Irumudi OTT: ఫ్యామిలీలను థియేటర్లకు రప్పించిన మూవీ.. ఇవాళ ఓటీటీలోకి.. ఇరుముడిని ఎందుకు మిస్ అవకూడదంటే?
Irumudi OTT: ఓటీటీ లవర్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఇరుముడి ఇవాళ ఓటీటీలో రిలీజైంది. మరి ఈ సినిమాను ఓటీటీలో ఎందుకు మిస్ కాకూడదో ఇక్కడ చూసేయండి.
Irumudi OTT: ఒక సినిమా.. కుటుంబాలను కదిలించింది. ఒక సినిమా.. షోలు వేయాలని ధర్నాలు చేసేలా చేసింది. ఒక సినిమా.. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ అలరించింది. అదే.. ఇరుముడి సినిమా. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఇవాళ (సెప్టెంబర్ 18) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇరుముడి ఓటీటీ
రవితేజ హీరోగా వచ్చిన ఇరుముడి మూవీ అంచనాలను మించి అదరగొట్టింది. బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ ఏకంగా రూ.230 కోట్లకు పైగా వసూళ్లను ఖాతాలో వేసుకుంది. ఈ ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్ జనాలకు తెగ నచ్చేసింది. ఈ రోజు నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో సహా అయిదు భాషల్లో రిలీజైంది.
తండ్రీకూతురు ఎమోషన్
ఇరుముడి మూవీని ఓటీటీలో ఎందుకు చూడాలంటే.. ముందుగా తండ్రీకూతురు ఎమోషన్ గురించి చెప్పుకోవాలి. ఇందులో రవితేజ, అతని కూతురిగా నటించిన బేబీ నక్షత్ర మధ్య బాండింగ్ వేరే లెవల్. ఏది చూసినా, ఏం జరిగినా తండ్రికి చెప్పాలంటూ తన కూతురును ధైర్యంగా పెంచుతాడు హీరో. ఇప్పుడు ఆడపిల్లలను అలాగే పెంచాలని చాటే మూవీ ఇది.
వేరే లెవల్ యాక్టింగ్
ఇక ఇరుముడి సినిమాలోని నటీనటుల యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రవితేజ, బేబీ నక్షత్ర, సాయి కుమార్, స్వాసిక ఇలా అందరూ తమ నటనతో సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లారు.
జీవీ ప్రకాష్ మ్యూజిక్
ఇరుముడి మూవీ మ్యూజిక్ మరో హైలైట్. జీవీ ప్రకాష్ కుమార్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. పాటలు, బీజీఎం సినిమాకు ప్రాణం పోశాయి. ఇరుముడి కట్టు, యాలో యాలో, మల్లెపూల పల్లకి పాటలకు థియేటర్లు దద్దరిల్లాయి. ఇక సస్పెన్స్, ఎమోషనల్ సీన్లలో వచ్చే బీజీఎం కూడా ఆకట్టుకుంది.
సస్పెన్స్ థ్రిల్లర్
ఇరుముడి మూవీ కేవలం డివోషనల్ లేదా ఎమోషనల్ సినిమా మాత్రమే కాదు ఇందులో సస్పెన్స్ కూడా ఉంది. నాగులును ఎవరు చంపారు? స్కూల్ టీచర్ ఇంట్లో ఏం జరుగుతుంది? మణికంఠ చావు వెనుకాల ఎవరు ఉన్నారన్నది ఉత్కంఠ రేపుతుంది. లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ తో ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవడం ఖాయం.
ఫ్యామిలీ వాచ్
ఇరుముడి మూవీ కుటుంబాలకు కనెక్ట్ కావడం మరో గొప్ప విషయం. ఈ సినిమా కోసం ఫ్యామిలీలు థియేటర్లకు పోటెత్తాయి. ఇప్పుడు ఓటీటీలోనూ కుటుంబం అంతా కూర్చుని ఎంజాయ్ చేసే సినిమాగా ఇరుముడి నిలిచింది. ఈ వీకెండ్ లో మంచి సినిమా చూడాలనుకునే ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇరుముడి పర్ఫెక్ట్ వాచ్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


