బ్యాక్ నుంచి హీరోయిన్లను నేను బాగా గుర్తుపడతాను- ట్రైలర్ లాంచ్‌లో హోస్ట్ బూతులు-ఇబ్బంది పడిన సారా అలీ ఖాన్, నవ్విన రకుల్

Sara Ali Khan Felt Awkward In Pati Patni Aur Woh 2 Trailer Launch: ముంబైలో జరిగిన పతి పత్ని ఔర్ వో 2 ట్రైలర్ లాంచ్ వేడుకలో చేదు అనుభవం ఎదురైంది. స్టేజ్ మీద హోస్ట్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలతో హీరోయిన్ సారా అలీ ఖాన్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ట్రైలర్ లాంచ్ పూర్తి వివరాల్లోకి వెళితే..!

Published on: May 3, 2026, 15:28:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sara Ali Khan Rakul Preet Singh In Pati Patni Aur Woh 2 Trailer Launch: బాలీవుడ్ హీరోయిన్, దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ 'పతి పత్ని ఔర్ వో 2'. ఈ సినిమాలో హీరోగా ఆయుష్మాన్ ఖురానా చేస్తే.. సారాతోపాటు రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బి హీరోయిన్స్‌గా నటించారు. ప్రస్తుతం వీరంతా పతి పత్ని ఔర్ వో 2 మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

బ్యాక్ నుంచి హీరోయిన్లను నేను బాగా గుర్తుపడతాను- ట్రైలర్ లాంచ్‌లో హోస్ట్ బూతులు-ఇబ్బంది పడిన సారా అలీ ఖాన్, నవ్విన రకుల్
బ్యాక్ నుంచి హీరోయిన్లను నేను బాగా గుర్తుపడతాను- ట్రైలర్ లాంచ్‌లో హోస్ట్ బూతులు-ఇబ్బంది పడిన సారా అలీ ఖాన్, నవ్విన రకుల్

పతి పత్ని ఔర్ వో 2 ట్రైలర్ లాంచ్

ఈ క్రమంలోనే శనివారం (మే 2) ముంబైలో గ్రాండ్‌గా జరిగిన పతి పత్ని ఔర్ వో 2 ట్రైలర్ లాంచ్ వేడుకకు ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బితో కలిసి సారా అలీ ఖాన్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న హోస్ట్ (MC) చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. "మీరు సెలబ్రిటీల వెనుక వైపు (Backshot) చూపిస్తూ ఎవరో గుర్తుపట్టండి అని రీల్స్ పెడుతుంటారు కదా.. నేను అబద్ధం చెప్పడం లేదు, సెలబ్రిటీలు (హీరోయిన్స్) అందిరిని నేను బ్యాక్ నుంచి బాగా గుర్తుపట్టగలను. నేను ఎక్కువగా అదే పనిలో ఉంటాను. ముందు నుంచి గుర్తుపడతానో లేదో తెలీదు కానీ.." అంటూ సదరు హోస్ట్ డబుల్ మీనింగ్ వచ్చేలా జోకులు వేశారు.

సారా రియాక్షన్ వైరల్

హోస్ట్ బూతు జోకులు విన్న సారా అలీ ఖాన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమె ముఖంలో అసహనం స్పష్టంగా కనిపించింది. పక్కనే కూర్చున్న ఆయుష్మాన్ ఖురానా వైపు చూస్తూ.. "అసలు ఇతను ఏం మాట్లాడుతున్నాడు?" అని ఆశ్చర్యపోయారు సారా. పక్కనే ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆ మాటలకు ఇబ్బందిగా ఫీల్ అయినట్లు ఆమె హావభావాలు చూస్తే అర్థమవుతోంది.

కానీ, సారా అలీ ఖాన్‌లా కాకూండా రకుల్ ప్రీత్ సింగ్ కాస్తా నవ్వింది. అయితే, సాధారణంగా ఇలాంటి ఈవెంట్లలో ఫన్ ఉండాలి కానీ, మహిళా నటీమణులు ఉన్న వేదికపై ఇంత పచ్చిగా మాట్లాడటం సరికాదని సారా అలీ ఖాన్ భావించినట్లు తెలుస్తోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

నెటిజన్ల ఆగ్రహం

ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు హోస్ట్ తీరుపై విరుచుకుపడుతున్నారు. "ఇది కామెడీ కాదు, పచ్చి బేషరమ్ (సిగ్గులేకపోవడం)" అని ఒకరు కామెంట్ చేయగా.. "అక్కడ కూర్చున్న వారు అతడిని ఆపకుండా నవ్వుతూ ఎలా చూడగలుగుతున్నారు?" అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. స్టాండప్ కామెడీ పేరుతో అసభ్యతను పెంచి పోషిస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

'పతి పత్ని ఔర్ వో 2' విశేషాలు

ఇదిలా ఉంటే, 2019లో కార్తీక్ ఆర్యన్ హీరోగా వచ్చిన 'పతి పత్ని ఔర్ వో' చిత్రానికి ఈ మూవీ సీక్వెల్. ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని టీ-సిరీస్ నిర్మించింది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా పతి పత్ని ఔర్ వో 2 సినిమా మే 15, 2026న థియేటర్లలోకి రానుంది.

పెళ్లయిన పురుషుల బుద్ధి

పెళ్లయిన పురుషుల బుద్ధి ఎప్పటికీ మారదని, వారు ప్రేమ వలయంలో ఎలా చిక్కుకుంటారనే అంశాన్ని వినోదాత్మకంగా ఈ సినిమాలో చూపించనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More