రోజు రోజుకీ మందగిస్తున్న బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్.. 3 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ ఇదే!

Baahubali The Epic Box Office Collection Day 3: ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో హిట్ అయిన బాహుబలి సిరీస్ నుంచి రీ-ఎడిట్ సింగిల్ ఫిల్మ్ వెర్షన్‌గా వచ్చిన బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్ రోజు రోజుకు మందగిస్తున్నాయి. ఈ క్రమంలో బాహుబలి ది ఎపిక్ 3 రోజుల కలెక్షన్స్‌పై లుక్కేద్దాం.

Published on: Nov 3, 2025, 05:33:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Baahubali The Epic Box Office Collection Day 3: డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కెరీర్‌లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ అయిన బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్ సినిమాలను బాహుబలి ది ఎపిక్‌గా రీ రిలీజ్‌తో మళ్లీ తెరపైకి వచ్చాయి.

రోజు రోజుకీ మందగిస్తున్న బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్.. 3 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ ఇదే! (YouTube)
రోజు రోజుకీ మందగిస్తున్న బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్.. 3 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ ఇదే! (YouTube)

అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన

రీమాస్టర్ చేయబడిన బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కానీ, రెండో రోజు నుంచి మాత్రం ప్రభాస్ రెండు పాత్రలు పోషించిన బాహుబలి ది ఎపిక్ బాక్సాఫీస్ వద్ద మందగించింది.

అడ్వాన్స్ బుకింగ్ నెట్ కలెక్షన్స్

బాహుబలి ది ఎపిక్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇండియాలో రూ. 1.15 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక రిలీజైన అక్టోబర్ 31 నాడు రూ. 9.5 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది బాహుబలి ది ఎపిక్ మూవీ. ఇందులో తెలుగు ద్వారా రూ. 7.9 కోట్లు, హిందీలో 1.35 కోట్లు, కన్నడలో 0.02 కోట్లు, తమిళంలో 0.2 కోట్లు, మలయాళంలో 0.18 కోట్ల కలెక్షన్స్ ఉన్నాయి.

తగ్గిపోయిన వసూళ్లు

ఓపెనింగ్ కుమ్మెసిన బాహుబలి ది ఎపిక్ సినిమాకు రెండో రోజు కలెక్షన్స్ ఇండియాలో తగ్గిపోయాయి. సుమారు 26 శాతం వరకు పడిపోయాయి. దాంతో రెండో రోజున రానా దగ్గుబాటి విలన్‌గా చేసిన ఈ సినిమాకు 7.3 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూలు అయ్యాయి.

తెలుగులోనే ఎక్కువగా

ఇందులో తెలుగు నుంచి 4.9 కోట్లు, హిందీ ద్వారా 1.6 కోట్లు, కన్నడ నాట నుంచి 0.03 కోట్లు, తమిళం ద్వారా 0.6 కోట్లు, మలయాళంలో 0.17 కోట్ల నెట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇక మూడో రోజు అయిన నవంబర్ 2న బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్ మరింతగా దిగజారిపోయాయి.

3వ రోజు కలెక్షన్స్

మూడో రోజున ఇండియాలో బాహుబలి ది ఎపిక్ సినిమాకు రూ. 4.46 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ పేర్కొంది. అంటే రెండో రోజుతో పోలిస్తే మూడో రోజున దాదాపుగా 28 శాతం వరకు బాహుబలి ది ఎపిక్ నెట్ కలెక్షన్స్ పడిపోయాయి.

3 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్

ఇక ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మూడు రోజుల్లో ఇండియాలో బాహుబలి ది ఎపిక్ సినిమాకు రూ. 22.56 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, నవంబర్ 2న తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా ఈ సినిమాకు 50.50 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.

బాహుబలి ది ఎపిక్ థియేటర్ ఆక్యుపెన్సీ

ఇందులో ఉదయం షోలకు 39.27 శాతం, మ్యాట్నీకి 61.69 శాతం, ఫస్ట్ షోలకు 50.55 శాతం వరకు థియేటర్ ఆక్యుపెన్సీ ఉంది. కాగా, 3 గంటల 45 నిమిషాల రన్‌టైమ్ ఉన్న బాహుబలి ది ఎపిక్ మూవీలో ప్రభాస్ హీరోగా అనుష్క శెట్టి, తమన్నా హీరోయిన్స్‌గా రానా దగ్గుబాటి విలన్‌గా చేసిన విషయం తెలిసిందే.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More