...
...
Next Story

అఖండ 2 రిలీజ్‌కు థియేటర్లో అలా చేయొద్దు.. వేటిని చంపొద్దు.. అభిమానుల‌కు బాల‌కృష్ణ రిక్వెస్ట్‌.. గ‌తంలో పోలీస్ కేసు!

నటసింహం బాలకృష్ణ తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. అఖండ 2 రిలీజ్ సందర్భంగా జంతుబలులు వద్దని స్పష్టం చేశారు. ఇలా చేసినందుకు గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు.

Published on: Nov 29, 2025, 13:54:38 IST
Advertisement

హైదరాబాద్‌లో 'అఖండ 2' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు. అఖండ 2 రిలీజ్ సందర్భంగా జంతుబలి ఇవ్వొద్దని కోరారు. మేకలను చంపొద్దన్నారు. బాలకృష్ణ గత మూవీ రిలీజ్ సందర్భంగా ఇలా జంతుబలి ఇచ్చినందుకు ఫ్యాన్స్ పై కేసు కూడా నమోదైంది.

బాలకృష్ణ రిక్వెస్ట్

నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ అప్ కమింగ్ మూవీ అఖండ 2. బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్ లో అఖండ 2 తెరకెక్కింది. ఇది డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి బాలకృష్ణ ఓ రిక్వెస్ట్ చేశారు.

జంతుబలి వద్దు

"మీకు ఒకటి చెప్పాలి. ప్రతి ప్రాంతానికి దాని సంప్రదాయం ఉంటుంది. మీలో కొందరు సినిమా విడుదల సమయంలో మేకలను బలి ఇస్తుంటారు. దయచేసి అలా చేయవద్దు" అని బాలయ్య అన్నారు. "మరో జీవికి హాని చేయడం సబబు కాదు. అవి కూడా జీవించే హక్కును కలిగి ఉన్నాయని అర్థం చేసుకోండి. మనుషులతో సమానంగా నాలుగు కాళ్ల జంతువులను కూడా గౌరవించాలి. నా అభ్యర్థనను మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను" అని ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేశారు బాలకృష్ణ.

పోలీస్ కేసు

ఈ ఏడాది ప్రారంభంలో బాలకృష్ణ సినిమా 'డాకు మహారాజ్' విడుదల సందర్భంగా థియేటర్ దగ్గర ఒక మేకను బలి ఇచ్చారు. దీంతో ఐదుగురు అభిమానులపై కేసు నమోదైంది. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అందుకే ఆచారాల పేరుతో జంతుబలి ఇవ్వొద్దని బాలకృష్ణ ఇప్పుడు కోరారు. అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన అభిమానులను ఉద్దేశించి తన ప్రసంగం ముగించే ముందు ఈ అభ్యర్థన చేశారు.

ఫ్యాన్స్ రియాక్షన్

గతంలో బాలకృష్ణ అభిమానులు మేకను బలిచ్చి, 'డాకు మహారాజ్' పోస్టర్లపై దాని రక్తాన్ని పూసిన వీడియో కలకలం రేపింది. దీనిపై PETA (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) ఇండియా ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా తిరుపతి పోలీసులు తిరుపతిలోని ఒక థియేటర్‌లో మేకను బలి ఇచ్చిన అభిమానుల బృందంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

నందమూరి కుటుంబ అభిమానులు ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో బాలకృష్ణ అన్న కొడుకు జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర: పార్ట్ 1' సినిమా విడుదల సందర్భంగా కూడా ఇలాంటి బలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe