Baththa OTT: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న విజయ్ సేతుపతి బత్తా.. రికార్డులు బ్రేక్.. సౌత్ సినిమాల్లో ఆరో స్థానం

Baththa OTT: విజయ్ సేతుపతి నటించిన ఎమోషనల్ డ్రామా మూవీ 'బత్తా' (Baththa) థియేటర్ల కన్నా ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో విపరీతమైన ఆదరణ పొందుతోంది. స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా స్ట్రీమింగ్ అయిన తొలి రెండు వారాల్లోనే ఏకంగా 4.8 మిలియన్ల వ్యూస్ సాధించి సంచలనం సృష్టిస్తోంది.

Published on: Nov 11, 2026, 18:35:19 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Baththa OTT: విజయ్ సేతుపతి, సాయి పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా, కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు అట్లీ నిర్మించిన మూవీ 'బత్తా' (Baththa). థియేటర్లలో మోస్తరు వసూళ్లతో బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలను సేఫ్ జోన్‌లోకి చేర్చిన ఈ ఎమోషనల్ డ్రామా.. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అడుగుపెట్టిన నాటి నుంచి రికార్డు వ్యూయర్‌షిప్‌తో దూసుకుపోతోంది.

Baththa OTT: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న విజయ్ సేతుపతి బత్తా.. రికార్డులు బ్రేక్.. సౌత్ సినిమాల్లో ఆరో స్థానం
Baththa OTT: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న విజయ్ సేతుపతి బత్తా.. రికార్డులు బ్రేక్.. సౌత్ సినిమాల్లో ఆరో స్థానం

స్ట్రీమింగ్ ప్రారంభమైన తొలి రోజు నుంచే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో సందడి చేస్తున్న ఈ చిత్రం.. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ నాన్-ఇంగ్లీష్ సినిమాల జాబితాలో వరుసగా రెండు వారాల పాటు టాప్ 10లో నిలిచి తన సత్తా చాటుకుంది.

12 దేశాల్లో గ్లోబల్ ట్రెండింగ్.. ఇండియాలో నంబర్ 1

నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం 'బత్తా' సాధించిన వ్యూయర్‌షిప్ వివరాలు ఇలా ఉన్నాయి.

తొలి వారం (Week 1): 2.5 మిలియన్ల (25 లక్షలు) వ్యూస్‌తో గ్లోబల్ నాన్-ఇంగ్లీష్ టాప్ 10 చార్ట్‌లో 4వ స్థానంలో నిలిచింది.

రెండో వారం (Week 2): 2.3 మిలియన్ల (23 లక్షలు) వ్యూస్‌తో గ్లోబల్ చార్ట్‌లో 6వ స్థానంలో కొనసాగుతోంది.

మొత్తం వ్యూయర్‌షిప్: కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం ఏకంగా 4.8 మిలియన్ల (48 లక్షలు) వ్యూస్ రాబట్టింది.

రెండో వారంలో ఈ సినిమా ఇండియా, శ్రీలంక దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇండియా, శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్, బహ్రెయిన్, కువైట్, మాల్దీవులు, ఒమన్, పాకిస్థాన్, ఖతార్, సింగపూర్, యూఏఈ, మారిషస్ సహా మొత్తం 12 దేశాలలో టాప్ 10 ట్రెండింగ్ మూవీగా నిలిచింది.

'ఉస్తాద్ భగత్ సింగ్', 'అఖండ 2'లను దాటేసిన ‘బత్తా’

2026లో థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన అత్యధిక వ్యూస్ సాధించిన సౌత్ ఇండియన్ సినిమాల జాబితాలో 'బత్తా' ఏకంగా 6వ స్థానానికి ఎగబాకింది. భారీ బడ్జెట్ అండ్ కమర్షియల్ చిత్రాలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘అఖండ 2’ వంటి పెద్ద సినిమాలను వ్యూస్‌లో వెనక్కి నెట్టడం విశేషం.

2026లో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా చూసిన టాప్ 10 సౌత్ సినిమాలు

1. విశ్వనాథ్ & సన్స్ (Vishwanath & Sons) - 14.6 మిలియన్లు

2. బ్లాస్ట్ (Blast) - 8.6 మిలియన్లు

3. ఇరుముడి (Irumudi) - 7.9 మిలియన్లు

4. మొదరాత్రి (Modharatri) - 5.8 మిలియన్లు

5. గట్ట కుస్తీ 2 (Gatta Kushthi 2) - 5.7 మిలియన్లు

6. బత్తా (Baththa) - 4.8 మిలియన్లు

7. యూత్ (Youth) - 4.5 మిలియన్లు

8. ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) - 4.4 మిలియన్లు

9. అఖండ 2 (Akhanda 2) - 3.9 మిలియన్లు

10. విత్ లవ్ (With Love) - 3.9 మిలియన్లు

కంటెంట్ ఉన్న సినిమాకు ఓటీటీ బ్రహ్మరథం

బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించకపోయినా, బలమైన కథాంశం, భావోద్వేగాలు ఉన్న సినిమాలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రేక్షకులు ఏ స్థాయిలో బ్రహ్మరథం పడతారో విజయ్ సేతుపతి 'బత్తా' మరోసారి నిరూపించింది. మక్కల్ సెల్వన్ సహజ నటన, అట్లీ నిర్మాణ విలువలు ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో 2026 నాటి బిగ్గెస్ట్ ఓటీటీ హిట్లలో ఒకటిగా నిలబెట్టాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More