...
...
Next Story

Ayushmann Khurrana: అక్రమ సంబంధాలను ప్రోత్సహించడం లేదు, నా పిల్లలు చూసి ఎంజాయ్ చేశారు.. హీరో ఆయుష్మాన్ ఖురానా క్లారిటీ

Ayushmann Khurrana On Pati Patni Aur Woh 2 Controversy: బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తన తాజా చిత్రం 'పతి పత్నీ ఔర్ వో 2' చుట్టూ ముసురుకున్న వివాదాలపై స్పందించారు. ఈ సినిమా అక్రమ సంబంధాలను ప్రోత్సహిస్తోందన్న విమర్శలను కొట్టిపారేస్తూ.. ఇది స్వచ్ఛమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తేల్చి చెప్పారు.

Published on: May 4, 2026, 11:13:53 IST
Advertisement

Ayushmann Khurrana On Pati Patni Aur Woh 2 Controversy: బాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన లేటెస్ట్ మూవీ పతి పత్నీ ఔర్ వో 2. శనివారం (మే 2) ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ వేదికగా పతి పత్నీ ఔర్ వో 2 సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు ముదస్సర్ అజీజ్‌తో పాటు చిత్ర కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా, కథానాయికలు సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బి ఈ వేడుకలో పాల్గొన్నారు.

అక్రమ సంబంధాలను ప్రోత్సహించడం లేదు, నా పిల్లలు చూసి ఎంజాయ్ చేశారు.. హీరో ఆయుష్మాన్ ఖురానా క్లారిటీ
అక్రమ సంబంధాలను ప్రోత్సహించడం లేదు, నా పిల్లలు చూసి ఎంజాయ్ చేశారు.. హీరో ఆయుష్మాన్ ఖురానా క్లారిటీ

అయితే, పతి పత్నీ ఔర్ వో 2 టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమా కథాంశంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. వివాహేతర (అక్రమ) సంబంధాలను ఈ చిత్రం వెనకేసుకొస్తోందన్న ఆరోపణలు రావడంతో, మూవీ ట్రైలర్ లాంచ్ వేదికగా ఆయుష్మాన్ ఖురానా ఆ సందేహాలకు తెరదించారు.

నా పాత్ర 'గ్రీన్ ఫ్లాగ్'.. ప్రచారంలో నిజం లేదు!

పతి పత్నీ ఔర్ వో 2 సినిమా స్టోరీ లైన్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయుష్మాన్ ఘాటుగానే సమాధానమిచ్చారు. "ఈ సినిమా నలుగురు వ్యక్తుల మధ్య జరిగే సంఘర్షణ. ఇందులో నేను పోషించిన ప్రజాపతి పాండే పాత్ర ఒక 'గ్రీన్ ఫ్లాగ్'. అంటే అతని ప్రవర్తన, ఆలోచనలు చాలా స్పష్టంగా, సరైన మార్గంలో ఉంటాయి. అక్రమ సంబంధాలను మేం ఎక్కడా ప్రోత్సహించడం లేదు. ప్రజాపతికి ఎవరితోనూ అక్రమ సంబంధం ఉండదు. ఇది కేవలం పొరపాట్ల వల్ల తలెత్తే హాస్యం (కామెడీ ఆఫ్ ఎర్రర్స్) మాత్రమే" అని హీరో ఆయుష్మాన్ ఖురానా స్పష్టం చేశారు.

పిల్లలతో కలిసి చూసే సినిమా

ఒక మధ్యతరగతి వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే వింత పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడనేది సరదాగా చూపించబోతున్నామని ఆయుష్మాన్ ఖురానా వివరించారు. వ్యక్తిగత జీవితంలో తాను ఒక భర్తగా, తండ్రిగా తన బాధ్యతను గుర్తిస్తానని ఆయుష్మాన్ పేర్కొన్నారు.

ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో తెరకెక్కిన పతి పత్నీ ఔర్ వో 2.. 2019లో వచ్చిన 'పతి పత్నీ ఔర్ వో' చిత్రానికి సీక్వెల్. ఈ మొదటి భాగంలో కార్తీక్ ఆర్యన్, భూమి పెడ్నేకర్ హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే, 2019లో విడుదలైన ఈ సినిమా 1978లో వచ్చిన క్లాసిక్ సంజీవ్ కుమార్ చిత్రానికి రీమేక్ కావడం విశేషం.

ఇకపోతే ఈ తాజా సీక్వెల్‌ అయిన పతి పత్నీ ఔర్ వో 2లో విజయ్ రాజ్, తిగ్మాన్షు ధులియా, ఆయేషా రజా వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీ-సిరీస్, బి.ఆర్. స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం మే 15, 2026న థియేటర్లలో సందడి చేయనుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks