OTT Thriller: ఆ సీక్రెట్ బాక్స్ లో ఏముంది? ఒకేసారి రెండు ఓటీటీల్లోకి తెలుగు కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. ఎందుకు చూడాలంటే?
Telugu OTT: మహాత్మా గాంధీ పోగొట్టుకున్న పాతకాలపు పాకెట్ వాచీ నేపథ్యంలో తెరకెక్కిన తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'బా బా బ్లాక్ షీప్'. ఈ మూవీ ఒకేసారి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. కొత్త తరహా కామెడీ సినిమాలను ఇష్టపడేవారికి ఇదొక డబుల్ ఎంటర్ టైన్మెంట్ అని చెప్పొచ్చు.
Telugu OTT: "బిగ్ స్క్రీన్ నుంచి నేరుగా మీ ఇంట్లో ఉన్న స్క్రీన్స్ పైకి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సూపర్ హిట్ మూవీ బా బా బ్లాక్ షీప్ వచ్చేస్తుంది. నవంబర్ 6 నుంచి ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్ లో ఎక్స్ క్లూజివ్ గా ఈ ఫన్ ఫిల్డ్ ఓటీటీ రైడ్ కు అందరూ సిద్ధంగా ఉండండి" అంటూ మేకర్స్ తాజాగా బా బా బ్లాక్ షీప్ ఓటీటీ రిలీజ్ అప్డేట్ ను పంచుకున్నారు.

బా బా బ్లాక్ షీప్ మూవీ
గుని మంచిగంటి దర్శకత్వంలో అక్టోబర్ 9న థియేటర్లలోకి వచ్చిన ఈ బా బా బ్లాక్ షీప్ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్ తో పాటు టిన్ను ఆనంద్, ఉపేంద్ర లిమాయే వంటి భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కింది.
గాంధీ వాచీ వెనుక ఉన్న కథ ఇదే!
క్రైమ్ డ్రామాకు పక్కా కామెడీని జోడించి ఈ బా బా బ్లాక్ షీప్ సినిమా స్టోరీలైన్ ను చాలా ఆసక్తికరంగా రాసుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ పోగొట్టుకున్న ఒక పాకెట్ వాచీ చుట్టూ ఈ కథ అంతా నడుస్తుంది. ఎక్కడో దొరికిన ఆ పాత వాచీ.. ఏకంగా ఆరుగురు అపరిచితుల జీవితాలను ఎలా మలుపు తిప్పింది అనేది ఈ మూవీ అసలు లైన్.
కేవలం ఒకే ఒక్క రోజులో జరిగే ఈ కథలో తుపాకులు, బంగారం, అత్యాశతో కూడిన ఒక అండర్ వరల్డ్ ఛేజింగ్ ఆడియన్స్ కు థ్రిల్ పంచుతుంది. అనుకోకుండా జరిగిన చిన్న పొరపాట్లు ఎలాంటి కామెడీ కన్ఫ్యూజన్ కు దారి తీశాయనేది సినిమాలో ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తుంది.
మేఘాలయ సీఎం మెచ్చుకున్న తెలుగు సినిమా
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై వేణు దోనేపూడి ఈ సినిమాను అత్యంత భారీగా నిర్మించారు. ఈ సినిమాకు మరో అరుదైన రికార్డు కూడా ఉంది. మేఘాలయ రాష్ట్రంలోని అందమైన సోహ్రా (చిరపుంజి) ప్రాంతంలో పూర్తిగా చిత్రీకరణ జరుపుకొన్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం.
ఈ అద్భుతమైన లొకేషన్లలో సినిమా తీసినందుకు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా సైతం ఈ చిత్ర బృందాన్ని స్వయంగా అభినందించారు.
ఆ రెండు ఓటీటీల్లో ఒకేసారి స్ట్రీమింగ్
థియేటర్లలో క్రైమ్ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై కూడా డబుల్ ఎంటర్టైన్మెంట్ తో సందడి చేయనుంది. నవంబర్ 6వ తేదీ నుంచి ఈ సినిమా దిగ్గజ ఓటీటీ సంస్థలైన అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్స్ట్ లో కూడా ఒకేసారి అందుబాటులోకి రానుంది.
ఎందుకు చూడాలంటే?
బా బా బ్లాక్ షీప్ మూవీ అనేది ఓ న్యూ ఏజ్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్. ఇందులోని కామెడీ చూసి ఫుల్ గా నవ్వుకోవచ్చు. ఇక మధ్యలో వచ్చే మలుపులు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ కోసమైనా ఈ మూవీని చూడొచ్చు.
ఎలాంటి అంచనాలు లేకుండా ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి వీకెండ్ కు ఈ సినిమా పర్ఫెక్ట్ ఛాయిస్. మీ స్మార్ట్ టీవీల్లో ఈ క్రైమ్ కామెడీ మూవీని అస్సలు మిస్ కావద్దు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


