Bad Boy కార్తీక్: శుక్రవారం వచ్చిందంటే ఓటీటీలో కొత్త సినిమాలో జోష్ ఉంటుంది. ఇవాళ అలాగే సెలైంట్ గా ఓ తెలుగు మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగశౌర్య కెరీర్‌లో చాలా కాలంగా వార్తల్లో నిలుస్తూ, పలు వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. ఈ మూవీ ఇవాళ (మే 15) ఓటీటీలోకి అడుగుపెట్టింది.
బ్యాడ్ బాయ్ కార్తీక్ ఓటీటీ

నాగశౌర్య హీరోగా నటించిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 17, 2026న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సినిమా మేకింగ్ పరంగా క్వాలిటీ ఉన్నప్పటికీ, ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ వెనుకబడటం ఈ సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది.
థియేటర్లలో ఫ్లాప్
ఏ మూవీకైనా ప్రమోషన్లు చాలా ముఖ్యం. కానీ బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమా విషయంలో ప్రమోషన్లు పెద్దగా కనిపించలేదు. సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో తగినంత బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ విఫలమయ్యారు. తక్కువ ప్రమోషన్ల కారణంగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన విషయం కూడా చాలా మంది సినీ ప్రియులకు తెలియకుండా పోయింది.
రొటీన్ కథ
థియేటర్లలోకి ఇలా వచ్చి, అలా వెళ్లిపోయిన మూవీ బ్యాడ్ బాయ్ కార్తీక్. అసలు ఇది ఎప్పుడు రిలీజ్ అయింది? అని ఆశ్చర్యపోయే సినీ లవర్స్ కూడా ఉన్నారు. ఇక సినిమా చూసిన విమర్శకుల నుంచి కూడా ఈ మూవీకి సానుకూల స్పందన లభించలేదు రొటీన్ కథ,టేకింగ్ అనే విమర్శలు వచ్చాయి. ఫలితంగా కమర్షియల్‌గా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చేతులేత్తేసింది. ఐఎండీబీలో ఈ మూవీకి 7.2 రేటింగ్ ఉంది.
సైలెంట్‌గా డిజిటల్ ఎంట్రీ
థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఎలాంటి హడావిడి లేకుండా బ్యాడ్ బాయ్ కార్తీక్ ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమేజాన్ ప్రైమ్ వీడియోలో ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ప్రస్తుతం అందుబాటులో ఉంది. థియేటర్లకు వెళ్లని సినీ ప్రేమికులు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఈ సినిమాను వీక్షించవచ్చు. బిగ్ స్క్రీన్‌పై డిజాస్టర్‌గా మిగిలిన ఈ చిత్రం, డిజిటల్ వేదికపై ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.
డెబ్యూ డైరెక్టర్
{{/usCountry}}థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఎలాంటి హడావిడి లేకుండా బ్యాడ్ బాయ్ కార్తీక్ ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమేజాన్ ప్రైమ్ వీడియోలో ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ప్రస్తుతం అందుబాటులో ఉంది. థియేటర్లకు వెళ్లని సినీ ప్రేమికులు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఈ సినిమాను వీక్షించవచ్చు. బిగ్ స్క్రీన్‌పై డిజాస్టర్‌గా మిగిలిన ఈ చిత్రం, డిజిటల్ వేదికపై ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.
డెబ్యూ డైరెక్టర్
{{/usCountry}}ఈ చిత్రంతో రమేష్ దేశిన దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. నాగశౌర్య సరసన విధి యాదవ్ హీరోయిన్‌గా నటించగా, కీలక పాత్రలో వెర్సటైల్ యాక్టర్ సముద్రఖని కనిపించారు. శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందించారు. నాగశౌర్యకు అక్కగా శ్రీదేవి నటించింది. అక్క కోసం తమ్ముడు చేసే పోరాటం చుట్టూ ఈ మూవీ సాగుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది?
ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
2. ఈ సినిమా దర్శకుడు ఎవరు?
ఈ చిత్రానికి రమేష్ దేశిన దర్శకత్వం వహించారు. ఇది ఆయనకు మొదటి సినిమా.
3. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు?
ఈ యాక్షన్ డ్రామాలో నాగశౌర్య సరసన విధి యాదవ్ కథానాయికగా నటించింది.