బాలయ్య ఫ్యాన్ హా మజాకా- అఖండ 2 ఫస్ట్ టికెట్ కోసం లక్ష ఖర్చు- ఇదో వీరాభిమాని స్టోరీ!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న 'అఖండ 2' ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బాలయ్య బాబు వీరాభిమాని ఓ టికెట్ కోసం ఏకంగా రూ.లక్ష ఖర్చు పెట్టాడు. ఆ వివరాలు మీకోసం.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటంచిన లేటెస్ట్ మూవీ 'అఖండ 2'. ఇది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. బ్లాక్ బస్టర్ గా నిలిచిన అఖండ మూవీ సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగా బాలకృష్ణ అభిమాని ఒకరు అఖండ 2 టికెట్ ఏకంగా రూ.లక్ష ఖర్చు పెట్టడం విశేషం.

అఖండ 2 టికెట్ లక్ష
జర్మనీలో అఖండ 2 డిస్ట్రిబ్యూటర్లు అయిన తారక రామ ఎంటర్‌టైన్‌మెంట్స్ అక్కడ తొలి టికెట్ కోసం వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో భారతీయ మూలాలున్న ఒక అభిమాని ఏకంగా రూ.1 లక్ష ఖర్చు చేశాడు. జర్మనీలోని ఐదు ప్రాంతాల్లో తొలి టికెట్‌ను అభిమానులు కొనుగోలు చేసేందుకు వేలం పాట నిర్వహించినట్లు డిస్ట్రిబ్యూటర్లు తారక రామ ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు.
బాలయ్య అభిమానినే
జర్మనీలో తెలుగు సినిమాకు ఇది అనూహ్యమైన ధర అని, సినిమా హక్కులను తామే సొంతం చేసుకున్నామని కూడా డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. ఫ్రాంక్‌ఫర్ట్ కు చెందిన రాజశేఖర్ పర్ణపల్లి అనే అభిమాని ఏకంగా రూ.1 లక్షకు టికెట్ కొనుగోలు చేశారు.
బాలకృష్ణపై తనకున్న ప్రేమను వివరిస్తూ.. 'నేను ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నేను బాలయ్య అభిమానినే. నా ఊరు సీమ ఆంధ్ర రుచులను ఇక్కడ అనుభూతి చెందుతున్నా. ఆనందపురంలో బాలకృష్ణ సినిమా విడుదలకు కటౌట్లు, బ్యానర్లు కట్టేవాణ్ని. ఇప్పుడు నేను ఇక్కడ ఏమీ కోల్పోతున్నట్లు అనిపించడం లేదు. నందమూరి కుటుంబ అభిమానిగా ఈ టికెట్ కొనుగోలు చేయడం గర్వంగా ఉంది’’ అని రాజశేఖర్ తెలిపాడు.
అఖండ 2 గురించి..
'అఖండ 2: తాండవం' అనేది బోయపాటి, బాలకృష్ణ కాంబోలో 2021లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'అఖండ'కు సీక్వెల్. ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాను 14 రీల్స్ ప్లస్, ఐవీఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపి ఆచంట, ఇషాన్ సక్సేనా నిర్మించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ పుట్టుకతో విడిపోయిన అఘోరా 'అఖండ', మంచివాడు 'మురళీ కృష్ణ' అనే కవల పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అఖండతో
కోవిడ్-19 కారణంగా పరిశ్రమ మందగించిన సమయంలో 'అఖండ' సినిమా పరిశ్రమకు ఎలా జీవం పోసిందో వివరిస్తూ బాలకృష్ణ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడారు.
'నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మా నాన్న (దివంగత ఎన్టీఆర్). ఈ రోజుల్లో సినిమా ఒక అవసరంగా మారింది. నాణ్యమైన కంటెంట్‌ను అందించడం పరిశ్రమ బాధ్యత. కోవిడ్ కారణంగా పరిశ్రమ కష్టాల్లో ఉన్నప్పుడు. 'అఖండ' భారీ సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించడం ద్వారా ఉపశమనాన్ని ఇచ్చింది' అని బాలయ్య అన్నారు. 'అఖండ' ప్రపంచవ్యాప్తంగా రూ.117 కోట్లు వసూలు చేసింది. సీక్వెల్ దానిని అధిగమిస్తుందో లేదో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


