...
...
Next Story

ప్రపంచంలో 50 ఏళ్లుగా హీరోగా చేసిన ఏకైక నటుడిని నేనే.. మద్రాస్ నా జన్మభూమి: చెన్నైలో తమిళంలో ఇరగదీసిన బాలకృష్ణ

అఖండ 2 మూవీ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో తమిళంలోనూ ఇరగదీశాడు బాలకృష్ణ. ఈ సందర్భంగా మద్రాస్ ను తన జన్మభూమిని అని చెప్పిన అతడు.. ప్రపంచంలో 50 ఏళ్లుగా హీరోగా చేసిన ఏకైక వ్యక్తిని తానే అని చెప్పడం విశేషం.

Published on: Dec 3, 2025, 21:35:53 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలకృష్ణ, బోయపాటి శ్రీను టీమ్ ప్రస్తుతం అఖండ 2 మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ శుక్రవారం (డిసెంబర్ 5) సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండగా.. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర చోట్లా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. బుధవారం (డిసెంబర్ 3) మూవీ టీమ్ చెన్నైలో మీడియాతో మాట్లాడగా.. బాలయ్య బాబు తమిళంలో ఇరగదీశాడు.

బాలకృష్ణ తమిళ స్పీచ్

ప్రపంచంలో 50 ఏళ్లుగా హీరోగా చేసిన ఏకైక నటుడిని నేనే.. మద్రాస్ నా జన్మభూమి: చెన్నైలో తమిళంలో ఇరగదీసిన బాలకృష్ణ
ప్రపంచంలో 50 ఏళ్లుగా హీరోగా చేసిన ఏకైక నటుడిని నేనే.. మద్రాస్ నా జన్మభూమి: చెన్నైలో తమిళంలో ఇరగదీసిన బాలకృష్ణ

అఖండ 2 మూవీ ప్రస్తుతం ఎంతో ఆసక్తి రేపుతోంది. బాలకృష్ణ, బోయపాటి ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన వేళ ఈ రాబోయే సినిమాపైనా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో రిలీజ్ కానుండటంతో మూవీ టీమ్ ఆయా భాషల్లో ప్రమోషన్లు నిర్వహిస్తోంది. తాజాగా బుధవారం (డిసెంబర్ 3) చెన్నై వెళ్లింది. ఎక్కడికి వెళ్లినా బాలయ్య ఆ భాషల్లో మాట్లాడుతున్నాడు.

చెన్నైలోనూ అతడు తమిళంలో మాట్లాడాడు. తాను మద్రాస్ లో పుట్టానని, అందుకే ఇది నా జన్మభూమి అని అతడు అన్నాడు. ఇక తెలంగాణ తన కర్మభూమి కాగా.. ఏపీ తన ఆత్మభూమి అని బాలకృష్ణ అనడం విశేషం. తన తల్లిదండ్రుల ఆశీర్వాదంతో సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నానని, ప్రపంచంలో హీరోగా 50 ఏళ్లు చేసిన వ్యక్తిని తానే అని అతడు చెప్పడం విశేషం.

ఈ సందర్భంగా అతడు మద్రాసులో తాను గడిపిన జీవితాన్ని, తమిళ లెజెండరీ నటీనటులను అతడు గుర్త చేసుకున్నాడు. తమిళంలో అతడు అనర్గళంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. హిందీ ప్రమోషన్లలో బాలకృష్ణ హిందీలోనే మాట్లాడటంతో అతడు ఎక్కడికెళ్లినా అన్‌స్టాపబుల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అఖండ 2 మూవీ గురించి..

ఈ సినిమా ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దేశభక్తికి సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ను జోడించి తీసిన మూవీగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో రెండు వేర్వేరు పాత్రల్లో బాలయ్య నటించాడు. తొలిసారి అఘోరా పాత్రలో అతడు నట విశ్వరూపం చూపించినట్లు ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే తెలుస్తోంది. ఆ లెక్కన డిసెంబర్ 5 నుంచి థియేటర్లలో అభిమానుల పూనకాలు ఖాయంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe