బాహుబలి ది ఎపిక్ ప్రభంజనం-ప్రపంచ రికార్డుపై కన్నేసిన రాజమౌళి సినిమా-కొత్త చరిత్రకు చేరువగా!

సిల్వర్ స్క్రీన్ పై బాహుబలి చిత్రాలు క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు బాహుబలి పార్ట్ 1, 2 కలిపి బాహుబలి ది ఎపిక్ గా రీ రిలీజ్ అయింది. ఈ  మూవీ ఇప్పుడు ప్రపంచ రికార్డుపై కన్నేసింది. 

Published on: Oct 31, 2025, 14:40:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎస్ఎస్ రాజమౌళి అద్భుత సృష్టి 'బాహుబలి'. బాహుబలి రెండు సినిమాలూ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చాయి. ఇప్పుడీ మూవీ రీమాస్టర్డ్, రీ-ఎడిటెడ్ వెర్షన్ ఇవాళ (అక్టోబర్ 31) థియేటర్లలో విడుదలైంది. 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో విడుదలైన ఈ చిత్రం.. 2015, 2017లో విడుదలైన రెండు భాగాలను కలిపి 3 గంటల 45 నిమిషాల నిడివితో ఉంది.

బాహుబలి సినిమాలో ప్రభాస్
బాహుబలి సినిమాలో ప్రభాస్

బాహుబలి ది ఎపిక్ రిలీజ్

బాహుబలి ది ఎపిక్ రీ-రిలీజ్ వెర్షన్ మొదటి కొన్ని షోలు ముగియకముందే బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. బాహుబలి ది ఎపిక్ మూవీ ఇండియాలో, విదేశాలలో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల పరంగా అద్భుతమైన స్పందనను రాబట్టింది. సక్నిల్క్ నివేదిక ప్రకారం గురువారం మధ్యాహ్నానికే ఈ చిత్రానికి స్వదేశంలో, విదేశాలలో కలిపి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.5 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. రోజు ముగిసే సమయానికి ఈ సంఖ్య రూ.6 కోట్లకు పైగా పెరిగింది. ఇది భారతదేశంలో రీ-రిలీజ్ అయిన ఏ చిత్రానికైనా అత్యధిక అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్.

బాహుబలి ది ఎపిక్ కలెక్షన్లు

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 'బాహుబలి: ది ఎపిక్' ఫస్ట్ డే ఇండియాలో రూ. 10 నుంచి 12 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ.20-25 కోట్ల గ్రాస్ వసూలు చేయవచ్చని అంచనా. ఈ సంఖ్య ఈ సంవత్సరం అత్యంత విజయవంతమైన కొన్ని తెలుగు చిత్రాల వసూళ్ల కంటే కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు ఈ ఏడాది 'మిరాయ్' రూ.12 కోట్లతో ఓపెన్ అవ్వగా, 'తండేల్' మొదటి రోజు రూ.10 కోట్లు వసూలు చేసింది. ఒకవేళ రీరిలీజ్ అయిన 'బాహుబలి: ది ఎపిక్' కొత్త సినిమాలను మించిపోతే అది అపూర్వమైన విజయం అవుతుంది.

బాక్సాఫీస్ రికార్డులు

బాహుబలి ది ఎపిక్ మొదటి రోజే మూడు ప్రధాన రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది. భారత సినీ చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్ సాధించిన రీ-రిలీజ్‌గా ఇది నిలుస్తుంది. ప్రస్తుతం ఈ రికార్డు పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' పేరిట ఉంది, ఇది రీ-రిలీజ్‌లో దేశీయంగా రూ.5.1 కోట్ల నెట్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభాస్, రానా దగ్గుబాటి నటించిన ఈ చిత్రం 'గిల్లి' పేరిట ఉన్న రూ.8 కోట్ల రికార్డును అధిగమించనుంది.

తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రీ-రిలీజ్ మూవీ మహేష్ బాబు 'ఖలేజా'. ఇది తన రెండవ విడుదలలో రూ.11 కోట్లకు పైగా సంపాదించింది. 'బాహుబలి: ది ఎపిక్' ఈ సంఖ్యను మొదటి రోజే బద్దలు కొట్టనుంది. మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉంటే ఈ చిత్రం రూ.100 కోట్ల మార్కును కూడా దాటుతుందని అంచనా వేస్తున్నారు.

బాహుబలి ఫ్రాంచైజీ గురించి

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన పీరియడ్ యాక్షన్ ఫాంటసీ చిత్రాలైన ఈ రెండు బాహుబలి భాగాలను కలిపి రూ.500 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ రెండు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రూ.2400 కోట్లకు పైగా వసూలు చేశాయి. 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. అయితే కొన్ని నెలల తర్వాత 'దంగల్' ఆ రికార్డును అధిగమించింది. ఈ రెండు చిత్రాలలో ప్రభాస్ టైటిల్ రోల్‌లో నటించగా రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, రమ్యకృష్ణ, తమన్నా భాటియా సత్యరాజ్ కీలక పాత్రలలో నటించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More