...
...
Next Story

Suniel Narang: బాల్డ్ హెడ్.. డూప్లికేట్ విగ్గు.. నిర్మాత నాగవంశీకి నారంగ్ కౌంటర్.. ముదురుతున్న వివాదం

Suniel Narang: నిర్మాతలు, థియేటర్ ఓనర్ల మధ్య వివాదం ముదురుతోంది. ఒకరికి ఒకరు కౌంటర్ ఇచ్చుకుంటున్నారు. తాజాగా నిర్మాత నాగవంశీ గురించి ఏషియన్ సునీల్ నారంగ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

Published on: May 14, 2026, 11:55:54 IST
Advertisement

Suniel Narang: ఏషియన్ మల్టీప్లెక్స్ అధినేత సునీల్ నారంగ్ కామెంట్లు కలకలం రేపుతున్నాయి. ప్రొడ్యూసర్ నాగవంశీకి కౌంటర్ ఇస్తూ సునీల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. బాల్డ్ హెడ్, డూప్లికేట్ విగ్ అంటూ సునీల్ మాట్లాడటం సంచలనంగా మారింది. దీంతో ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఎగ్జిబ్యూటర్ల వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది.

సునీల్ నారంగ్ కౌంటర్

నాగవంశీ వర్సెస్ సునీల్ (x)
నాగవంశీ వర్సెస్ సునీల్ (x)

తాజాగా టీవీ9 న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ సునీల్ నారంగ్ చేసిన కామెంట్లు సెన్సేషనల్ గా మారాయి. నాగవంశీ గురించి మాట్లాడుతూ సునీల్ కొత్త వివాదానికి తెరతీసినట్లే కనిపించారు.

‘‘ఆ ప్రొడ్యూసర్ ఉంటాడు కదా. బేటా క్యా నామ్ హై. ప్రొడ్యూసర్ కళ్లద్దాలు పెట్టుకుంటాడు. బాల్డ్ హెడ్. డూప్లికేట్ విగ్ పెట్టుకుంటాడు. నాగవంశీ.. పాము.. హా సారీ నాగవంశీ. నాకు మల్టీప్లెక్స్ లు ఉన్నాయని ఆయన ఏదో అన్నాడు. ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ కట్టేస్తానని చెప్పాడు’’ అని సునీల్ నారంగ్ సంచలన కామెంట్లు చేశాడు.

సింగిల్ స్క్రీన్ కూడా

‘‘ఈ లిస్ట్ ఆయనకు చూపెట్టండి. మేం కట్టిన సింగిల్ థియేటర్స్ 33 ఉన్నాయి. ఇంకా 5 థియేటర్స్ కడుతున్నాం. ప్లస్ 15 సింగిల్ థియేటర్స్ బుకింగ్ చేస్తా. వాళ్లు మంచిగా ఉండాలనే కోరుకుంటా. మల్టీప్లెక్స్ లు కూడా ఏమంతా గొప్పగా లేవు. ఏదో బ్రేక్ ఈవెన్ వస్తాయి అంతే. ఈ సింగిల్ థియేటర్స్ పర్సంటేజీ ఇస్తే కొంచెం బతుకుతాయి’’ అని సునీల్ నారంగ్ తెలిపాడు.

నాగవంశీ ఏమన్నాడంటే?

ఇన్ని రోజులు లేనిది ఎగ్జిబ్యూటర్లు ఇప్పుడు డిమాండ్ చేయడం వెనుక పెద్ది మూవీని అడ్డుకునే కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, నాగవంశీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పెద్ది మూవీని దేశమంతా సెలబ్రేట్ చేసుకోవాలన్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది జూన్ 4వ తేదీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సినిమా టికెట్ ధరలు పెంచే వీల్లేదని ఎగ్జిబ్యూటర్లు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ది సినిమా రిలీజ్ లోపు ఈ గొడవ సద్దుమణుగుతుందా? లేదా ఈ కాంట్రవర్సీ ఎఫెక్ట్ రామ్ చరణ్ మూవీపై పడుతుందా? అన్నది చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe