Today OTT: ఇవాళ నేరుగా తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన డార్క్ కామెడీ ఫిల్మ్.. హీరో భార్యనే ప్రొడ్యూసర్

Today OTT: ఇవాళ ఓటీటీలోకి ఓ డైరెక్ట్ మూవీ వచ్చేసింది. డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఇందులో రాజ్ కుమార్ రావ్ లీడ్ రోల్ ప్లే చేశాడు. ఈ సినిమాకు అతని భార్య పత్రలేఖ ప్రొడ్యూసర్. 

Apr 15, 2026, 14:27:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Today OTT: ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సినిమాలను ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇవాళ (ఏప్రిల్ 15) ఓ విభిన్నమైన స్టోరీ లైన్ తో తెరకెక్కిన కామెడీ మూవీ ‘టోస్టర్’ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. డార్క్ కామెడీ తో సాగుతున్న ఈ సినిమాలో రాజ్ కుమార్ రావ్ లీడ్ రోల్ ప్లే చేశాడు.

నేరుగా ఓటీటీలోకి కామెడీ ఫిల్మ్ (x)
నేరుగా ఓటీటీలోకి కామెడీ ఫిల్మ్ (x)

టోస్టర్ ఓటీటీ

హిందీ డార్క్ కామెడీ మూవీ ‘టోస్టర్’ ఓటీటీలోకి వచ్చేసింది. బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మూవీ బుధవారం డిజిటల్ డెబ్యూ చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్ ఫిల్మ్ గా తెరకెక్కింది. నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

తెలుగులోనూ

టోస్టర్ మూవీ తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ లో ఈ కామెడీ ఫిల్మ్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావ్, సాన్యా మల్హోత్రా, అర్చన పూరన్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఫరా ఖాన్ తదితరులు నటించారు. ఈ టోస్టర్ మూవీకి వివేక్ దాస్ చౌదరి డైరెక్టర్.

భార్య ప్రొడ్యూసర్

టోస్టర్ సినిమాకు మరో స్పెషాలిటీ ఉంది. ఈ సినిమాను హీరో రాజ్ కుమార్ రావ్ భార్య పత్రలేఖ నిర్మించింది. ఈ మూవీతోనే ఆమె ప్రొడ్యూసర్ గా మారడం గమనార్హం. కంపా ఫిల్మ్స్ బ్యానర్ పై ఆమె ఈ మూవీని నిర్మించింది.

టోస్టర్ స్టోరీ

చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న కథలో ఎలాంటి ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాన్ని తెరపైకి టోస్టర్ సినిమా రూపంలో తీసుకొచ్చారు. ఈ టోస్టర్ సినిమాలో రమాకాంత్ అనే ఒక పిసినారి క్యారెక్టర్‌లో రాజ్‌కుమార్ రావ్ నటించాడు. డబ్బులు ఆదా చేయడం మంచిదే. కానీ మరీ కంజూస్ గా వ్యవహరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

పెళ్లి ఆగిపోతే

రమాకాంత్, సాన్యా మల్హోత్రా ఒక పెళ్లికి వెళ్తారు. కాబోయే దంపతులకు బహుమతిగా రూ.5 వేలు విలువ చేసే ఒక టోస్టర్ ను తీసుకెళ్తారు. ఆ జోడీకి గిఫ్ట్ అందిస్తారు. అయితే ఆ పెళ్లి ఆగిపోతుంది. దీంతో తను ఇచ్చిన టోస్టర్‌ను ఎలాగైనా తిరిగి చేజిక్కించుకోవాలని రమాకాంత్ ప్రయత్నిస్తాడు.

ఆ చిన్న వస్తువు కోసం అతను చేసే ప్రయత్నాలు చివరికి ఊహించని మర్డర్ మిస్టరీలు, ప్రమాదాలు, దాగి ఉన్న రహస్యాలు బయటపడే స్థాయికి వెళ్తాయి. అసలు రమాకాంత్ అలా చేయడానికి కారణం ఏంటీ? బయటపడ్డ ఆ రహస్యాలు ఏంటీ? అనేది తెలియాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న టోస్టర్ చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More