Ram Charan OTT: ఓటీటీలోకి ఓ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ రాబోతుంది. గ్లోబల్ స్టార్ స్పెషల్ గా ప్రశంసలు కురిపించిన ఆ సినిమానే 'బేబీ డూ డై డూ' (Baby Do Die Do). ఈ సూపర్ హిట్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ గురించి ఆడియన్స్ కొంత కాలంగా వెయిట్ చేస్తున్నారు.
బేబీ డూ డై డూ

బేబీ డూ డై డూ మూవీ డిఫరెంట్ టైటిల్ తోనే కాదు స్టోరీ లైన్ తోనూ ఆకట్టుకుంది. థియేటర్లలో విడుదలైన సమయంలో ప్రమోషన్ల హోరు లేక సైలెంట్‌గా వచ్చి వెళ్లింది. అయితే హ్యూమా ఖురేషీ, సాఖిబ్ సలీమ్‌ల అద్భుతమైన యాక్టింగ్ ను రామ్ చరణ్ బహిరంగంగా కొనియాడటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఒక్కసారిగా సినీ ప్రియుల దృష్టి పడింది.
ఏ ఓటీటీలోకి?
థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ బేబీ డూ డై డూ చిత్రం త్వరలోనే ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ వీక్షకుల ముందుకు రానుంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ అధికారిక యాప్‌లోని 'కమింగ్ నెక్స్ట్ వీక్' (Coming Next Week) విభాగంలో 'బేబీ డూ డై డూ' సినిమాను చేర్చడం డిజిటల్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
ఎప్పటి నుంచంటే?
బేబీ డూ డై డూ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై మేకర్స్ ఇంకా కచ్చితమైన సమాచారం రాలేదు. కానీ కమింగ్ నెక్స్ట్ వీక్ అని పెట్టడంతో సెప్టెంబర్ 25 లేదా అక్టోబర్ 2న ఈ చిత్రం డిజిటల్ వేదికపై అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
చెవిటి, మూగ కాంట్రాక్ట్ కిల్లర్
నాచికేత్ సమంత్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ బేబీ డూ డై డూలో హ్యూమా ఖురేషీ మూగ, చెవిటి కాంట్రాక్ట్ కిల్లర్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకన్నారు. ప్రతికార వాంఛతో రగిలిపోయే ఒక హంతకురాలిగా ఆమె ప్రదర్శించిన హావభావాలు, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
{{/usCountry}}నాచికేత్ సమంత్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ బేబీ డూ డై డూలో హ్యూమా ఖురేషీ మూగ, చెవిటి కాంట్రాక్ట్ కిల్లర్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకన్నారు. ప్రతికార వాంఛతో రగిలిపోయే ఒక హంతకురాలిగా ఆమె ప్రదర్శించిన హావభావాలు, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
{{/usCountry}}సాఖిబ్ సలీమ్, చంకీ పాండే, సికందర్ ఖేర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. థియేట్రికల్ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ, హుమా ఖురేషీ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌కు విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.
ట్రెండింగ్ లోకి
ఓటీటీ వేదికలలో ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో డార్క్, రివేంజ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లకు ఉన్న ఆదరణ చాలా ఎక్కువ. హ్యూమా ఖురేషీ పోషించిన డెఫ్ అండ్ మ్యూట్ కాంట్రాక్ట్ కిల్లర్ కాన్సెప్ట్ థ్రిల్లర్ ప్రియులలో క్యూరియాసిటీని పెంచుతోంది. థియేటర్లలో కలెక్షన్లు రాబట్టలేకపోయినా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పక్కా వర్డ్ ఆఫ్ మౌత్ తో నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ చార్ట్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.