Athiradi Movie Review: మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వస్తున్న ప్రతి చిన్న సినిమాకూ తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ ఉంటుందన్న విషయం తెలుసు కదా. థ్రిల్లర్ మూవీసే కాదు.. యాక్షన్ కామెడీ జానర్ కు కూడా అభిమానులు ఉన్నారు.

'మిన్నల్ మురళి' లాంటి గ్లోబల్ సంచలనం తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ బేసిల్ జోసెఫ్, స్టార్ హీరో టొవినో థామస్ కాంబినేషన్‌లో సరికొత్త క్యాంపస్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అథిరడి' (Athiradi) తాజాగా సోనీలివ్ ఓటీటీలో అడుగుపెట్టింది.
'మిన్నల్ మురళి' కో-రైటర్ అరుణ్ అనిరుధన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు నవ్వించిందో ఈ రివ్యూలో చూడండి.
అథిరడి.. అసలు కథేంటంటే?
ఈ అథిరడి మూవీ కథ మొత్తం ఒక ఇంజినీరింగ్ కాలేజ్ క్యాంపస్ చుట్టూ తిరుగుతుంది. సామ్ (బేసిల్ జోసెఫ్) అనే ఒక సాధారణ జెన్ జీ (Gen Z) యువకుడు కాలేజీలో చేరతాడు. ఈ కాలేజీలో రెండేళ్ల క్రితం జరిగిన ఒక దురదృష్టకర సంఘటన వల్ల మేనేజ్‌మెంట్ అక్కడి ప్రతిష్టాత్మక 'ఆరోహణ' కాలేజ్ ఫెస్ట్‌ను పూర్తిగా బ్యాన్ చేస్తుంది. సమాజం చేత 'పనికిరానివాడు' అని ముద్ర వేయించుకున్న సామ్.. ఎలాగైనా ఆ ఫెస్ట్‌ను మళ్లీ ప్రారంభించి తానేంటో నిరూపించుకోవాలని డిసైడ్ అవుతాడు.
కథ ఇలా సాగుతుండగా.. మరోవైపు కుట్టన్ (టొవినో థామస్) అనే ఒక రిటైర్డ్ రౌడీ మనకు పరిచయం అవుతాడు. అతను రౌడీయిజం వదిలేసి, ఒక లోకల్ మ్యూజిక్ ట్రూప్‌ను ఏర్పాటు చేసుకుని గుడి ఉత్సవాల్లో తన మొదటి సంగీత ప్రదర్శన ఇవ్వాలని కలలు కంటూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో సామ్ ఆశయాలు, కుట్టన్ కలలు ఒకదానికొకటి ఎలా ఢీకొన్నాయి? ఈ ఇద్దరి ఇగోల మధ్య జరిగిన యుద్ధం ఎలాంటి గందరగోళానికి, కామెడీకి దారితీసింది? చివరకు ఇందులో ఎవరు గెలిచారు? అనేదే 'అథిరడి' అసలు కథ.
అథిరడి (Athiradi) మూవీ విశేషాలు
- నటీనటులు: టొవినో థామస్, బేసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్, రియా షిబు
{{/usCountry}}- నటీనటులు: టొవినో థామస్, బేసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్, రియా షిబు
{{/usCountry}}- దర్శకుడు: అరుణ్ అనిరుధన్
- రన్‌టైమ్: 2 గంటల 37 నిమిషాలు
- సంగీతం: విష్ణు విజయ్
- ఓటీటీ: సోనీలివ్ (తెలుగులోనూ..)
అథిరడి ఎలా ఉందంటే?
దర్శకుడు అరుణ్ అనిరుధన్, రైటర్ పాల్సన్ స్కారియాతో కలిసి పాత క్యాంపస్ పాలిటిక్స్, గ్యాంగ్ వార్స్ ఫార్ములా కథనే తీసుకున్నప్పటికీ, దానికి ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్లుగా జెన్ జీ కల్చర్, సోషల్ మీడియా మీమ్స్, పాప్ కల్చర్ రిఫరెన్స్‌లను జోడించి కథనాన్ని నడిపించారు.
సినిమా మొదటి నుండి చివరి వరకు ఫుల్ ఎనర్జిటిక్ గా సాగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. విష్ణు విజయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌ను అద్భుతంగా ఎలివేట్ చేసింది. అయితే సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్స్ (జరిన్ షిహాబ్, రియా షిబు)కు పెద్దగా స్కోప్ లేకపోవడం, ఎమోషనల్ డెప్త్ కొంచెం తగ్గడం ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్ అని చెప్పొచ్చు.
నటీనటులు ఎవరెలా చేశారంటే?
టొవినో థామస్ రిటైర్డ్ రౌడీ కుట్టన్ పాత్రలో తిరుగులేని నటనను ప్రదర్శించారు. అతని కెరీర్లోనే బెస్ట్ కామెడీ పాత్రల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. అటు బేసిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టేశారు. ఓ జెన్ జీ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయారు.
వీరికి తోడుగా సీనియర్ నటుడు వినీత్ శ్రీనివాసన్, మ్యూజిక్ డైరెక్టర్ షాన్ రెహమాన్ తమ నిజ జీవిత పాత్రలనే మూవీలో పోషించి నవ్వించారు. అథిరడి మూవీ గత నెలలో థియేటర్లలో రిలీజ్ కాగా.. శుక్రవారం (జూన్ 19) నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ వీకెండ్ మీకు ఓ మంచి ఛాయిస్ అవుతుంది.