బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ కలిపి బాహుబలి ది ఎపిక్ రూపంలో రిలీజ్ అవుతున్న విషయం తెలుసు కదా. శుక్రవారం (అక్టోబర్ 31) ఈ మూవీ రిలీజ్ కానుండగా.. గురువారం రాత్రి నుంచే థియేటర్లలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి ప్రసాద్ సినిమాస్ లోని పీసీఎక్స్ స్క్రీన్ కి వెళ్లి అభిమానులతో ముచ్చటించాడు.
అందుకే ఈ ఎపిక్ నిర్ణయం

రాజమౌళి సడెన్ గా థియేటర్లోకి వచ్చేసరికి అభిమానులు ఆశ్చర్యానికి గురై పెద్దగా అరిచారు. మొదట వాళ్లతో బాహుబలి మాహిష్మతి భాషలో జక్కన్న మాట్లాడాడు. మాహిష్మతి రాజ్య ప్రజలు ఎలా ఉన్నారు.. ఆ ముసలోడు బిజ్జలదేవుడు ఉన్నాడా ఇంకా అని సరదాగా అడిగాడు.
ఆ తర్వాత ఈ సినిమాపై పదేళ్లయినా మీ ప్రేమ తగ్గలేదని, అందుకే రీరిలీజ్ చేద్దామా లేక ఏదైనా కొత్తగా చేద్దామా అని ఆలోచించి.. ఇలా ఎపిక్ రూపంలో తీసుకొస్తున్నామని రాజమౌళి అన్నాడు. మీరు మెచ్చిన సీన్లంటినీ అలాగే ఉంచానని అనుకుంటున్నానని, మూవీ చూసి ఎంజాయ్ చేయాలని అతడు కోరాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రూ.10 కోట్లు దాటిన బుకింగ్స్
'బాహుబలి: ది ఎపిక్' ఇప్పటికే ఇండియన్ సినిమాల రీ-రిలీజ్‌లలో అతిపెద్ద ఓపెనింగ్‌ను సాధించింది. ఇది ఇండియాలో ప్రీ-సేల్స్ ద్వారా రూ.5 కోట్లు, ఉత్తర అమెరికాలో రూ.5 కోట్లు వసూలు చేసింది. ఓపెనింగ్ రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్ల మార్కును చేరుకున్న మొదటి తెలుగు రీ-రిలీజ్ కూడా ఇదే. కొత్త బాహుబలి మూవీ భారతీయ రీ-రిలీజ్‌ల రికార్డులను బద్దలు కొట్టి, ప్రపంచవ్యాప్తంగా కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.
గతంలో విజయ్ దళపతి ‘గిల్లీ’.. అత్యధిక వసూళ్లు సాధించిన రీ-రిలీజ్‌గా చెబుతారు. అయితే ఓపెనింగ్ రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.7.9 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కొందరు రూ.10 కోట్లు అని కూడా అంటారు. దీనిపై స్పష్టత లేదు. ఇక పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' ప్రపంచవ్యాప్తంగా రూ.8 కోట్లు వసూలు చేయగా, మహేష్ బాబు 'ఖలేజా' రూ.6.85 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం హర్షవర్ధన్ రాణే 'సనమ్ తేరీ కసమ్' రీ-రిలీజ్లన్నిటిలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రూ.41 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.
బాహుబలి: ది ఎపిక్ గురించి
{{/usCountry}}గతంలో విజయ్ దళపతి ‘గిల్లీ’.. అత్యధిక వసూళ్లు సాధించిన రీ-రిలీజ్‌గా చెబుతారు. అయితే ఓపెనింగ్ రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.7.9 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కొందరు రూ.10 కోట్లు అని కూడా అంటారు. దీనిపై స్పష్టత లేదు. ఇక పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' ప్రపంచవ్యాప్తంగా రూ.8 కోట్లు వసూలు చేయగా, మహేష్ బాబు 'ఖలేజా' రూ.6.85 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం హర్షవర్ధన్ రాణే 'సనమ్ తేరీ కసమ్' రీ-రిలీజ్లన్నిటిలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రూ.41 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.
బాహుబలి: ది ఎపిక్ గురించి
{{/usCountry}}ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా ప్రధాన పాత్రలు పోషించిన 'బాహుబలి: ది ఎపిక్' సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించాడు. అర్కా మీడియా వర్క్స్ నిర్మించింది. ఈ సినిమా రన్‌టైమ్ 3 గంటల 45 నిమిషాలు. ఈ మూవీ ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 1150 థియేటర్లలో రీ-రిలీజ్ అవుతోంది.
అమెరికాలో 'బాహుబలి: ది ఎపిక్' 400 థియేటర్లలో.. యూకే, ఐర్లాండ్‌లో 210, యూఏఈ, జీసీసీలలో 150కి పైగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో 144, ఆగ్నేయాసియాలో 100కి పైగా థియేటర్లలో విడుదల అవుతుంది. ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.