Netflix Horror: దెయ్యాల పండుగ‌కు నెట్‌ఫ్లిక్స్ హార‌ర్ ట్రీట్‌.. వణుకు పుట్టించే 10 గోరీ మూవీస్, వెబ్ సిరీస్ లు ఇవే!

Netflix Horror: ఈ హాలోవీన్ కు నెట్‌ఫ్లిక్స్ లో కొత్త రకం భయాన్ని ఎక్స్ పీరియన్స్ చేయాలనుకుంటున్నారా? అయితే ఒళ్లు గగుర్పొడిచే రక్తపాతం, గుండెల్ని పిండేసే సైకలాజికల్ థ్రిల్స్ ఉన్న 10 బెస్ట్ గోరీ సినిమాలు, వెబ్ సిరీస్ ల లిస్ట్ మీకోసం. ట్రెండ్ అవుతున్న ఈ కంటెంట్ పై ఓ లుక్కేయండి.

Published on: Oct 28, 2026, 09:32:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Netflix Horror: ఓటీటీలో అదిరిపోయే థ్రిల్ అందించే హారర్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లు మీ కోసం ఇక్కడ రెడీగా ఉన్నాయి. టాప్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న ఈ సినిమాలు, సిరీస్ లు చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయమే.

దెయ్యాల పండుగ‌కు నెట్‌ఫ్లిక్స్ హార‌ర్ ట్రీట్‌.. వణుకు పుట్టించే 10 గోరీ మూవీస్, వెబ్ సిరీస్ లు ఇవే! (x/NetflixTudum)
దెయ్యాల పండుగ‌కు నెట్‌ఫ్లిక్స్ హార‌ర్ ట్రీట్‌.. వణుకు పుట్టించే 10 గోరీ మూవీస్, వెబ్ సిరీస్ లు ఇవే! (x/NetflixTudum)

ఏలియన్స్ (Aliens - 1986)

సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమాల్లో ఇదొక ఎపిక్ క్లాసిక్. స్పేస్ లో ఏలియన్స్ తో చేసే రక్తపాత పోరాటం, సర్వైవల్ కోసం పడే తపన ఈ సినిమాలో అద్భుతంగా ఉంటాయి. పాత సినిమానే అయినా నెట్‌ఫ్లిక్స్ లో హాలోవీన్ కు బెస్ట్ ఛాయిస్.

ది బేబీ సిట్టర్ (The Babysitter - 2017)

నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ గా వచ్చిన ఈ మూవీ హారర్ కామెడీ జానర్ లో అదిరిపోతుంది. ఒక చిన్న పిల్లాడు తన బేబీ సిట్టర్ ఒక డెవిల్ వర్షిపర్ (దెయ్యాలను ఆరాధించే వ్యక్తి) అని తెలుసుకున్న తర్వాత ఏం జరిగిందనేది ఫుల్ ఎంటర్టైనింగ్ గా, రక్తం చిందించే రేంజ్ లో ఉంటుంది.

బోన్ లేక్ (Bone Lake - 2024)

అలెక్స్ రో, మాడీ హస్సన్ నటించిన ఈ ఎరోటిక్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ రీసెంట్ గానే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఒక జంట ఏకాంతంగా గడపడానికి లేక్ హౌస్ కు వెళ్లినప్పుడు, వారి గతంలోని డార్క్ సీక్రెట్స్ ఎలా బయటపడి ప్రాణాల మీదకు తెచ్చాయో అత్యంత ఉత్కంఠభరితంగా చూపించారు.

ఈవిల్ డెడ్ (Evil Dead - 2013)

అసలు సిసలైన రక్తపాతం, వైలెన్స్ చూడాలనుకుంటే 'ఈవిల్ డెడ్' రీబూట్ చూడాల్సిందే. ఒక అడవిలోకి వెళ్లిన ఫ్రెండ్స్ గ్యాంగ్.. అక్కడ రాక్షసులను నిద్రలేపుతుంది. ఆ తర్వాత ఎలాంటి భయానక పరిస్థితులు ఎదురయ్యాయో కళ్లకు కట్టినట్లు భయపెట్టారు. ఓటీటీలో దీన్ని చూస్తే వణుకు పుట్టడం గ్యారెంటీ.

