Heroine: బ్యూటీని వెంటాడుతున్న బ్యాడ్‌ల‌క్‌.. ప‌వ‌న్, ప్ర‌భాస్‌తో సినిమాలు చేసినా మార‌ని రాత‌.. ఈ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Heroine: ఈ అందాల భామను బ్యాడ్‌ల‌క్‌ వెంటాడుతూనే ఉంది. ఇప్పటివరకూ తన కెరీర్ లో 10 సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఒకే ఒక్క సూపర్ హిట్ అందుకుంది. ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్లతో మూవీస్ చేసినా ఆమె రాత మారలేదు. మరి ఈ హీరోయిన్ ఎవరో ఇక్కడ చూసేయండి. 

Published on: Mar 29, 2026, 10:05:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినిమా ఇండస్ట్రీలో చేసిన మూవీస్ కంటే కూడా వచ్చిన విజయాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ సూపర్ హిట్లే అన్నీ మాట్లాడతాయి. ఫ్లాప్ లు వస్తున్న హీరోయిన్ పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోతుంది. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది అందాల భామ ‘నిధి అగర్వాల్’. పవన్ కల్యాణ్, ప్రభాస్ తో సినిమాలు చేసిన ఈ భామ రాత మారలేదు.

బ్యూటీకి బ్యాడ్‌ల‌క్‌ (instagram)
బ్యూటీకి బ్యాడ్‌ల‌క్‌ (instagram)

పవన్, ప్రభాస్ తో సినిమాలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి హీరోలతో ఒక్క సినిమా చేయాలని చాలా మంది హీరోయిన్లు ఆశపడుతుంటారు. వీళ్లతో చేసిన ఒక్క సినిమా హిట్ అయినా కూడా ఆ హీరోయిన్ దశ తిరిగిపోతుంది. కానీ నిధి అగర్వాల్ కు మాత్రం బ్యాడ్‌ల‌క్‌ తప్పడం లేదు. పవన్, ప్రభాస్ తో చేసిన సినిమాలు నిధి అగర్వాల్ కు నెగెటివ్ రిజల్టే తెచ్చిపెట్టాయి.

మూవీస్ ఫ్లాప్

పవన్ కల్యాణ్ తో హరి హర వీరమల్లు, ప్రభాస్ తో ది రాజాసాబ్ సినిమాల్లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేసింది. ఇవి రెండు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచాయి. ముఖ్యంగా ది రాజాసాబ్ అయితే డిజాస్టర్ ను ఖాతాలో వేసుకుంది. దీంతో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న నిధికి నిరాశ తప్పలేదు.

10 సినిమాలు

2017లో కెరీర్ స్టార్ట్ చేసిన నిధి అగర్వాల్ ఇప్పటివరకూ 10 సినిమాలు చేసింది. కానీ ఇందులో ఒకటే సూపర్ హిట్. హిందీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన మున్నా మైఖేల్ తో నిధి డెబ్యూ చేసింది. 2018లో నాగ చైతన్య ‘సవ్యసాచి’ మూవీతో తెలుగులో నిధి అగర్వాల్ అడుగుపెట్టింది.

అదొక్కటే

ఆ తర్వాత మిస్టర్ మజ్ను మూవీ కూడా నిధికి నిరాశనే అందించింది. అయితే 2019లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’తో నిధి ఫస్ట్ సక్సెస్ అందుకుంది. రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.

ఆ తర్వాత తమిళ్ లో ‘ఈశ్వరన్’, ‘భూమి’ సినిమాలు చేసినా నిధికి కలిసి రాలేదు. వరుసగా ‘హీరో’, ‘కలగ తలైవన్’, ‘హరి హర వీరమల్లు’, ‘ది రాజాసాబ్’ ఫెయిల్యూర్ లో తప్పలేదు.

ఇప్పటికైనా

నిధి అగర్వాల్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి. ఓ మంచి లవ్ స్టోరీ చేయాలని ఉందని గతంలో నిధి అగర్వాల్ పేర్కొంది. ప్రస్తుతం తెలుగులో ఒకటి, హిందీలో రెండు మూవీస్ చేస్తోంది. మరి వీటితోనైనా నిధి అగర్వాల్ రాత మారుతుందా? సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.

హాట్ ఫొటోలు

మరోవైపు సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ హాట్ ఫొటోలు పంచుకుంటూనే ఉంది. తాజాగా బ్లూ కలర్ చీరలో అందాలు ఆరబోసింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More