డైరెక్టర్ చెప్పకుండానే హీరోకు ముద్దు- మూడేళ్లకు ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ డ్రామా-సినీ ఇండస్ట్రీ చీకటి కోణాలు

థియేటర్లలో రిలీజైన మూడేళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తోంది ఓ రొమాంటిక్ కామెడీ మూవీ. ఇది హాలీవుడ్ ఇండస్ట్రీ చీకటి కోణాలను కూడా చూపిస్తుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇక్కడ చూసేయండి. 

Published on: Dec 1, 2025, 09:34:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హాలీవుడ్ సినిమాలను తెలుగు ఆడియన్స్ కూడా ఆదరిస్తారు. ఓటీటీల్లో ఈ మూవీస్ కు ఫాలోయింగ్ ఎక్కువే. ముఖ్యంగా బ్రాడ్ పిట్ లాంటి స్టార్లు నటించిన సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు బ్రాడ్ పిట్ హీరోగా నటించిన ఓ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లో రిలీజైన మూడేళ్లకు ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి రాబోతున్న మూవీ ‘బేబిలాన్’.

ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ మూవీ
ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ మూవీ

బేబిలాన్ ఓటీటీ

హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ బేబిలాన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. బ్రాడ్ పిట్ హీరోగా నటించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టనుంది. డిసెంబర్ 7 నుంచి బేబిలాన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్నప్పటికీ అది రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది.

రొమాంటిక్ డ్రామాగా

దర్శకుడు డెమియన్ చాజెల్ ‘బేబిలాన్’ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కించారు. ఇది హాలీవుడ్ చరిత్రను, ఇందులోని చీకటి కోణాలను తెలుపుతుంది. ఈ సినిమా 2022లో థియేటర్లో రిలీజైంది. బేబిలాన్ మూవీ మూకీ సినిమాల నుంచి టాకీ చిత్రాలకు మారుతున్న కాలాన్ని చూపిస్తుంది.1920 ల హాలీవుడ్ మార్పులను కళ్లకు కడుతుంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.

బేబిలాన్ స్టోరీ

1920ల చివర్లో మూకీ నుంచి టాకీలోకి మారుతున్న హాలీవుడ్ చిత్రాల మార్పులను బేబిలాన్ సినిమా మూవీ కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇందులో జాకీ కాన్రాడ్ (బ్రాడ్ పిట్) ఓ పెద్ద మూకీ స్టార్. నెల్లీ లారాయ్ (మార్గాట్ రాబీ) కాలిఫోర్నియాలోని ఓ అమ్మాయి. పాపులర్ కావాలని కలలు కంటుంది. మ్యాన్యుయెల్ టోర్రెస్ (డియెగో కాల్వా) సినిమా స్టూడియోలో చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నత స్థానాలకు ఎదుగుతాడు.

హాలీవుడ్ లో పార్టీలు, విలాసాలు బేబిలాన్ సినిమాలో చూడొచ్చు. అలాగే హాలీవుడ్ స్వర్ణ యుగాన్ని కూడా చూపించారు. అంతే కాకుండా మూకీల నుంచి టాకీలకు సినిమాలు మారే క్రమం, ఆ కారణంగా కలిగే పెను మార్పులు, ఇండస్ట్రీలోని చీకటి కోణాలు ఈ సినిమా కథలో భాగమే.

స్క్రిప్ట్ లో లేని ముద్దు

సాధారణంగా సినిమాల్లో సీన్లు అన్ని స్క్రిప్ట్ ప్రకారమే సాగిపోతుంటాయి. డైరెక్టర్ చెప్పినట్లు యాక్టర్లు చేయాలి. కానీ బేబిలాన్ షూటింగ్ సమయంలో స్క్రిప్ట్ లో లేకుండానే, డైరెక్టర్ చెప్పకుండానే బ్రాడ్ పిట్ కు మార్గోట్ రాబీ ముద్దు పెడుతుంది. ఈ లిప్ కిస్ సీన్ అప్పట్లో సెన్సేషనల్ గా మారింది. "అది స్క్రిప్ట్ లో లేదు. కానీ నేను అనుకున్నా. బ్రాడ్ పిట్ ను ముద్దు పెట్టుకునే అవకాశం మరెప్పుడు వస్తుంది? అందుకే అలా చేశా’’ అని మార్గోట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More