నందమూరి బాలకృష్ణ మోస్ట్ అవేటెడ్ మూవీ అఖండ 2. నాలుగేళ్ల కిందట వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ ఇది. బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వరుసగా నాలుగో హిట్ కోసం బాలయ్య చూస్తున్నాడు. ఈ మూవీ శుక్రవారం (డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా టికెట్ల ధర పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఏపీలో అఖండ 2 టికెట్ల ధరలు ఇలా..

ఆంధ్రప్రదేశ్ లో అఖండ 2 మూవీ టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ మేరకు మంగళవారం (డిసెంబర్ 2) అక్కడి ప్రభుత్వం జీవో జారీ చేసింది. రిలీజ్ కు ముందు రోజు అంటే గురువారం (డిసెంబర్ 4) రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోల కోసం టికెట్ల ధరను రూ.600 గా నిర్ణయించారు.
అన్ని థియేటర్లలోనూ ఇదే ధర ఉంటుంది. ఇక మూవీ రిలీజయ్యే డిసెంబర్ 5 నుంచి తొలి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ అయితే రూ.75, మల్టీప్లెక్స్ అయితే రూ.100 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ పెంపుతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ల ధర రూ.222.50 కాగా.. మల్టీప్లెక్స్ లలో రూ.277గా ఉండనుంది.
అఖండ 2 మూవీ గురించి..
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో గతంలో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూడూ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. దీంతో ఇప్పుడు రాబోయే అఖండ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రాలాంటి వాళ్లు కూడా నటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించాడు.
ఈ సినిమా ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దేశభక్తికి సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ను జోడించి తీసిన మూవీగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో రెండు వేర్వేరు పాత్రల్లో బాలయ్య నటించాడు. తొలిసారి అఘోరా పాత్రలో అతడు నట విశ్వరూపం చూపించినట్లు ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే తెలుస్తోంది. ఆ లెక్కన డిసెంబర్ 5 నుంచి థియేటర్లలో అభిమానుల పూనకాలు ఖాయంగా కనిపిస్తోంది.
{{/usCountry}}ఈ సినిమా ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దేశభక్తికి సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ను జోడించి తీసిన మూవీగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో రెండు వేర్వేరు పాత్రల్లో బాలయ్య నటించాడు. తొలిసారి అఘోరా పాత్రలో అతడు నట విశ్వరూపం చూపించినట్లు ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే తెలుస్తోంది. ఆ లెక్కన డిసెంబర్ 5 నుంచి థియేటర్లలో అభిమానుల పూనకాలు ఖాయంగా కనిపిస్తోంది.
{{/usCountry}}