...
...
Next Story

తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 3 మూవీకి దారుణమైన వసూళ్లు.. ఫస్ట్ వీకెండ్ చాలా తక్కువే

అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగానే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ దారుణమైన వసూళ్లు వచ్చాయి. మొదటి నుంచీ నెగటివ్ రివ్యూలు రావడంతో ఆ ప్రభావం వసూళ్లపై స్పష్టంగా కనిపించింది.

Published on: Dec 22, 2025 03:26 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీకి బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవం కొనసాగుతోంది. ఈ సినిమా ఊహించిన దాని కంటే చాలా చాలా వెనుకబడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది వచ్చిన చాలా సినిమాల కంటే వెనకే ఉన్న ఈ సినిమా.. ఏపీ, తెలంగాణాల్లో అయితే మరింత దారుణమైన వసూళ్లతో షాక్‌కు గురి చేస్తోంది.

అవతార్ 3 బాక్సాఫీస్ వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 3 మూవీకి దారుణమైన వసూళ్లు.. ఫస్ట్ వీకెండ్ చాలా తక్కువే
తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 3 మూవీకి దారుణమైన వసూళ్లు.. ఫస్ట్ వీకెండ్ చాలా తక్కువే

అవతార్ ఫ్రాంఛైజీకి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులే ఉన్నారు. ఈ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన రెండో సినిమా అవతార్: ది వే ఆఫ్ వాటర్.. ఏపీ, తెలంగాణల్లో కలిసి రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కానీ తాజాగా వచ్చిన అవతార్: ఫైర్ అండ్ యాష్ మాత్రం తొలి మూడు రోజుల్లో అంటే ఫస్ట్ వీకెండ్ లో కేవలం రూ.15 కోట్లే రాబట్టడం గమనార్హం.

అది కూడా అన్ని భాషల్లో కలిపి ఈ మాత్రమే వచ్చాయి. 2డీ, 3డీ, 4డీఎక్స్ ఫార్మాట్లలోనూ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజైంది. కానీ ఇవేవీ వసూళ్లను పెంచలేకపోయాయి. మొత్తంగా రెండో సినిమాతో పోలిస్తే 50 శాతానికిపైగా తక్కువ వసూళ్లు ఇప్పటి వరకూ వచ్చాయి.

అవతార్ ఫైర్ అండ్ యాష్ వరల్డ్ వైడ్ కలెక్షన్ ఇలా..

అటు ఓపెనింగ్ వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా 345 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2900 కోట్లు) వసూలు చేసింది. చైనాలో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చినా.. ఓవరాల్‌గా చూస్తే గత చిత్రం 'అవతార్ 2' వసూళ్లను దాటలేకపోయింది. అంతేకాదు ఈ ఏడాది అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలవలేకపోయింది.

మూడేళ్ల క్రితం వచ్చిన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (Avatar 2) ఓపెనింగ్ వీకెండ్‌లో 441 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దానితో పోలిస్తే 'అవతార్ 3' వసూళ్లు చాలా తక్కువ.

'జూటోపియా 2' రికార్డును కొట్టలేకపోయింది

'అవతార్ 3'కి జరిగిన అతిపెద్ద డ్యామేజ్ ఏంటంటే.. ఇది ఈ ఏడాది 'బిగ్గెస్ట్ ఓపెనింగ్' రికార్డును సొంతం చేసుకోలేకపోయింది. ఈ ఏడాది విడుదలైన డిస్నీ యానిమేటెడ్ మూవీ 'జూటోపియా 2' (Zootopia 2) ఏకంగా 560 మిలియన్ డాలర్ల ఓపెనింగ్స్‌తో టాప్ ప్లేస్‌లో ఉంది. అంతేకాదు.. 'బార్బీ' ($356 మిలియన్లు), 'మోనా 2' ($389 మిలియన్లు), చైనీస్ యామినేటెడ్ సినిమా 'నే జా 2' ($431 మిలియన్లు) కంటే కూడా అవతార్ 3 వెనుకబడి ఉండటం గమనార్హం.

2009లో వచ్చిన మొదటి 'అవతార్' 2.9 బిలియన్ డాలర్లు, రెండో పార్ట్ 2.3 బిలియన్ డాలర్లు వసూలు చేశాయి. సిరీస్‌లో 4వ, 5వ సినిమాలు 2029, 2031లో విడుదల కానున్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe