టెలివిజన్ రంగంలో ‘చిన్నారి పెళ్లి కూతురు’గా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ముద్దుగుమ్మ అవికా గోర్. తెలుగులో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో వార్తల్లో నిలిచింది అవికా గోర్.

2025లో బాయ్‌ఫ్రెండ్ మిలింద్ చంద్వానీని వివాహం చేసుకుంది హీరోయిన్ అవికా గోర్. పతి పత్నీ ఔర్ పంగా అనే టీవీ రియాలిటీ షో వేదికగా ఈ జంట పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే, అవికా గోర్ త్వరలోనే తల్లి కాబోతోందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ప్రెగ్నెన్సీ వార్తలకు చెక్ పెట్టిన అవికా
తాజాగా ఒక ఇంటర్వ్యూలో అవికా గోర్ తన ప్రెగ్నెన్సీ వార్తలపై ఘాటుగా స్పందించారు. "నేను గర్భవతిని అంటూ వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. అందులో ఏమాత్రం నిజం లేదు. అయితే, మా జీవితంలో ఒక కొత్త విషయం జరగబోతోంది. ఆ సర్‌ప్రైజ్ ఏంటనేది త్వరలోనే అందరికీ చెబుతాము" అని అవికా గోర్ క్లారిటీ ఇచ్చి చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. దీంతో అవికా గోర్ అభిమానుల్లో సస్పెన్స్ మరింతగా పెరిగింది.
అసలు ఈ పుకార్లు ఎలా మొదలయ్యాయి?
ఇదిలా ఉంటే, అవికా గోర్, మిలింద్ కలిసి ఇటీవల చేసిన ఒక వ్లాగ్ (Vlog) ఈ ప్రెగ్నెన్సీ వార్తలకు దారితీసింది. 2026లో తమ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయని అవికా అందులో పేర్కొన్నారు.
దీనికి మిలింద్ స్పందిస్తూ.. "మేము ఎప్పుడూ కలగనని, ప్లాన్ చేయని ఒక అద్భుతమైన మార్పు ఇది. కొంచెం నెర్వస్‌గా ఉన్నా, ఇది చాలా పెద్ద విషయం" అని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్స్ చూసిన నెటిజన్స్ అవికా గోర్ తల్లి కాబోతోందని, అందుకే ఈ జంట అంత ఎగ్జైటింగ్‌గా ఉందంటూ కామెంట్లతో హోరెత్తించారు.
రియాలిటీ షోలో ఘనంగా పెళ్లి
{{/usCountry}}దీనికి మిలింద్ స్పందిస్తూ.. "మేము ఎప్పుడూ కలగనని, ప్లాన్ చేయని ఒక అద్భుతమైన మార్పు ఇది. కొంచెం నెర్వస్‌గా ఉన్నా, ఇది చాలా పెద్ద విషయం" అని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్స్ చూసిన నెటిజన్స్ అవికా గోర్ తల్లి కాబోతోందని, అందుకే ఈ జంట అంత ఎగ్జైటింగ్‌గా ఉందంటూ కామెంట్లతో హోరెత్తించారు.
రియాలిటీ షోలో ఘనంగా పెళ్లి
{{/usCountry}}ఇక అవికా గోర్, మిలింద్ చంద్వానీ 2020లో హైదరాబాద్‌లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యారు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి, 2025 సెప్టెంబర్ 30న ‘పతి పత్నీ ఔర్ పంగా’ అనే రియాలిటీ షో వేదికగా అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ వేడుకలకు హినా ఖాన్, రుబినా దిలైక్, ఫరా ఖాన్ వంటి ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.
కాగా, ప్రస్తుతం అవికా గోర్ తన కెరీర్ పట్ల కూడా దృష్టి సారిస్తూనే, మరోవైపు తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి అవికా గోర్ చెప్పబోయే ఆ ‘గుడ్ న్యూస్’ ఏంటో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!