Super Hero OTT: అవెంజర్స్ లవర్స్ అలెర్ట్.. తెలుగులో ఇవాళ ఓటీటీలోకి ఎండ్‌గేమ్ ఎన్‌కోర్.. కొత్త సీన్లు..27 వేల కోట్ల మూవీ!

Super Hero OTT: హాలీవుడ్ సూపర్ హీరోలందరూ కలిసి విలన్లను రఫ్పాడిస్తే కలిగే థ్రిల్లే వేరు. అలాంటి థ్రిల్ నే మార్వెల్ అవెంజర్స్ సినిమాలు అందిస్తాయి. ఇప్పుడీ అవెంజర్స్ ఫ్రాంఛైజీ నుంచి అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఎన్‌కోర్ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రం రూ.27 వేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. 

Published on: Nov 13, 2026, 05:52:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Super Hero OTT: 2019లో వచ్చిన 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. థానోస్ చేసిన విధ్వంసం తర్వాత మిగిలిన సూపర్ హీరోలంతా ఒక్కటై చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ గూస్ బంప్స్ తెప్పించింది. ఆ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ను మళ్లీ ఫ్యాన్స్‌కు అందించేందుకు మార్వెల్ స్టూడియోస్ సిద్ధమైంది.

అవెంజర్స్ లవర్స్ అలెర్ట్-తెలుగులో ఇవాళ ఓటీటీలోకి ఎండ్‌గేమ్ ఎన్‌కోర్-కొత్త సీన్లు-27 వేల కోట్ల మూవీ! (x/JioHotstar)
అవెంజర్స్ లవర్స్ అలెర్ట్-తెలుగులో ఇవాళ ఓటీటీలోకి ఎండ్‌గేమ్ ఎన్‌కోర్-కొత్త సీన్లు-27 వేల కోట్ల మూవీ! (x/JioHotstar)

అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎన్‌కోర్ ఓటీటీ

రీసెంట్ గా థియేటర్లలో రీ-రిలీజ్ అయి సక్సెస్ సాధించిన ఈ ఎండ్‌గేమ్: ఎన్‌కోర్ సినిమా.. ఇప్పుడు నేరుగా ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. ఇది కేవలం మనం గతంలో చూసిన పాత సినిమా మాత్రమే కాదు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో రాబోయే భారీ మార్పులకు ఇది పునాది అని చెప్పొచ్చు.

కొత్త సీన్లు

'అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎన్‌కోర్' పేరుతో వచ్చిన ఈ ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌లో కొన్ని కొత్త పోస్ట్-క్రెడిట్ సీన్స్ యాడ్ చేశారు. రాబోయే బ్లాక్ బస్టర్ 'అవెంజర్స్: డూమ్స్‌డే' సినిమాకు సంబంధించిన కీలకమైన క్లూస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్ డూమ్, బ్రూస్ బ్యానర్ (హల్క్) మధ్య వచ్చే కొత్త సీన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇస్తుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.27 వేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్

మార్వెల్ మూవీస్ అంటే ఇండియాలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పిచ్చి క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ కు తగ్గట్టుగానే 'అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎన్‌కోర్' ఇవాళ (నవంబర్ 13) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' (JioHotstar) లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది.

కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో కూడా ఈ మూవీ అందుబాటులో ఉండటం మన ప్రేక్షకులకు పెద్ద ప్లస్ పాయింట్. సూపర్ హీరోలంతా కలిసి చేసిన పోరాటాన్ని మన ఆడియన్స్ తెలుగులోనూ చూసేయొచ్చు.

డూమ్స్‌డే సినిమాకు ఇది బిగినింగ్

డిసెంబర్ మూడో వారంలో 'అవెంజర్స్: డూమ్స్‌డే' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఆ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే, ఈ 'ఎన్‌కోర్' వెర్షన్ చూడటం చాలా ముఖ్యం. రాబర్ట్ డౌనీ జూనియర్ మళ్లీ విలన్ 'డాక్టర్ డూమ్' గా రీ-ఎంట్రీ ఇస్తుండటంతో, తదుపరి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

సో, ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీకెండ్ కు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి మళ్లీ ఆ ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థార్, హల్క్ ల యాక్షన్ ను జియోహాట్‌స్టార్‌లో ఎంజాయ్ చేసేయండి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More