Ashu Reddy Engagement: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి అభిమానులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. పెళ్లి పేరుతో ధర్మేంద్ర అనే ఓ ఎన్నారైని మోసం చేసిందన్న కేసు ఓవైపు నడుస్తుండగానే.. మరో వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేయడం విశేషం.
అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్

బిగ్‌బాస్ ఫేమ్, సోషల్ మీడియా స్టార్ అషు రెడ్డి పెళ్లి పీటలెక్కబోతోంది. గత కొంతకాలంగా తన పర్సనల్ లైఫ్, కెరీర్ అప్‌డేట్స్‌తో వార్తల్లో నిలుస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో ఒక్కసారిగా అభిమానులంతా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అషు రెడ్డి షేర్ చేసిన ఫొటోల్లో ఆమె ఎంతో అందంగా, సాంప్రదాయబద్ధంగా కనిపిస్తోంది. పట్టుచీర కట్టుకుని, ఒంటి నిండా బంగారు ఆభరణాలతో మెరిసిపోతున్న అషు మొహంలో పెళ్లి కళ స్పష్టంగా కనిపిస్తోంది. తన నిశ్చితార్థం వేడుక అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది. వరుడి చేయి పట్టుకున్న ఫొటోతోపాటు తన వేలికి తొడిగిన ఉంగరం చూసుకుంటూ ఉన్న ఫొటోలను ఆమె షేర్ చేసింది.
వరుడు ఎవరనేది సస్పెన్స్?
నిశ్చితార్థం ఫొటోలను షేర్ చేసినప్పటికీ.. అషు తన కాబోయే భర్త వివరాలను మాత్రం ఇంకా బయటపెట్టలేదు. ఈ ఫొటోల్లో ఎక్కడా అతని జాడే లేదు. కేవలం ఆ వరుడి చేయి మాత్రమే కనిపిస్తోంది. పైగా ఈ ఫొటోలకు ఆమె ఎలాంటి క్యాప్షన్ కూడా ఉంచలేదు.
దీంతో అభిమానుల్లో ఆ వ్యక్తి ఎవరా అన్న క్యూరియాసిటీ పెరిగిపోతోంది. గతంలో ఈమె ప్రేమలో ఉందని అనేక రూమర్లు వచ్చినప్పటికీ, అషు ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. ఇప్పుడు నేరుగా ఎంగేజ్‌మెంట్ ఫొటోలతోనే అందరికీ షాక్ ఇచ్చింది.
అషు రెడ్డి కేసు
{{/usCountry}}దీంతో అభిమానుల్లో ఆ వ్యక్తి ఎవరా అన్న క్యూరియాసిటీ పెరిగిపోతోంది. గతంలో ఈమె ప్రేమలో ఉందని అనేక రూమర్లు వచ్చినప్పటికీ, అషు ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. ఇప్పుడు నేరుగా ఎంగేజ్‌మెంట్ ఫొటోలతోనే అందరికీ షాక్ ఇచ్చింది.
అషు రెడ్డి కేసు
{{/usCountry}}అషు రెడ్డిపై ఈ మధ్యే ధర్మేంద్ర అనే వ్యక్తి తండ్రి సత్యనారాయణ కేసు పెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని తన కొడుకు దగ్గర రూ.9.5 కోట్లు వసూలు చేసిందని వాళ్లు కేసు పెట్టారు. ఈ కేసుకు సంబంధించి అటు అషు రెడ్డి, ఇటు ధర్మేంద్ర మాట్లాడిన ఆడియో టేపులు కూడా బయటకు వచ్చయి. దీనిపై ఓవైపు కోర్టులోనూ కేసు నడుస్తుండగానే అషు రెడ్డి ఈ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ముందుగా డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయిన అషు రెడ్డి.. జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే చీటింగ్ కేసులో ఆమె చిక్కుకుంది. అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్, వరుడు ఎవరు, పెళ్లి ఎప్పుడు అనే వివరాలను త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: అషు రెడ్డి నిశ్చితార్థం ఎప్పుడు జరిగింది?
అషు రెడ్డి తన నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది, ఈ వేడుక గత రెండు రోజుల్లోనే జరిగినట్లు సమాచారం.
ప్రశ్న: అషు రెడ్డి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరు?
జవాబు: వరుడి వివరాలను అషు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కేవలం ఫొటోలు మాత్రమే షేర్ చేసింది.
ప్రశ్న: అషు రెడ్డి ఏ బిగ్‌బాస్ సీజన్‌లో పాల్గొన్నారు?
జవాబు: అషు రెడ్డి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.