...
...
Next Story

ఆ అమ్మాయి ఎవరు? ఓటీటీలోకి మలయాాళ కామెడీ థ్రిల్లర్.. అక్రమ సంబంధాలు, లైంగిక కోరికల చుట్టూ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఓటీటీలోకి మరో మలయాళం మూవీ దూసుకొచ్చింది. వాస్తవ సంఘటనలకు దగ్గరగా ఉండే స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది. అక్రమ సంబంధాలు, లైంగిక కోరికలు తదితర అంశాల చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది.

Published on: Nov 14, 2025, 10:53:14 IST
Advertisement

ఇవాళ ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అవిహితం’ వచ్చేసింది. వాస్తవ సంఘటనలకు చాలా దగ్గరగా ఉండే కథతో తీసుకొచ్చిన సాహసోపేత సినిమా ఇది. అక్రమ సంబంధాలు, వాటి వెనుక ఉన్న కారణాలు, ఓ రహస్య స్త్రీని పట్టుకునేందుకు గ్రామస్తుల ప్రయత్నాలు.. ఇలా అవిహితం మూవీ సాగుతోంది.

అవిహితం ఓటీటీ

ఓటీటీలోకి మలయాళం మూవీ (x/JioHotstarMal)
ఓటీటీలోకి మలయాళం మూవీ (x/JioHotstarMal)

ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఇవి వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంటాయి. మన చుట్టుపక్కల జరిగిన కథలాగే ఉంటాయి. ఇప్పుడు అదే కోవలో వచ్చిన బ్లాక్ కామెడీ థ్రిల్లర్ సినిమానే అవిహితం. ఈ మూవీ శుక్రవారం (నవంబర్ 14) ఓటీటీలో రిలీజైంది. జియోహాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగులోనూ

ఓటీటీలకు క్రేజ్ పెరిగిపోయాక భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోని కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. ఇక తెలుగు ఆడియన్స్ అయితే మలయాళ సినిమాలకు ఫ్యాన్స్ గా మారిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మలయాళ చిత్రాలు కూడా తెలుగులో ఓటీటీలోకి వస్తున్నాయి. అవిహితం కూడా తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు తెలుగు భాషలో వచ్చేసింది. మలయాళం, తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అవిహితం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

అవిహితం కథ

అవిహితం మూవీ కథ ఓ గ్రామంలో జరిగే వాస్తవ ఘటనలకు దగ్గరగా ఉంటుంది. కంజన్ గడ్ గ్రామంలో ఓ రాత్రి బాగా తూలుతూ వచ్చిన ఓ ప్రకాశన్ ముద్దు పెట్టుకుంటున్న ఓ జంటను చూస్తాడు. అందులో పురుషుడు మిల్ వినోద్. మరి ఆ అమ్మాయి ఎవరు? ఆ మిస్టరీ లేడీని కనిపెట్టేందుకు ఏడుగురు గ్రామస్తులు ఒక్కటవుతారు. అందరిపై అనుమానం పెట్టుకుంటారు.

ఎవరు?

అవిహిత మూవీ నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 10, 2025న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇవాళ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు సెన్నా హెగ్డే డైరెక్టర్. ఇందులో ఉన్ని రాజ్, రెంజి నాకోల్, వ్రిందా మీనన్ తదితరులు నటించారు. ఈ4 ఎక్స్ పెరిమెంట్స్, ఇమాజిన్ సినిమాస్, మార్లీ స్టేట్ ఆఫ్ మైండ్ బ్యానర్లపై దీన్ని నిర్మించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks