Balakrishna Sekhar Kammula: బాలకృష్ణ, శేఖర్ కమ్ముల.. అసలు ఈ పేర్లు పక్కపక్కన ఉండటమే ఓ ఆశ్చర్యం. అలాంటిది వీళ్లిద్దరూ కలిసి ఓ మూవీ చేయబోతుండటం మరింత ఆశ్చర్యం కలిగించేదే. ఒకరు క్లాస్ సినిమాల డైరెక్టర్.. మరొకరు గాడ్ ఆఫ్ మాసెస్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది.
బాలయ్య, కమ్ముల పొలిటికల్ థ్రిల్లర్

బాలకృష్ణ, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రాబోతుందన్నది ఈ వార్త సారాంశం. ఇప్పటికే సోషల్ మీడియాతోపాటు పలు రిపోర్టులు దీనిని తెరపైకి తీసుకొచ్చినప్పటి నుంచీ అభిమానుల్లో ఒకటే చర్చ నడుస్తోంది. అసలు బాలయ్య మాస్ ఇమేజ్ కు శేఖర్ లాంటి క్లాస్ డైరెక్టర్ ఎలాంటి కథను సిద్ధం చేస్తాడు అని. నిజానికి ఇప్పటికే ఓ పవర్ ఫుల్ స్టోరీ కూడా రెడీ అయినట్లు కూడా సమాచారం.
ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ లాంటి యూత్ మెచ్చే సినిమాలతోపాటు లీడర్ లాంటి యువతకు సందేశం ఇచ్చే మూవీస్ కూడా తీసిన శేఖర్ కమ్ముల.. బాలయ్య కోసం మాంచి పొలిటికల్ థ్రిల్లర్ రెడీ చేస్తున్నాడట. అటు బాలయ్య కూడా తన మాస్ ఇమేజీని పక్కన పెట్టి.. సమాజానికి సందేశం ఇచ్చే మూవీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నట్లు కూడా సమాచారం. గతేడాది నాగార్జున, ధనుష్ లాంటి వాళ్లతో కలిసి కుబేర మూవీతో హిట్ అందుకున్న శేఖర్.. అదే ఊపులో ఇప్పుడు బాలయ్యతో మూవీకి రెడీ అయిపోతున్నాడు.
బాలయ్య వరుస సినిమాలు
బాలకృష్ణ ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే గోపీచంద్ మలినేనితో ఓ మూవీ షూటింగ్ సాగుతోంది. మరోవైపు మరో మాస్ డైరెక్టర్ కొరటాల శివకు ఓకే చెప్పాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి జరగనుంది. ఈ నేపథ్యంలో సడెన్ గా శేఖర్ కమ్ములతో మూవీ తెరపైకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే శేఖర్ తనకోసం సిద్ధం చేసిన కథను మెచ్చిన బాలయ్య ఇప్పటికే ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
{{/usCountry}}బాలకృష్ణ ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే గోపీచంద్ మలినేనితో ఓ మూవీ షూటింగ్ సాగుతోంది. మరోవైపు మరో మాస్ డైరెక్టర్ కొరటాల శివకు ఓకే చెప్పాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి జరగనుంది. ఈ నేపథ్యంలో సడెన్ గా శేఖర్ కమ్ములతో మూవీ తెరపైకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే శేఖర్ తనకోసం సిద్ధం చేసిన కథను మెచ్చిన బాలయ్య ఇప్పటికే ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
{{/usCountry}}తన సినిమాల్లో హీరోలను చాలా క్లాస్ గా చూపిస్తూ.. సున్నితమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరించే శేఖర్ కమ్ముల.. బాలయ్యలాంటి మాస్ హీరోను ఎలా హ్యాండిల్ చేస్తాడన్న చర్చ నడుస్తోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే కనుక టాలీవుడ్ లో అదొక సెన్షేషన్ అవుతుంది. నిజానికి మొదట్లో ఆశ్చర్యం కలిగించే కాంబినేషన్లే తర్వాత బ్లాక్‌బస్టర్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడిది కూడా అలాంటిదే అవుతుందన్న ఆశతో బాలకృష్ణ అభిమానులు ఉన్నారు.