Atreyapuram Brothers: ఫేమస్ స్వీట్ పేరుతో డిఫరెంట్ కామెడీ మూవీ.. ఆత్రేయపురం బ్రదర్స్‌కు గుమ్మడికాయ కొట్టేసిన టీమ్

Atreyapuram Brothers Shooting Completed: పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'ఆత్రేయపురం బ్రదర్స్' షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే వరుస ప్రమోషనల్ అప్‌డేట్లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఆ విశేషాలు చూద్దాం.

Published on: Sep 5, 2026, 20:25:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Atreyapuram Brothers Shooting Completed: గోదావరి జిల్లాల నేపథ్యం, అక్కడి మనుషుల మాటకారి తనం, స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణంలో వచ్చే సినిమాలకు తెలుగు సినీ ప్రియుల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అదే తరహాలో పూర్తిస్థాయి హాస్యభరిత కథాంశంతో రూపుదిద్దుకుంటున్న కొత్త చిత్రం 'ఆత్రేయపురం బ్రదర్స్'.

ఫేమస్ స్వీట్ పేరుతో డిఫరెంట్ కామెడీ మూవీ.. ఆత్రేయపురం బ్రదర్స్‌కు గుమ్మడికాయ కొట్టేసిన టీమ్
ఫేమస్ స్వీట్ పేరుతో డిఫరెంట్ కామెడీ మూవీ.. ఆత్రేయపురం బ్రదర్స్‌కు గుమ్మడికాయ కొట్టేసిన టీమ్

ఆత్రేయపురం బ్రదర్స్ సినిమా షూటింగ్ పూర్తి

శ్రీనివాస్ గవిరెడ్డి, సన్నీ పత్సా, గీత్ సైని, నేహా పఠాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆత్రేయపురం బ్రదర్స్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆత్రేయపురం బ్రదర్స్ చిత్ర బృందం సెట్స్‌పై గుమ్మడికాయ కొట్టి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచింది.

ఆత్రేయపురం పూతరేకులు కాదు బ్రదర్స్

నోరూరించే పూతరేకులకు ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం పేరుతో వస్తున్న ఈ సినిమా శీర్షికే మొదటి నుంచి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. అక్కడి మనుషుల మధ్య జరిగే సరదా సంఘటనలు, ఊహించని మలుపుల చుట్టూ కథ సాగుతుందని సమాచారం.

ఆత్రేయపురం బ్రదర్స్ నిర్మాతలు

రాజేష్ జగన్నాధం రచన, దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ఆత్రేయపురం బ్రదర్స్ చిత్రాన్ని S2S సినిమాస్, ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్, గద్దె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై VSK సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె, రాకేష్ గద్దె సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

భారీ తారాగణంతో నవ్వుల పండగ!

ఈ ఆత్రేయపురం బ్రదర్స్ చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ హాస్య నటులు, సీనియర్ ఆర్టిస్టులు తమ నటనతో అలరించేందుకు రెడీగా ఉన్నారు. రాజీవ్ కనకాల, శివాజీ రాజా, అన్నపూర్ణమ్మ, దేవి ప్రసాద్, రజిత, ప్రభావతి, హరితేజతో పాటు రఘు బాబు, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సిద్ధార్థ్ గొల్లపూడి, భద్రం, అరుణ్ దలై, నవీన్ వంటి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సాంకేతిక బలం.. ప్రమోషన్లకు సిద్ధం!

ఇంతమంది సీనియర్ కామెడీ స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటంతో థియేటర్లలో నవ్వుల వర్షం ఖాయమని భావిస్తున్నారు. షూటింగ్ ముగియడంతో త్వరలోనే వరుస ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

సంతు ఓంకార్ సంగీతం

ఇక ఈ ఆత్రేయపురం బ్రదర్స్ చిత్రానికి రమీజ్ నవీత్ కెమెరామెన్‌గా పని చేయగా, సంతు ఓంకార్ సంగీత స్వరాలు సమకూర్చారు. అనిల్ పసల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రకీర్తి ఉప్పలపాటి, ధీరజ్ ప్రొడక్షన్ డిజైనర్లుగా, మేఘన కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు.

త్వరలో ఆత్రేయపురం బ్రదర్స్ టీజర్, ట్రైలర్

దాత్య విజువల్స్ విఎఫ్ఎక్స్ బాధ్యతలను చూసుకుంది. అతి త్వరలోనే ఆత్రేయపురం బ్రదర్స్ సినిమా టీజర్, ట్రైలర్, విడుదల తేదీకి సంబంధించిన వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More