Today OTT: భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌తో చిన్నపిల్లాడి స్నేహం.. ఇవాళ ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ మూవీ.. ఎందుకు చూడాలంటే?
Today OTT: విజయ్ సేతుపతి హీరోగా నటించిన తమిళ యాక్షన్ కామెడీ డ్రామా 'బత్తా' ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ డిఫరెంట్ గ్యాంగ్ స్టర్ మూవీని ఓటీటీలో ఎందుకు చూడాలో ఇక్కడ తెలుసుకుందాం.
Today OTT: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరు. ఆయన లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'బత్తా' (Baththa). స్టార్ డైరెక్టర్ అట్లీ సమర్పణలో బాలాజీ తరణీతరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 1న తమిళనాట థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి గొప్ప ప్రశంసలు అందుకుంది.

బత్తా ఓటీటీ రిలీజ్
తమిళంలో థియేటర్లలో రిలీజైన బత్తా మంచి విజయాన్ని అందుకుంది. అయితే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూసే అవకాశం రాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రియులు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఇవాళ (అక్టోబర్ 29) నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
సినిమా కథ విషయానికొస్తే..
1986 నాటి మద్రాసు నేపథ్యంలో బత్తా మూవీ కథ సాగుతుంది. బత్తా (విజయ్ సేతుపతి) అనే ఒక పేరుమోసిన, భయంకరమైన గ్యాంగ్ స్టర్ ను శబరి అనే ఎనిమిదేళ్ల బాలుడు అనుకోకుండా తన స్కూల్ బాత్ రూమ్ లో పెట్టి తాళం వేస్తాడు.
ఆ భయంకరమైన రౌడీ ఆ చిన్న బాత్ రూమ్ లోపల ఆకలితో, ఒంటరిగా ఎలా ఉన్నాడు? అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఓ చిన్న పిల్లాడికి, గ్యాంగ్ స్టర్ కు మధ్య అనుకోకుండా ఏర్పడిన స్నేహం వారి జీవితాలను ఎలా మార్చేసింది? అన్నదే ఈ సినిమా కథ.
ఓటీటీలో ఈ మూవీని ఎందుకు చూడాలి?
సాధారణంగా గ్యాంగ్ స్టర్ సినిమాలు అంటే రక్తపాతం, యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి. కానీ 'బత్తా' సినిమా అందుకు పూర్తి భిన్నం. ఈ మూవీలో ఎలాంటి టాక్సిక్ మస్కులినిటీ (హీరోయిజం పేరుతో చేసే అతి) కనిపించదు. ఇదొక స్వచ్ఛమైన, ఫీల్ గుడ్ ఎమోషనల్ కామెడీ డ్రామా. సెకండాఫ్ అంతా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.
భయంకరమైన రౌడీ పాత్రలో ఉంటూనే విజయ్ సేతుపతి తనలోని కామెడీ టైమింగ్ తో మరోసారి మ్యాజిక్ చేశాడు. అలాగే ఆ ఎనిమిదేళ్ల పిల్లాడిగా నటించిన మాస్టర్ సాయి పృథ్వీరాజ్ యాక్టింగ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. థియేటర్లలో మిస్ అయిన తెలుగు ప్రేక్షకులు ఎలాంటి అసభ్యత లేని ఈ క్లీన్ ఎంటర్టైనర్ ను ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ఛాయిస్.
వెంటనే చూసేయండి
విజయ్ సేతుపతి నటనకు లిజోమోల్ జోస్, శాంతి బాలచంద్రన్, బేబీ సహస్ర శ్రీల పర్ఫార్మెన్స్ తోడై సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. మురాద్ ఖేతాని, అట్లీ, ప్రియా అట్లీ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగ్గట్టుగా అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, డిఫరెంట్ కథలను ఇష్టపడే సినీ లవర్స్ వెంటనే నెట్‌ఫ్లిక్స్ లో 'బత్తా' సినిమాను చూసేయండి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


