ఇటీవల కాలంలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది తాప్సీ పన్ను. ఆమె ప్రధాన పాత్రలో నటించిన అలాంటి మరో సినిమానే ‘అస్సీ’. ఇదో కోర్టు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. దీనికి అనుభవ్ సిన్హా డైరెక్టర్. తాస్పీతో అతను చేస్తున్న మూడో సినిమా ఇది. శుక్రవారం (జనవరి 23) ఈ మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఇంక్ నిండిన ముఖంతో తాప్సీ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
తాప్సీ లుక్

తాప్సీ లీడ్ రోల్ ప్లే చేస్తున్న మూవీ ‘అస్సీ’. ఈ బాలీవుడ్ సినిమా నుంచి ఇవాళ రిలీజైన మోషన్ పోస్టర్ వైరల్ గా మారింది. ఇది సినిమా టోన్, కథనంపై ఉత్కంఠను మరింత పెంచింది. ఈ క్లిప్ లో ఒక మహిళ రైలు పట్టాలపై పరిగెత్తుతుంది. ముగ్గురు వ్యక్తులు వెంటపడుతుండగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. అప్పుడే తాప్సీ ముఖం ఇంక్ తో పూర్తిగా నిండిన లుక్ కనిపిస్తుంది. ‘అర్జెంట్ వాచ్ (అత్యవసరంగా చూడాలి)’ అనే లైన్ వస్తుంది.
కోర్టులో కలుద్దాం
అస్సీ మోషన్ పోస్టర్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది తాప్సీ. ‘‘చాలా కాలమైంది. దీన్ని నార్మల్ చేయడానికి చాలా కాలమైంది. కోర్టులో కలుద్దాం.. అంటే థియేటర్లలో. అస్సీ - అర్జెంట్ వాచ్. ఫిబ్రవరి 20 నుండి థియేటర్లలో మాత్రమే’’ అని ఈ మోషన్ పోస్టర్ కు క్యాప్షన్ ఇచ్చింది తాప్సీ.
రిలీజ్ డేట్
మోసన్ పోస్టర్ ప్రకారం అస్సీ మూవీ ఫిబ్రవరి 20, 2026 న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అనుభవ్ సిన్హా డైరెక్టర్. తాప్సీ-అనుభవ కాంబినేషన్లో ఇది మూడో సినిమా. వీళ్లు ఇప్పటికే ‘ముల్క్’, 'థప్పడ్’ సినిమాల కోసం కలిసి పని చేశారు. ఇప్పుడో అస్సీతో మళ్లీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.
{{/usCountry}}మోసన్ పోస్టర్ ప్రకారం అస్సీ మూవీ ఫిబ్రవరి 20, 2026 న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అనుభవ్ సిన్హా డైరెక్టర్. తాప్సీ-అనుభవ కాంబినేషన్లో ఇది మూడో సినిమా. వీళ్లు ఇప్పటికే ‘ముల్క్’, 'థప్పడ్’ సినిమాల కోసం కలిసి పని చేశారు. ఇప్పుడో అస్సీతో మళ్లీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.
{{/usCountry}}అస్సీ సినిమాలో కణి కుసృతి, రేవతి, మనోజ్ పహ్వా, కుముద్ మిశ్రా, మహమ్మద్ జీషాన్ అయ్యూబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, సుప్రియా పాఠక్, సీమా భార్గవ ప్రత్యేక పాత్రలలో కనిపిస్తారు.
కోర్టు డ్రామా
ఒక పత్రికా ప్రకటన ప్రకారం, 'అస్సీ'ని 'తీవ్రమైన, శక్తివంతమైన కోర్టు డ్రామా ద్వారా వెల్లడయ్యే అలుపెరగని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్' అని చెప్పుకొచ్చారు. తాప్సీ ఫస్ట్ లుక్‌కు స్పందిస్తూ.. ‘ఫైనల్లీ నా అభిమాన నటి సినిమా విడుదల కాబోతోంది' అని ఓ యూజర్ రాసుకొచ్చాడు. 'మీ సినిమాలను నేను చాలా మిస్ అయ్యాను. నా అభిమాన జానర్‌ను ఎంచుకున్నందుకు అభినందనలు' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.