బాహుబలికి సోమవారం షాక్! 4వ రోజు కలెక్షన్లలో భారీ పతనం.. మొత్తం ఎన్ని కోట్లంటే?

బాహుబలి ది ఎపిక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు 4వ రోజు: ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా నటించిన ఈ చిత్రం సోమవారం కలెక్షన్లలో భారీ తగ్గుదలను చవిచూసింది. 

Published on: Nov 4, 2025, 05:39:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటించిన 'బాహుబలి: ది ఎపిక్' అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది. బాహుబలి 1, 2 చిత్రాలను కలిపి రీమాస్టర్డ్ వర్షన్ గా దీన్ని రీరిలీజ్ చేశారు. ఈ చిత్రం మొదటి వీకెండ్ లో మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ, ఫస్ట్ సోమవారం నాడు కలెక్షన్లలో గణనీయమైన తగ్గుదల కనిపించింది.

బాహుబలిలో ప్రభాస్
బాహుబలిలో ప్రభాస్

బాహుబలి ది ఎపిక్ కలెక్షన్లు

ట్రేడ్ వెబ్‌సైట్ సక్నిల్క్ ప్రకారం, 'బాహుబలి ది ఎపిక్' మొదటి సోమవారం భారతదేశంలో రూ.1.35 కోట్ల నెట్ వసూలు చేసింది. దీంతో మొత్తం దేశీయ వసూళ్లు రూ.25.7 కోట్లకు చేరాయి. ఈ చిత్రం మంచి ఓపెనింగ్‌ను సాధించింది. గురువారం ప్రీమియర్ల ద్వారానే రూ.1.15 కోట్లు, శుక్రవారం రూ.9.65 కోట్లు వసూలు చేసింది. వారాంతంలో శనివారం రూ.7.25 కోట్లు, ఆదివారం రూ.6.3 కోట్లు వసూలు చేసింది. దీని ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లు భారతదేశంలో రూ.24.35 కోట్లుగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 39.75 కోట్లుగా నిలిచాయి.

మండే షాక్

రీరిలీజ్ అయినప్పటికీ బాహుబలి ది ఎపిక్ కు వీకెండ్ లో మంచి స్పందన వచ్చింది. కానీ మండే వీక్ డే కావడంతో మూవీ కలెక్షన్లకు షాక్ తప్పలేదు. కనిష్ఠంగా కేవలం రూ.1.35 కోట్లు మాత్రమే ఖాతాలో వేసుకుంది. వారపు రోజు కావడంతో కలెక్షన్లలో తగ్గుదల ఊహించినదే అయినప్పటికీ, ఈ వారం మొత్తం సినిమా నిలబడుతుందో లేదో చూడాలి.

బాహుబలి వసూళ్లు

గతంలో బాహుబలి తొలిసారి విడుదలైనప్పుడు 'బాహుబలి: ది బిగినింగ్' (2015) ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లు వసూలు చేసింది. విజువల్ వండర్ గా నిలిచిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' (2017) ఏమో ఏకంగా రూ.1788.06 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు కలిపి 'బాహుబలి: ది ఎపిక్' భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం ముగింపులో 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' పేరుతో రూ.120 కోట్ల బడ్జెట్‌తో ఒక యానిమేటెడ్ కథను కూడా ప్రకటించారు. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

బాహుబలి: ది ఎపిక్ గురించి

'బాహుబలి: ది ఎపిక్' అనేది దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్ తదితరులు నటించారు. ఇది బాహుబలి రెండు భాగాల కలయిక. 5 గంటలకు పైగా ఉన్న రెండు చిత్రాల రన్‌టైమ్‌ను 3 గంటల 44 నిమిషాలకు కుదించారు.

ఈ సినిమా రీమాస్టరింగ్ సమయంలో విజువల్‌గా, సౌండ్ పరంగా మెరుగుపరిచారు. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేశారు. కొన్ని సీన్లు తొలగించారు. ఈ చిత్రం సానుకూల స్పందనతో ప్రారంభమైంది. ఉత్సాహంగా ఉన్న అభిమానులు వెండితెరపై మళ్లీ చూసేందుకు థియేటర్లకు తరలివచ్చారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More