...
...
Next Story

Avika Gor: నానితో మాత్రమే ఆ మూడు సినిమాలు చేస్తా.. ఆ యాక్టింగ్ నాకెంతో ఇష్టం.. అవికా గోర్ కామెంట్లు వైరల్

Avika Gor: నేచురల్ స్టార్ నాని నటనపై టాలీవుడ్ హీరోయిన్ అవికా గోర్ ప్రశంసల వర్షం కురిపించింది. జీవితంలో కేవలం మూడు సినిమాలు చేసే అవకాశం వస్తే ఏం చేస్తారని ప్రశ్నకు ఆమె ఇచ్చిన ఆన్సర్ వైరల్ గా మారింది.

Published on: May 23, 2026, 16:11:28 IST
Advertisement

Avika Gor: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటనకు, ఆయన ఎంచుకునే వైవిధ్యమైన పాత్రలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అంతే కాకుండా కో స్టార్స్ కూడా నాని యాక్టింగ్ కు ఫిదా అవుతుంటారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ అవికా గోర్ నానిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ఏం చెప్పిందో చూసేయండి.

అవికా గోర్ వైరల్ కామెంట్లు

నానితో మూడు సినిమాలు చేస్తానన్న అవికా గోర్ (instagram-avikagor)
నానితో మూడు సినిమాలు చేస్తానన్న అవికా గోర్ (instagram-avikagor)

ఒక ఇంటర్వ్యూలో అవికా గోర్‌కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. 'మీ జీవితంలో ఒకే ఒక్క హీరోతో కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసే అవకాశం వస్తే, మీరు ఎవరిని ఎంచుకుంటారు?' అని యాంకర్ అడిగాడు. దీనికి అవికా క్షణం కూడా ఆలోచించకుండా 'నాని' అని సమాధానం ఇచ్చింది అవికా. నాని నటనలో ఉండే ప్రత్యేకతలే తనను ఇంతలా ఆకర్షించాయని ఆమె వివరించింది.

కళ్లు మాట్లాడతాయి

"నాని కళ్లు చాలా మాట్లాడతాయి. ఆయన భావాలను పలికించే విధానం, నటనలోని లోతు నన్ను బాగా ఆకట్టుకుంటాయి. ఆయన ప్రదర్శనలో ఎన్నో లేయర్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. నాకు అలాంటి సహజసిద్ధమైన నటన అంటే చాలా ఇష్టం" అని అవికా గోర్ తన మనసులోని మాటను పంచుకుంది. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.

ఉయ్యాల జంపాలతో

కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకోవడంలో అవికా ఎప్పుడూ ముందుంటుంది. ఈ నేపథ్యంలోనే, నాని లాంటి వైవిధ్యమైన నటుడితో స్క్రీన్ పంచుకోవాలనే తన కోరికను ఆమె బయటపెట్టింది.

అగ్లీ స్టోరీతో

తాజాగా అగ్లీ స్టోరీ మూవీతో అవికా గోర్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ మూవీలో నందు హీరో. ఈ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మే 22న థియేటర్లలో రిలీజైంది.

నాని జర్నీ

ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చి, తన సహజ నటనతో 'నేచురల్ స్టార్'గా ఎదిగిన నాని ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. భావోద్వేగాలను తెరపై పండించడంలో నానికి సాటిలేరనే విషయం అవికా మాటల్లో మరోసారి స్పష్టమైంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో భవిష్యత్తులో ఏదైనా సినిమా వస్తే చూడాలని ఇటు సినీ విశ్లేషకులు, అటు ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: నాని గురించి అవికా గోర్ ఏం చెప్పింది?

జవాబు: జీవితంలో కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసే అవకాశం వస్తే, తాను నానితోనే చేస్తానని అవికా చెప్పింది. ఆయన కళ్లు, భావవ్యక్తీకరణలో ఉండే లోతు తనకు ఎంతో ఇష్టమని పేర్కొంది.

ప్రశ్న: అవికా గోర్ తెలుగులో నటించిన మొదటి సినిమా ఏది?

జవాబు: అవికా గోర్ టాలీవుడ్‌లో రాజ్ తరుణ్ సరసన 'ఉయ్యాల జంపాల' సినిమాతో కథానాయికగా పరిచయమైంది.

ప్రశ్న: నానికి 'నేచురల్ స్టార్' అనే పేరు ఎందుకు వచ్చింది?

జవాబు: సినిమాల్లో ఎటువంటి కృత్రిమత్వం లేకుండా, అత్యంత సహజంగా భావోద్వేగాలను పండించే నటనను ప్రదర్శిస్తాడే కాబట్టే ఆయనను అందరూ నేచురల్ స్టార్ అని పిలుస్తారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe