శివాజీకి నిధి అగర్వాల్ కౌంటర్.. బాధితురాలినే నిందిస్తే ఎలా అంటూ పోస్ట్

నటుడు శివాజీకి నిధి అగర్వాల్ కూడా కౌంటర్ ఇచ్చింది. అతని పేరు ప్రస్తావించకుండానే బాధితురాలినే నిందించడాన్ని తప్పుబట్టింది. మొత్తానికి శివాజీ కామెంట్స్ పై టాలీవుడ్ లో రచ్చ కొనసాగుతూనే ఉంది.

Published on: Dec 24, 2025, 19:12:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బుధవారం (డిసెంబర్ 24) హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో అతడు తన వాదనను సమర్థించుకుంటూ.. నిధి అగర్వాల్ బట్టల వల్లే జనం రెచ్చిపోయారని, సమంత చీర కట్టుకుంది కాబట్టి లక్కీగా సేఫ్ అయిందని వ్యాఖ్యానించాడు. దీనిపై నిధి అగర్వాల్ స్పందిస్తూ.. "బాధితులను నిందించడం మ్యానిపులేషన్ (పక్కదారి పట్టించడం) అవుతుంది" అని గట్టిగా బదులిచ్చింది.

శివాజీకి నిధి అగర్వాల్ కౌంటర్.. బాధితురాలినే నిందిస్తే ఎలా అంటూ పోస్ట్
శివాజీకి నిధి అగర్వాల్ కౌంటర్.. బాధితురాలినే నిందిస్తే ఎలా అంటూ పోస్ట్

శివాజీకి నిధి కౌంటర్ ఇలా..

హీరోయిన్ల బట్టల గురించి నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ఇంకా రచ్చ అవుతూనే ఉన్నాయి. తాను చెప్పింది కరెక్టే అంటూ అతడు ప్రెస్ మీట్‌లో మాట్లాడిన మాటలకు.. హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా చురకలు అంటించింది.

డిసెంబర్ 17న 'ది రాజా సాబ్' ఈవెంట్ కోసం లులు మాల్‌కు వెళ్లిన నిధి అగర్వాల్‌ను జనం చుట్టుముట్టిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ రోజు ఆమె వేసుకున్న బట్టల వల్లే అలా జరిగిందని శివాజీ పదే పదే అనడంపై నిధి స్పందించింది.

ఆమె ఆ రోజు ఈవెంట్‌లో దిగిన తన ఫోటోను షేర్ చేస్తూ.. "ఒక బాధితురాలిని నిందించడం అనేది మ్యానిపులేషన్ అవుతుంది" అని రాసుకొచ్చింది. ఎవరి పేరు చెప్పకపోయినా.. ఇది శివాజీకి ఇచ్చిన కౌంటరే అని అందరికీ అర్థమైంది.

"ఆమె రెచ్చగొట్టింది.. మగవాళ్ళు అంతే"

మగవాళ్లు పద్ధతిగా ఉండాలని ఎందుకు చెప్పరు అని విలేకరులు ప్రశ్నించగా శివాజీ వింత సమాధానం ఇచ్చాడు.

"మగవాళ్ళకు చెప్తే ఎవరు వింటారు? వాళ్లు ఫోటోలు దిగడానికో, మాట్లాడటానికో వస్తారు. ఆ రోజు నిధి బట్టలు గనక జారిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? మనం అడిగితే ఎవరైనా ఆ వీడియోలు డిలీట్ చేస్తారా?" అని ప్రశ్నించాడు.

"సమంత చీర కట్టుకుంది కాబట్టి లక్కీ.."

సమంత చీర కట్టుకుని వెళ్లినా ఆమెను కూడా జనం ఇబ్బంది పెట్టారు కదా అని అడగగా.. "సమంతకు అదొక అడ్వాంటేజ్ అయ్యింది. ఆమె అదృష్టవశాత్తూ చీరలో ఉంది కాబట్టి సేఫ్ అయ్యింది. ఈ కాలం జెన్-Z పిల్లలకు ఏం తెలియదు.. ఆర్టిస్టులను తాకాలని చూస్తుంటారు. పాతకాలంలో శ్రీదేవిని కూడా తెనాలిలో షూటింగ్ అప్పుడు ఎవరో టచ్ చేశారు. ఇక్కడ నేను నిధిని గానీ, సమంతను గానీ బ్లేమ్ చేయడం లేదు. జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్తున్నా" అని అన్నాడు.

"సాయి పల్లవిని ఎవరైనా టచ్ చేశారా?"

మహిళలు ఏ బట్టలు వేసుకున్నా వేధింపులు జరుగుతున్నాయి కదా అని విలేకరులు నిలదీయగా.. శివాజీ టాపిక్ మార్చేశాడు.

"సోషల్ మీడియాలో చాలామంది అడుగుతున్నారు.. సాయి పల్లవి, అనుష్క, సౌందర్య, భూమిక, లయ, మీరా జాస్మిన్ లాంటి వాళ్ళను ఎవరైనా టచ్ చేశారా? వాళ్ళు పద్ధతిగా డ్రెస్ చేసుకుంటారు కాబట్టి ఆ సమస్య రాలేదు. మీరు రెచ్చగొట్టకండి.. అలా చేస్తే మగవాళ్ళకు టచ్ చేయాలని అనిపిస్తుంది. వాళ్లకు ఆ అవకాశం ఎందుకు ఇస్తారు? మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి.. కానీ నేను ఉన్న వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నా" అని శివాజీ చెప్పుకొచ్చాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More