హన్నిబాల్ (Hannibal - 2013)

ఇదొక బెస్ట్ సైకలాజికల్ హారర్ సిరీస్. నరమాంస భక్షకుడైన డాక్టర్ హన్నిబాల్ లెక్టెర్ మైండ్ గేమ్స్, మర్డర్ మిస్టరీలు అత్యంత క్రూరంగా ఉంటాయి. గగుర్పాటు కలిగించే ఈ వెబ్ సిరీస్ హాలోవీన్ కు పర్ఫెక్ట్ బింజ్ వాచ్ మెటీరియల్.

మాన్స్టర్: ది లిజ్జీ బోర్డెన్ స్టోరీ (Monster: The Lizzie Borden Story - 2026)

నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ 'మాన్స్టర్' ఆంథాలజీలో వచ్చిన లేటెస్ట్ సీజన్ ఇది. 1892లో అమెరికాను వణికించిన రియల్ మర్డర్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. లిజ్జీ బోర్డెన్ తన కన్నతండ్రి, సవతి తల్లిని గొడ్డలితో క్రూరంగా ఎలా చంపిందనేది ఈ సిరీస్ లో అత్యంత భయానకంగా, రక్తపాతంతో చూపించారు.

రెడీ ఆర్ నాట్ (Ready or Not - 2019)

పెళ్లి తర్వాత కొత్త కోడలు అత్తగారింట్లో అడుగుపెడుతుంది. అయితే ఆ కుటుంబం ఒక ప్రాణాంతకమైన గేమ్ ఆడుతుంది. ఆ రాత్రి ప్రాణాలతో బయటపడటానికి ఆ నవ వధువు చేసే పోరాటం, అందులోని బ్లడ్ షెడ్ కళ్లు చెదిరేలా ఉంటాయి.

సా ఎక్స్ (Saw X - 2023)

టార్చర్, గోరీ హారర్ జానర్ కు కేరాఫ్ అడ్రస్ అయిన 'సా' ఫ్రాంచైజీ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ఇది. క్యాన్సర్ కు నకిలీ ట్రీట్మెంట్ ఇచ్చిన వారిపై జాన్ క్రామర్ తనదైన స్టైల్ లో తీసుకునే భయంకరమైన రివెంజ్ స్టోరీ ఇది.

సమ్ థింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ (Something Very Bad Is Going to Happen - 2026)

నెట్‌ఫ్లిక్స్ కు 'స్ట్రేంజర్ థింగ్స్' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డఫర్ బ్రదర్స్ నిర్మించిన సరికొత్త హారర్ సిరీస్ ఇది. ఒక వధువు తన పెళ్లికి ముందు జరగబోయే ఘోరమైన సంఘటనలను ముందే ఊహించడం, పెళ్లి మండపంలో జరిగే సైకలాజికల్ టెర్రర్ ఈ సిరీస్ కు హైలైట్.

టెక్సాస్ చైన్ సా మాసాకర్ (Texas Chainsaw Massacre - 2022)

స్లాషర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇదొక విజువల్ ఫీస్ట్. లెదర్ ఫేస్ అనే సైకో కిల్లర్ ఒక ఊరిలోకి వచ్చిన యువకులను తన చైన్ సా తో ఎలా ముక్కలుగా నరికేశాడు అనేది ఈ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీలో చూడొచ్చు.

ఈ దెయ్యాల పండుగ (హాలోవీన్) కు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా లైట్స్ ఆఫ్ చేసి నెట్‌ఫ్లిక్స్ లో ఈ టైటిల్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి. అసలైన హారర్ ఎక్స్ పీరియన్స్ పొందండి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More