Awarapan 2 Teaser: బాలీవుడ్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆవారాపన్’ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. సరిగ్గా 19 ఏళ్ల తర్వాత అదే వైబ్, అంతకంటే డబుల్ ఎమోషన్స్, యాక్షన్‌తో ‘ఆవారాపన్ 2’ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

లవర్ బాయ్, ఓజీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఇమ్రాన్ హష్మీ మరోసారి ఐకానిక్ క్యారెక్టర్ ‘శివమ్ పండిట్’గా స్క్రీన్ పైకి వస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ కల్ట్ మూవీ సీక్వెల్ అనౌన్స్‌మెంట్ టీజర్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
మళ్లీ గాయపడిన సింహంలా శివమ్ పండిట్ ఎంట్రీ
ఈ ఆవారాపన్ 2 కొత్త టీజర్ చూస్తే ఫ్యాన్స్‌కు పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. మొదటి పార్ట్‌లో ఆలియా (శ్రియా శరణ్)ను కోల్పోయి, జీవితంపై విరక్తితో తిరిగే ఒక ఒంటరి పోరాట యోధుడిగా శివమ్ పండిట్ కనిపించాడు.
ఇప్పుడు పార్ట్ 2 లోనూ అదే బాధ కంటిన్యూ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ హష్మీ వాయిస్ ఓవర్‌తో సాగే బ్యాక్‌గ్రౌండ్ డైలాగ్స్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచాయి. “కొందరి కథలు వాళ్ల ఇష్టప్రకారం ముగిసిపోవు.. వాళ్ల కథలు వేరే వాళ్ల కోసం రాసిపెట్టి ఉంటాయి” అంటూ ఇమ్రాన్ చెప్పే డైలాగ్ థియేటర్లలో విజిల్ వేయించడం ఖాయం.
దిశా పటాని మిస్టరీ లుక్..
ఈ సీక్వెల్‌లో గ్లామర్ బ్యూటీ దిశా పటాని ఒక డిఫరెంట్ రోల్‌లో మెరవబోతోంది. టీజర్‌లో ఆమె వయొలిన్ ప్లే చేస్తూ కనిపించిన విజువల్స్ చాలా క్లాసీగా ఉన్నాయి. మరోవైపు విలక్షణ నటి షబానా అజ్మీ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు.
వర్షంలో ఇమ్రాన్ హష్మీ చేసే ఇంటెన్స్ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సులు ఈసారి సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని స్పష్టం చేస్తున్నాయి. నితిన్ కక్కర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను బ్యాంకాక్, రాజస్థాన్లలోని రిచ్ లొకేషన్లలో గ్రాండ్‌గా షూట్ చేశారు.
'తో ఫిర్ ఆవో 2.0' నోస్టాల్జియా రీలోడెడ్
{{/usCountry}}వర్షంలో ఇమ్రాన్ హష్మీ చేసే ఇంటెన్స్ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సులు ఈసారి సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని స్పష్టం చేస్తున్నాయి. నితిన్ కక్కర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను బ్యాంకాక్, రాజస్థాన్లలోని రిచ్ లొకేషన్లలో గ్రాండ్‌గా షూట్ చేశారు.
'తో ఫిర్ ఆవో 2.0' నోస్టాల్జియా రీలోడెడ్
{{/usCountry}}ఆవారాపన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అందులోని మ్యూజిక్. అప్పట్లో 'తో ఫిర్ ఆవో', 'తేరా మేరా రిష్తా' సాంగ్స్ ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సీక్వెల్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ మిథూన్, లిరిసిస్ట్ సయీద్ ఖాద్రీలు మళ్లీ చేతులు కలిపారు.
టీజర్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే 'తో ఫిర్ ఆవో 2.0' బిట్ వింటుంటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి. లవ్, లాస్, రివెంజ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
బాక్సాఫీస్ దగ్గర భారీ క్లాష్.. సన్నీ డియోల్‌తో ఫైట్
ఈ ఆవారాపన్ 2 సినిమాను ఆగస్టు 14, 2026న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే అదే టైంలో ఇండిపెండెన్స్ డే వీకెండ్ టార్గెట్‌గా సన్నీ డియోల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘బట్వారా 1947’ కూడా రిలీజ్ కానుంది.
రాజ్‌కుమార్ సంతోషి డైరెక్షన్‌లో, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాతో ‘ఆవారాపన్ 2’ ఫైట్ చేయబోతోంది. ఇమ్రాన్ హష్మీ వర్సెస్ సన్నీ డియోల్ మధ్య జరగబోయే ఈ బాక్సాఫీస్ వార్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.