Bellamkonda Sreenivas: సినిమాటిక్ స్టైల్లో ప్రేయసికి ప్ర‌పోజ్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. ఎంగేజ్మెంట్ వీడియో వైరల్

Bellamkonda Sreenivas: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి కావ్యతో అతని ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో తనకు కాబోయే భార్యకు సినిమాటిక్ స్టైల్లో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రపోజ్ చేసిన వీడియో తెగ వైరల్ గా మారింది. 

Published on: Apr 6, 2026, 11:37:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన ప్రేయసి కావ్య రెడ్డిని అతను పెళ్లి చేసుకోబోతున్నాడు. తాజాగా వీళ్ల ఎంగేజ్మెంట్ జరిగింది. ఆదివారం (ఏప్రిల్ 6) రాత్రి హైదరాబాద్ లో బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య నిశ్చితార్థం నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య (x/BSaiSreenivas)
బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య (x/BSaiSreenivas)

ప్రేయసికి ప్రపోజ్

బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమంలో తనకు కాబోయే భార్య కావ్యకు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాటిక్ లెవల్ లో ప్రపోజ్ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో.. ‘విల్ యూ మ్యారీ మీ’ అని రాసి ఉన్న వైట్ టీషర్ట్స్ వేసుకొని కొంతమంది కుర్రాళ్లు స్టేజీపైకి వెళ్లారు. వాళ్ల చేతుల్లోని లవ్ బెలూన్స్ ను గాల్లోకి వదిలడం కనిపించింది.

మోకాలిపై కూర్చొని

అప్పుడే ప్రేయసి కావ్యతో కలిసి స్టేజీ మీదకు వెళ్లిన బెల్లంకొండ శ్రీనివాస్ మోకాలిపై కూర్చుని ఉంగరం బయటకు తీశాడు. తనకు కాబోయే భార్య చేతికి ఆ రింగ్ ను తొడిగాడు. ఇదంతా ఊహించని కావ్య ఆశ్చర్యపోయింది. ఆమె సంతోషం పట్టలేక నవ్వుతూనే ఉంది. ఆ తర్వాత బాణాసంచా వెలుగులతో ఆకాశం మెరిసిపోయింది. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. క్యూట్ మూమెంట్స్ అంటూ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.

పరిచయ వేడుక

అయితే ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో వీళ్ల ఎంగేజ్మెంట్ అయిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ అది ఎంగేజ్మెంట్ కాదని, కావ్య పరిచయ వేడుక అని బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీనిచ్చాడు. ఇప్పుడు వీళ్ల నిశ్చితార్థం జరిగింది.

కావ్య ఎవరు?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కావ్య ఎవరు? అనేది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. అయితే కావ్యకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి పరిచయం కానీ, సంబంధం కానీ లేదు. కావ్య రెడ్డి తాత గతంలో జడ్జిగా పనిచేశారని అంటున్నారు. ఆమె తండ్రి ఓ లాయర్ అని తెలిసింది. శ్రీనివాస్, కావ్య పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లికి దారితీసిందని టాక్.

సినిమాలతో బిజీ

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ మూడు సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. టైసన్ నాయుడు, హైందవ, రామం సినిమాల్లో నటిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ లు సెలెక్ట్ చేసుకుంటూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు శ్రీనివాస్ చేస్తున్న మూడు సినిమాలు కూడా స్టోరీ పరంగా దేనికదే డిఫరెంట్ గా ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More