'కోర్టు' సినిమాతో మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బ్యాండ్ మేళం'. మంగళవారం (ఫిబ్రవరి 24) విడుదలైన ఈ సినిమా టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ యూత్‌ను ఆకట్టుకుంటోంది. మార్చి 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి టీజర్ ఎలా ఉంది? ఈ మూవీ విశేషాలేంటో ఇక్కడ చూడండి.
నవ్వుల విందుగా బ్యాండ్ మేళం మూవీ టీజర్

హీరో హర్ష్ రోషన్, హీరోయిన్ శ్రీదేవి.. ఈ పేరు వినగానే 'కోర్టు' సినిమాలో వారి మధ్య కెమిస్ట్రీ గుర్తుకు వస్తుంది. గతేడాది ఈ లోబడ్జెట్ సినిమాతో ఈ జంట మంచి హిట్ కొట్టింది. తన అమాయకపు నవ్వుతో శ్రీదేవి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇప్పుడు అదే క్రేజీ కాంబినేషన్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ నిర్మాణంలో వస్తున్న 'బ్యాండ్ మేళం' మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
టీజర్ ప్రారంభంలోనే హీరోయిన్ శ్రీదేవి తన తండ్రి (సాయికుమార్)తో కలిసి రీల్స్ చేస్తూ.. "నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న" అని చెప్పే డైలాగ్ హిలేరియస్‌గా ఉంది. ఇందులో హీరో, హీరోయిన్లు బావా మరదళ్లుగా కనిపిస్తున్నారు. "ప్రకృతి సిగ్నల్ ఇస్తోంది?", "పోక్సో కేసు వేసేస్తాం" వంటి పంచు డైలాగులు టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి. టీజర్ చూస్తుంటే ఇదొక ఫుల్ లెంగ్త్ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ అని స్పష్టమవుతోంది. పైగా హీరో, హీరోయిన్లు ఇద్దరూ తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడం కూడా ఆసక్తి రేపుతోంది. ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా వరకు తెలంగాణ యాసతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.
బ్యాండ్ మేళం మూవీ విశేషాలు
సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ బ్యాండ్ మేళం సినిమాకు విలక్షణ సంగీత దర్శకుడు విజయ్ బుల్గనిన్ స్వరాలు సమకూర్చాడు. ఇటీవలే దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసిన ‘తిప్పుకుంటన్నావ్’ అనే మొదటి సాంగ్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ సినిమాకు సాహిత్యం అందించడం విశేషం.
{{/usCountry}}సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ బ్యాండ్ మేళం సినిమాకు విలక్షణ సంగీత దర్శకుడు విజయ్ బుల్గనిన్ స్వరాలు సమకూర్చాడు. ఇటీవలే దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసిన ‘తిప్పుకుంటన్నావ్’ అనే మొదటి సాంగ్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ సినిమాకు సాహిత్యం అందించడం విశేషం.
{{/usCountry}}ప్రేమ, సంగీతం, భావోద్వేగాలతో పాటు కడుపుబ్బ నవ్వించే కామెడీ ట్రాక్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా మార్చి 13న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. మరి కోర్ట్ మూవీలాగే ఈ బ్యాండ్ మేళంతోనూ రోషన్, శ్రీదేవి జంట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? మరో హిట్ కొడతారా అన్నది చూడాలి.