Balakrishna: బాలకృష్ణ ఏం చేసినా ప్రత్యేకమే. తాజాగా ఈ గాడ్ ఆఫ్ మాసెస్ చేసిన పని సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసల వర్షం కురిసేలా చేస్తోంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీలో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోవడానికి వెళ్లిన అతడు.. అక్కడ కనిపించిన సీనియర్ నటి హేమా మాలిని కాళ్లు మొక్కడం విశేషం.
బాలయ్య గొప్పతనం

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు అందుకోవడానికి బాలకృష్ణ వెళ్లాడు. అవార్డు అందుకునే ముందు బయట అతనికి సీనియర్ నటి హేమా మాలిని కనిపించింది. దీంతో ఆమె దగ్గరికి వెళ్లి అతడు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు.
ఆ తర్వాత కాసేపు ఆమెతో ముచ్చటించిన బాలయ్య.. హేమతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. గతంలో అతని 100వ సినిమా అయిన గౌతమిపుత్ర శాతకర్ణిలో హేమా మాలిని నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె బాలయ్య తల్లి పాత్ర పోషించింది.
బాలకృష్ణకు అవార్డు
ఇండియన్ సినిమాకు బాలకృష్ణ ఇన్ని దశాబ్దాలుగా చేస్తున్న అద్భుతమైన సేవలకు గుర్తింపుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వరించింది. బుధవారం (మార్చి 25) దేశ రాజధానిలో అంగరంగ వైభవంగా మొదలైన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ 2026 వేడుకల్లో అతడు ఈ అరుదైన అవార్డును అందుకున్నాడు.
అవార్డు ప్రదానం చేసిన ఢిల్లీ సీఎం..
ఈ గ్రాండ్ అవార్డ్ సెర్మనీ న్యూఢిల్లీలోని ప్రసిద్ధ భారత్ మండపంలో చాలా కన్నులపండువగా జరిగింది. ఫిల్మ్ ఇండస్ట్రీకి బాలయ్య చేసిన విశేషమైన సేవలను గుర్తిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్వయంగా తన చేతుల మీదుగా అతనికి ఈ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు.
ఈ వేడుకల్లో కేవలం బాలకృష్ణకు మాత్రమే కాకుండా, సీనియర్ బాలీవుడ్ నటి షర్మిలా టాగూర్, అలాగే దివంగత లెజెండరీ యాక్టర్ ధర్మేంద్రకు కూడా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు దక్కాయి. ధర్మేంద్ర భౌతికంగా మన మధ్య లేకపోవడంతో, ఆయన కుటుంబ సభ్యులు వేదికపైకి వచ్చి ఆయన తరఫున ఎంతో ఎమోషనల్‌గా ఈ అవార్డును స్వీకరించారు.
ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవాలు
{{/usCountry}}ఈ వేడుకల్లో కేవలం బాలకృష్ణకు మాత్రమే కాకుండా, సీనియర్ బాలీవుడ్ నటి షర్మిలా టాగూర్, అలాగే దివంగత లెజెండరీ యాక్టర్ ధర్మేంద్రకు కూడా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు దక్కాయి. ధర్మేంద్ర భౌతికంగా మన మధ్య లేకపోవడంతో, ఆయన కుటుంబ సభ్యులు వేదికపైకి వచ్చి ఆయన తరఫున ఎంతో ఎమోషనల్‌గా ఈ అవార్డును స్వీకరించారు.
ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవాలు
{{/usCountry}}ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా వేదికపై సంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ గ్రాండ్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను అఫీషియల్‌గా ప్రారంభించారు. ఆమెతో పాటు ఆమె క్యాబినెట్ మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే ప్రముఖ స్టార్ హీరోయిన్లు హేమమాలిని, కంగనా రనౌత్, సీనియర్ నటి షర్మిలా టాగోర్ లాంటి స్టార్లు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు.
ఫ్యాన్స్ సంబరాలు.. బాలయ్య నెక్స్ట్ సినిమా..
బాలయ్యకు ఈ రేర్ అవార్డు దక్కడంతో అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీలో ఉన్న అతని తోటి నటీనటులు, ప్రముఖులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అందరూ సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణకు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక బాలయ్య నెక్స్ట్ సినిమాల విషయానికొస్తే.. డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో అతడు తన కొత్త సినిమా షూటింగ్ అప్పుడే మొదలుపెట్టేశాడు. ఇదొక పక్కా యాక్షన్ అడ్వెంచర్ ఎంటర్‌టైనర్ అని మేకర్స్ చెబుతున్నారు.