OTT Horror Thriller: ఓటీటీలో తెలుగులో వణికిస్తున్న హారర్ థ్రిల్లర్-ఒంటరిగా చూసే ధైర్యం ఉందా? మనుషులను పీక్కుతినే దెయ్యం!
OTT Horror Thriller: ఆహా ఓటీటీలో 'దహాన్: ది ఈవిల్ వితిన్' అనే సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ ఒడియా సినిమా అక్టోబర్ 16 నుంచి తెలుగులో స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ప్రేక్షకులను తీవ్రంగా భయపెడుతోంది. ఈ మూవీని ఒంటరిగా చూడటం సాహసమనే చెప్పొచ్చు.
OTT Horror Thriller: హారర్, థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఈ కోవలోనే థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఐఎమ్‌డీబీ (IMDb)లో ఏకంగా 7.7 రేటింగ్ సాధించిన చిత్రమే 'దహాన్: ది ఈవిల్ వితిన్' (Dahaan: The Evil Within).

ఓటీటీ ట్రెండింగ్
ఒరిజినల్ గా దహాన్ అనేది ఒడియా సినిమా అయినప్పటికీ, డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి ఆహా (Aha) ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఆహాలో మంచి వ్యూవర్ షిప్ తో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ట్రెండ్ అవుతోంది.
సినిమా కథ ఏంటంటే
ఈ హారర్ థ్రిల్లర్ దహాన్ సినిమా కథ మొత్తం 'సింగ్ దేవ్' అనే ఒక పాడుబడిన పాతకాలపు రాజభవనం చుట్టూ తిరుగుతుంది. ఆ ఇంట్లో దెయ్యం ఉందని స్థానికులు అటు వైపు వెళ్లడానికి కూడా సాహసించరు. కానీ, అనుకోని పరిస్థితుల్లో ఒక యువతి తన అక్క, తమ్ముడితో కలిసి ఆ ఇంట్లోకి నివాసానికి వస్తుంది. అక్కడ వారు తెలియక ఒక సీక్రెట్ బాక్స్‌ను తెరుస్తారు. ఆ క్షణం నుంచే ఆ కుటుంబ జీవితం తలకిందులవుతుంది, అసలు భయం మొదలవుతుంది.
ఒళ్లు గగుర్పొడిచే హారర్ ఎలిమెంట్స్
ఆ పాత పెట్టె తెరిచిన తర్వాత అందులోంచి బయటపడిన ఒక పురాతన దుష్టశక్తి ఆ యువతిని ఆవహిస్తుంది. అప్పటి నుంచి ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయి, పిచ్చి పట్టినట్లు చేయడం, మనుషులను పీక్కుతినడం లాంటి అత్యంత జుగుప్సాకరమైన, భయానకమైన పనులు చేయడం ప్రారంభిస్తుంది.
తమ చెల్లెలిని ఆ దెయ్యం బారి నుంచి కాపాడుకునేందుకు అక్కా తమ్ముడు పడే ఆవేదన, ఒక ఫాదర్ (పాస్టర్) సాయంతో చేసే పోరాటం (ఎక్సార్సిజమ్) ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి.
హైలైట్
దహాన్ చిత్రానికి అనుపమ్ పట్నాయక్ దర్శకత్వం వహించారు. ఔరోశిఖా మిశ్రా, బర్షా పట్నాయక్, సామ్రాట్ మహాపాత్ర, జయప్రకాష్ దాస్ తదితరులు తమ పాత్రల్లో జీవించారు. ముఖ్యంగా దెయ్యం పట్టిన యువతిగా నటించిన నటి యాక్టింగ్ సినిమాకు హైలైట్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ, డార్క్ థీమ్, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ థ్రిల్‌ను అందిస్తాయి.
ఓటీటీ ఆడియన్స్ కు బెస్ట్ ఛాయిస్
రొటీన్ సినిమాలకు భిన్నంగా జంప్ స్కేర్స్ తో, ఎటువంటి అనవసరమైన రొమాంటిక్ ట్రాక్స్ లేకుండా పక్కా హారర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపొందింది. కథనంలో ఎంచుకున్న ఇజ్రాయెలీ (Hebrew) దెయ్యం కాన్సెప్ట్ కూడా కొత్తగా అనిపిస్తుంది. మీరు హారర్ సినిమాలను ఇష్టపడే వారైతే, ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'దహాన్' చిత్రాన్ని మీ వాచ్ లిస్ట్ లో కచ్చితంగా యాడ్ చేసుకోండి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


