాజాగా ఆమె జియోహాట్ స్టార్ ఓటీటీలో వస్తున్న విక్రమ్ ఆన్ డ్యూటీ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో అషు రెడ్డిపై పోలీస్ కేసు నమోదు కావడం గమనార్హం. ఇన్ స్టాలో హాట్ పోజులతో ఫొటోలు పెట్టే ఈ బ్యూటీ మోసం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.

పెళ్లి చేసుకుంటానని

అషు రెడ్డిపై యెనుముల సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని షేక్ పేట్ లో ఉండే ఆయన తన కొడుకు వై.వి.ధర్మేంద్రను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి అషు రెడ్డి మోసం చేసిందని ఆరోపించారు. ఈ మేరకు అషు రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సీసీఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు.

ఏమైందంటే?

సత్యనారాయణ ఫిర్యాదు ప్రకారం.. వై.వి.ధర్మేంద్ర లండన్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. 2018లో అతను ఇండియాకు వచ్చాడు. అప్పుడే అషుతో పరిచయం ఏర్పడింది. అమెరికాలో చదువుకున్న అషు సినిమాలో యాక్ట్ చేయడం కోసం హైదరాబాద్ కు వచ్చినట్లు ధర్మేంద్రతో చెప్పింది.

ధర్మేంద్ర, అషు మధ్య ఫస్ట్ ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. అయితే ధర్మేంద్రను ప్రేమిస్తున్నానని అషు చెప్పింది. పెళ్లి చేసుకుందామని నమ్మించింది. అవసరం ఉందని చెప్పి డబ్బు లాగడం మొదలెట్టింది. కారు, బంగారం, ఆస్తులను కొనుగోలు చేయించి, తన పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించుకుందని సత్యనారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు.

రూ.9.35 కోట్లు

అషు రెడ్డి రూ.9.35 కోట్ల విలువైన డబ్బు, 5 కిలోల బంగారం, ఫ్లాట్ లు, వాహనాలు కొనుగోలు చేయించుకుందని సత్యనారాయణ ఆరోపించాడు. అషు రెడ్డి సిస్టర్ రూ.50 లక్షలు తీసుకుందని తెలిపాడు. ఆ తర్వాత పెళ్లి గురించి అడిగితే తప్పించుకుంటున్నారని, ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని సత్య నారాయణ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More