ఓటీటీలో క్రేజీ మూవీ-బాహుబలి ది ఎపిక్ స్ట్రీమింగ్ షురూ-రెండు పార్ట్‌లు కలిపి ఒకే సినిమా-తెరపై విజువల్ వండర్
ఇవాళ ఓటీటీలోకి ఓ క్రేజీ సినిమా వచ్చింది. బాహుబలి 1, బాహుబలి 2 కలిపి ఒకే మూవీగా థియేటర్లో రిలీజైన బాహుబలి ది ఎపిక్ ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టింది. రీ మాస్టర్డ్ రిలీజ్ వర్షన్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది. ఇది తెరపై విజువల్ వండర్.
ఓటీటీలోకి భారీ సినిమా వచ్చేసింది. ప్రతిష్ఠాత్మక మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అదే బాహుబలి ది ఎపిక్. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి: ది ఎపిక్ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. ఆయన గతంలో రూపొందించిన 'బాహుబలి: ది బిగినింగ్' (2015), 'బాహుబలి 2: ది కంక్లూజన్' (2017) చిత్రాల కలయిక ఇది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తోంది.

బాహుబలి ది ఎపిక్ ఓటీటీ
క్రిస్మస్ సందర్భంగా బాహుబలి: ది ఎపిక్ చిత్రం గురువారం (డిసెంబర్ 25) ఓటీటీలో రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం రన్‌టైమ్ 3 గంటల 43 నిమిషాలు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా తదితరులు నటించారు. బాహుబలి 1, 2 సినిమాలు అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.
55 రోజుల తర్వాత
బాహుబలి: ది ఎపిక్ చిత్రం థియేటర్లలో విడుదలైన 55 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. సాధారణంగా చాలా తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలైన 4 వారాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి వస్తాయి. కొన్ని అరుదైన సందర్భాలలో ఇలా మినహాయింపులు ఉంటాయి.
రీ రిలీజ్ రికార్డు
రీ రిలీజ్ పరంగా చూసుకుంటే బాహుబలి ది ఎపిక్ మూవీ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. సక్నిల్క్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రూ. 51.72 కోట్లు వసూలు చేసింది. దీనితో 'సనం తేరి కసం', 'తుంబాడ్', 'ఘిల్లి' వంటి చిత్రాల రీ-రిలీజ్ వసూళ్లను అధిగమించింది బాహుబలి ది ఎపిక్. అత్యధికంగా వసూళ్లు సాధించిన రీ-రిలీజ్ చిత్రంగా నిలిచి, హిస్టరీ క్రియేట్ చేసింది.
అంతకుముందు బాహుబలి 1 ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్లు వసూలు చేయగా, బాహుబలి 2 రూ.1788 కోట్లు కొల్లగొట్టింది. ఇది 'యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్' తర్వాత భారతదేశంలో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన ఫ్రాంచైజీగా నిలిచింది.
బాహుబలి తర్వాత
బాహుబలి చిత్రాల తర్వాత రాజమౌళి 2022లో 'RRR' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం నుండి 'నాటు నాటు' పాట గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులను గెలుచుకొని, చిత్ర దర్శకుడిని ప్రపంచ పటంలో నిలబెట్టింది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లతో 'వారణాసి' తెరకెక్కిస్తున్ననారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


